సమీక్ష : “హీరో” – థ్రిల్ చేసే కామెడీ డ్రామా

Hero Review In Telugu

విడుదల తేదీ : జనవరి 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య

దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి

నిర్మాత: పద్మావతి గల్లా

సంగీత దర్శకుడు: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

 

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి పరిచయం అయ్యిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అశోక్ గల్లా. ఈ యంగ్ నటుడు హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “హీరో”. మంచి ప్రమోషన్స్ మరియు బజ్ నడుమ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే అర్జున్(అశోక్ గల్లా) ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న నటుడుగా కనిపిస్తాడు అలాగే అతడి గర్ల్ ఫ్రెండే సుబ్బు(నిధి అగర్వాల్). అయితే వీరి లైఫ్ ఇలా కొనసాగుతుండగా ఓ రోజు అర్జున్ కి ఒక అనుమానాస్పద పార్సిల్ వస్తుంది. అందులో అర్జున్ లవర్ అయినటువంటి సుబ్బు తండ్రి(జగపతిబాబు) ని చంపాలని ఉంటుంది. ఇక ఈ ఊహించని ట్విస్ట్ తో అర్జున్ ఏం చేసాడు? సుబ్బు కి ఈ విషయం చెబుతాడా? ఇంతకీ ఆ పార్సిల్ పంపింది ఎవరు? ఎందుకు జగపతిబాబు పాత్రని చంపాలనుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా నటీనటుల పెర్ఫామెన్స్ లు కోసం మాట్లాడుకున్నట్టయితే తన మొదటి సినిమాలో ఎలా చేసి ఉంటాడు అనే ప్రశ్నలకి అశోక్ గల్లా మంచి సమాధానం ఇచ్చాడని చెప్పాలి. తన పాత్రకి తగ్గట్టుగా కావాల్సిన అన్ని కీలక సన్నివేశాల్లో తగు ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లు మరియు డాన్స్ విషయాల్లో అశోక్ సూపర్బ్ డెబ్యూ ని ఇచ్చాడు. అలాగే తన లుక్స్ పరంగా కూడా సినిమాలో బాగా కనిపించి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. తన డైలాగ్ డెలివరీ కానీ కామెడీ టైమింగ్ గాని సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా అయితే తన వల్ల సినిమాకి అయ్యింది అంతా అందించాడు.

ఇక అలాగే యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పాలి. మళ్ళీ తనలోని గ్లామర్ డోస్ ని చూపిస్తూనే అమేజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది. అలానే అశోక్ తో కొన్ని సీన్స్ లో మంచి కెమిస్ట్రీ కనబరిచింది.

ఇక అలాగే నటుడు జగపతి బాబు కూడా మంచి పాత్రలో కనిపించారు. ఇటీవల చేసిన పాత్రలకి కాస్త డిఫరెంట్ గా ఇది కనిపిస్తుంది. దానిలో జగ్గు భాయ్ సాలిడ్ పెర్ఫవుమెన్స్ ని కనబరిచారు. ఇంకా నటుడు బ్రహ్మాజీ కి కూడా మంచి స్క్రీన్ స్పేస్ ఉండడంతో తన పాత్రలో మంచి నవ్వులు పూయించారు. అలానే సత్యా మరియు ‘వెన్నెల’ కిషోర్ ల ఎంటర్టైనింగ్ ట్రాక్స్ ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తాయి.

ఇక నటీనటుల కోసం పక్కన పెడితే సినిమాలో మరికొన్ని అంశాలు కాస్త ఆసక్తిగా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతాయి. అలానే ఇదే టైం లో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ముందు చెప్పినట్టుగా సినిమాలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథనం ఫస్ట్ హాఫ్ వరకు సాగి ఆడియెన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ఈ ఆసక్తికి మాత్రం దర్శకుడు సరైన ముగింపు ఇవ్వలేకపోయాడు. చాలా లాజిక్ లెస్ గా కొన్ని సీన్లు తెరకెక్కించడం ఒకింత సిల్లీగా అనిపిస్తుంది.

ఎంత కామెడీ పెట్టినా సస్పెన్స్ ఎలిమెంట్స్ దగ్గరకి వచ్చినపుడు లాజికల్ గా ఒక ముగింపు ఇస్తేనే చూసే ఆడియెన్ కి పరిపూర్ణంగా అనిపిస్తుంది. అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. అలాగే కొన్ని ట్విస్టులు రివీల్ అయ్యాక కథనం అంతా ఎంటర్టైన్మెంట్ మీదనే ఫోకస్ పెట్టినట్టుగా మారుతుంది దీంతో కొద్దిగా పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు, సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా వేసిన సెట్టింగ్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. అలాగే కంపోజర్ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అలాగే పాటల ఫ్లో కూడా కరెక్ట్ గా సెట్ చేశారు. అలాగే సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ ల సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఇంకా ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ లో డైలాగ్స్ బాగున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వర్క్ కి వస్తే ఈ సినిమాకి మంచి వర్క్ ఇచ్చాడని చెప్పాలి. తాను తీసుకున్న సబ్జెక్ట్ దానిలో ఫన్ కలిపి ఆల్ మోస్ట్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా తన స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. యంగ్ హీరో అశోక్ కి మంచి డెబ్యూ తన డైరెక్షన్ తో ఇచ్చాడని చెప్పాలి. కాకపోతే కొన్ని లాజిక్స్ మాత్రం మిస్సయ్యాడు అవి పక్కన పెడితే ఈ సినిమాకి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే.. ఈ “హీరో” సంక్రాంతి బరిలో వచ్చి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సహా డీసెంట్ కామెడీ తో ఆడియెన్స్ ని అలరిస్తాడని చెప్పొచ్చు. అలాగే తన డెబ్యూ చిత్రానికి అశోక్ గల్లా పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి. ఇంకా తనని తాను మెరుగు పరుచుకునే అవకాశం ముందుంది దానికి ఈ హీరో వారధి. అలానే నిధి సహా మిగతా నటీనటులు పెర్ఫామెన్స్ లు కామెడీ ఎపిసోడ్ లు డెఫినెట్ గా ఆకట్టుకుంటాయి. కొన్ని లాజికల్ ఎర్రర్స్ ని పక్కన పెడితే ఈ పండుగకి ‘హీరో’ బాగానే ఎంటర్టైన్ చేస్తాడు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version