విడుదల తేదీ : డిసెంబర్ 14, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : తేజు కూరపాటి , అభినవ్ మేడిశెట్టి , దినేష్ తేజ్ , తేజస్ కంచెర్ల
దర్శకత్వం : శ్రీ హర్ష కోనుగంటి
నిర్మాత : బెక్కం వేణుగోపాల్
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
ఎడిటర్ : విజయ్ వర్ధన్
‘ఉండిపోరాదే’ అనే సాంగ్ తో యువత దృష్టిని ఆకర్షించిన చిత్రం హుషారు. నూతన దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
చై , ధృవ్ , ఆర్య , బంటీ నలుగురుక్లోజ్ ఫ్రెండ్స్ . చదువు అంటే ఇంట్రస్ట్ ఉండక లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పుడు అలాగే ఎంజాయ్ చేస్తూ కలిసి వుండాలనుకుంటారు ఆనలుగురు. ఈ క్రమంలో చై కాన్సర్ బారిన పడతాడు ఆపరేషన్ కు బాగా ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడంతో చై ను బ్రతికించుకొవడం కోసం మిగిలిన ముగ్గురు ఏం చేశారు? చివరికి వారి జీవితాలు ఏమాయ్యాయి ? అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు చై , ధృవ్ , ఆర్య , బంటీ పాత్రలు సినిమాకు మెయిన్ ప్లస్ అయ్యింది. ఆ పాత్రల్లో నటించిన వారు అందరు కొత్త వారైనా చాలా సహజంగా నటిస్తూ సినిమాకు హైలైట్ అయ్యారు. అలాగే రాహుల్ రామకృష్ణ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ గా నిలిచాడు. తన దైన కామెడీ టైమింగ్ తో సినిమాను నిలబెట్టేప్రయత్నం చేశాడు.
ఇక దర్శకుడు శ్రీ హార్ష రాసుకున్న కథలో కొత్తదనం లేకున్నా దాన్ని యూత్ కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో చాలా వరకు విజయం సాధించాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే సినిమాలోకి తీసుకెళ్లాలా చేశాడు.
మైనస్ పాయింట్స్ :
శ్రీ హర్ష రాసుకున్న కథ కొత్తదేమీ కాకపోవడంతో సినిమా అంత ఊహాజనితంగా వుంటూ ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయింది. ఇక యూత్ ను టార్గెట్ చేసుకొని కథను నడిపించిన ఆయన దానికి తగ్గట్లు డబల్ మీనింగ్ డైలాగ్స్ రాసుకున్నాడు. యూత్ కు అవి నచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఇబ్బందిలా అనిపిస్తుంది.
అలాగే రాహుల్ రామకృష్ణ తో ఎంటర్టైన్ చేయించాలని ప్రయ్నతించిన దర్శకుడు ఆ ప్రయత్నంలో కొంత విజయం సాధించిన చాలా చోట్ల ఆయన కామెడీ అతిగా అనిపిస్తుంది. ఇక ఈచిత్రంలో లవ్ ట్రాక్ కూడా ఏమంత కొత్తగా ఉండదు. చూసి చూడగనే లవ్ లో పడిపోవడం వంటి సన్నీవేషాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం :
కథ పాతదే అయినా కథనంతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించిన దర్శకుడు ఆ ప్రయత్నంలో చాలా వరకు విజయం సాదించగలిగాడు కానీ అన్ని వర్గాల వారిని మెప్పించలేకపోయాడు. ఇక ఈ చిత్రానికి రాధన్ మ్యూజిక్ హైలైట్ అయ్యింది. ముఖ్యంగా ‘ఉండిపోరాదే’ సాంగ్ చాలా కాలం గుర్తిండిపోతుంది.
ఇక సన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అలాగే రాజ్ తోట కెమెరా పనితనం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించింది. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ క్రిప్సీ గా వుంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సినిమాకు అవసరమైనా మేర ఖర్చు పెట్టారు.
తీర్పు :
యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం టార్గెట్ ను పూర్తిగా చేరుకోలేకపోయింది, బలమైన ఎమోషనల్ సన్నివేశాలు లేకపోవడం, రొటీన్ కథ ఈ చిత్రంలో మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం యూత్ కు నచ్చే ఛాన్స్ వుంది కానీ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team