ఓటిటి సమీక్ష: గుడ్ లక్ జెర్రీ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీ చిత్రం

Good Luck Jerry Hindi  Movie Review In Telugu

విడుదల తేదీ : జులై 29, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: జాన్వీ కపూర్, సౌరభ్ సచ్‌దేవా, సుశాంత్ సింగ్, దీపక్ డోబ్రియాల్, మితా వశిస్ట్ తదితరులు

దర్శకత్వం : సిద్ధార్థ్ సేన్‌గుప్తా

నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా, ఆనంద్ ఎల్. రాయ్, మహావీర్ జైన్

సంగీత దర్శకుడు: అమన్, పరాగ్ ఛబ్రా

సినిమాటోగ్రఫీ: రంగరాజన్ రామబద్రన్

ఎడిటర్: ప్రకాష్ చంద్ర, సాహూ, జుబిన్ షేక్

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం డైరక్ట్ గా హాట్‌స్టార్‌లో విడుదల అయ్యింది. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ చిత్రం అయిన కొలమావు కోకిలకి అధికారిక రీమేక్. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

జెర్రీ అలియాస్ జయ కుమారి (జాన్వీ కపూర్) మసాజ్ పార్లర్‌లో పనిచేసే మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమె తన విడో తల్లి షర్బతి (మితా వశిస్ట్) మరియు సిస్టర్ తో నివసిస్తుంది. షర్బతి లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతుందని కుటుంబ సభ్యులకు తెలియడంతో పరిస్థితులు మలుపు తిరుగుతాయి. అనుకోకుండా ఒక రోజు, జెర్రీ కారణం గా ఒక డ్రగ్ స్మగ్లర్‌ పోలీసులకి పట్టుబడతాడు. ఆ స్మగ్లర్ నాయకుడు టిమ్మీ (జస్వంత్ సింగ్) పోలీసుల వల్ల పోగొట్టుకున్న కొకైన్‌ను తిరిగి తీసుకురావాలని జెర్రీని బెదిరిస్తాడు. జెర్రీ ఆ పని చేయడానికి ఒప్పుకుంటుంది. జెర్రీకి డబ్బు అవసరం ఉండటం తో డ్రగ్స్ వ్యాపారంలో చేరాలని నిర్ణయించుకుంది. జెర్రీ తన తల్లి చికిత్స కోసం డబ్బు సంపాదించిందా? డ్రగ్స్ వ్యాపారంలో ఆమె ఉండగలుగుతుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

జెర్రీ పాత్రలో జాన్వీ కపూర్ చాలా చక్కటి నటనను ప్రదర్శించింది. జెర్రీ క్యారెక్టర్‌లో ఉన్న డిఫెరెంట్ ఎమోషన్స్ ను సునాయాసంగా ప్రదర్శించింది. ఆమె తన గత చిత్రాల కంటే ఈ చిత్రం లో నటన చాలా బాగుంది.

కథ చాలా బాగుంది ఉంది. ఎంటర్ టైన్మెంట్ కి చక్కటి స్కోప్‌ ఉంది. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాల్లో డార్క్ కామెడీ నవ్వులు పూయించింది. ఒకటి చెప్పాలంటే, సెకండాఫ్‌లో దీపక్ డోబ్రియాల్ పాల్గొన్న సీక్వెన్స్ ఆసక్తికరంగా, నవ్విస్తుంది.

కష్టతరమైన ఈ క్రైమ్ కథలో హాస్యాన్ని జోడించి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం లోని సహాయ తారాగణం యొక్క అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటాయి. చక్కటి స్క్రీన్ ప్లే తో సినిమా ప్లే అయ్యే విధానం చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఈ చిత్రం క్లైమాక్స్‌ని గందరగోళానికి గురి చేయడం జరిగింది. ఇది హడావిడిగా జరుగుతుంది మరియు వ్యూయర్స్ కి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేని దుస్థితికి దారి తీస్తుంది. కొన్ని సన్నివేశాల్లో క్లారిటీ లేదు.

ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ తన స్టైల్ ను పోగొట్టుకుంది. అవసరం లేని కొత్త సబ్‌ప్లాట్‌లు దీనికి కారణం అని చెప్పాలి. అంతేకాక కొన్ని సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది.

మెయిన్ క‌థ‌లో ఉన్న ఎమోష‌న‌ల్ యాంగిల్ బాగా ప్ర‌జెంట్ కాలేదు అని తెలుస్తుంది. ఈ చిత్రంలోని డార్క్ కామెడీ అందరికీ నచ్చకపోవచ్చు. కొన్ని పాత్రలు సరైన రీతిలో ప్రదర్శించక పోవడం వలన ప్రేక్షకులు అయోమయంకి గురి అవ్వడం జరుగుతుంది.

 

సాంకేతిక విభాగం:

పరాగ్ చబ్రా సంగీతం అంత గొప్పగా లేకపోయినా, అమన్ పంత్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది, మరియు సినిమా థీమ్‌తో పర్ఫెక్ట్ సింక్‌లో ఉంది. రంగరాజన్ రామబద్రన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

దర్శకుడు సిద్ధార్థ్ సేన్‌గుప్తా విషయానికి వస్తే, అతను మంచి హాస్యంతో, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేసే పని చేసాడు. అయితే, కథలోకి ఎంటర్ అయిన కొద్దీ అతను సినిమా పై నియంత్రణ కోల్పోతాడు. సినిమా లోని డ్రామా ఇంకాస్త బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ చాలా బాగుంది.

 

తీర్పు:

మొత్తం మీద, గుడ్ లక్ జెర్రీ అక్కడక్కడ అలరిస్తుంది. సెకండ్ పార్ట్ లో ఉన్నటువంటి కొత్త సబ్‌ప్లాట్‌లతో ఆడియెన్స్ అయోమయం కి గురి అవుతారు. జాన్వీ మరియు ఇతర తారాగణం అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఎమోషనల్ అంశం మరియు క్లైమాక్స్ పై మరింత శ్రద్ధ వహిస్తే సినిమా ఇంకా బాగుండే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ చిత్రం ఓటిటి లో ఒకసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :