సమీక్ష : ‘ఇదే మా క‌థ‌’ – కొన్ని ఎమోషన్స్ మాత్రమే !

Idhe Maa Katha Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 2, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ తదితరులు

దర్శకుడు: గురు పవన్
నిర్మాత: మహేష్ గొల్లా

సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్
సంగీత దర్శకుడు: సునీల్‌ కశ్యప్‌
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ


సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన రోడ్ జ‌ర్నీ చిత్రం “ఇదే మా క‌థ‌”. గురు పవన్ దర్శకత్వంలో మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్‌లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అజయ్ (సుమంత్ అశ్విన్), లక్ష్మి (భూమికా చావ్లా), మహేంద్ర ( శ్రీకాంత్) మేఘన (తాన్య హోప్) నలుగురూ రోడ్ జ‌ర్నీలో అనుకోకుండా కలిసి తమ జ‌ర్నీని స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. లక్ష్మి తన తండ్రి ఆశయం కోసం జర్నీ స్టార్ట్ చేస్తే.. అజయ్ తనకి ఇష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మహేంద్ర తన లవర్ తులసి కోసం ఈ జర్నీ చేస్తాడు. మరి ఈ జర్నీలో ఒకరికి ఒకరు ఎలా సాయపడ్డారు ? ఒకరు కోసం ఒకరు ఎలా నిలబడ్డారు ? ఈ క్రమంలో మేఘన – అజయ్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? చివరకు మహేంద్ర జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్, భూమికా చావ్లా తమ నటనతో తమ స్క్రీన్ ప్రెజెన్సీతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సినిమాలో రోడ్ జర్నీ సన్నివేశాలు.. అదేవిధంగా ఆ జర్నీలో అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు, ఈ క్రమంలో ఎదురయ్యే బావోద్వేగాలు బాగున్నాయి. ఇక హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు.

తాన్య హోప్ తో సాగే సీన్స్ లో సుమంత్ నటన బాగుంది. తాన్య హోప్ కూడా తన అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక సప్తగిరి, పృథ్విరాజ్ తమ కామెడీ టైమింగ్‌ తో బాగా నవ్వించారు. బైక్ ను కథకు టర్నింగ్ పాయింట్ గా దర్శకుడు చాల బాగా తీసుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు గురు పవన్ ఈ సినిమాలో నాలుగు క్యారెక్టర్స్ జర్నీలో కొన్ని బలమైన ఎమోషన్స్ పెట్టి మంచి ఫీల్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే, అలాగే ఆ పాత్రల్లో ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

అదే విధంగా రెగ్యులర్ కామెడీతో అక్కడక్కడా నవ్వించినా ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసారు. అయితే ప్రేక్షకులు మాత్రం సప్తగిరి ట్రాక్ లో వచ్చే కామెడీకి నవ్వుకుంటారు. ఇక ప్రధాన పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ క్లైమాక్స్ కే పరిమితం చేసి సింఫుల్ గా ముగించారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని జర్నీ సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించారు. సునీల్‌ కశ్యప్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను సి. రామ్‌ప్రసాద్ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత మహేష్ గొల్లా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘ఇదే మా క‌థ‌’ అంటూ రోడ్ జర్నీ అడ్వెంచర్‌ గా వచ్చిన ఈ ఎమోషనల్ జర్నీలో కొన్ని ఎమోషన్స్, నిర్మాణ విలువలు, కొన్ని లాంగ్ జర్నీ సీన్స్ బాగున్నాయి. అయితే స్లో ప్లే, సింపుల్ ట్రీట్మెంట్ సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే నటీనటుల నటన ముఖ్యంగా శ్రీకాంత్, భూమికా చావ్లా తమ నటనతో మెప్పించారు. రోడ్ జర్నీ అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here for English Version

Exit mobile version