సమీక్ష: ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సిరీస్

సమీక్ష: ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సిరీస్

Published on Jan 20, 2024 12:15 AM IST
Indian Police Force Movie Review in Hindi

విడుదల తేదీ : జనవరి 19, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, మయాంక్ టాండన్, శరద్ కేల్కర్, వైదేహి పరశురామి, శ్వేతా తివారీ, ముఖేష్ రిషి తదితరులు.

దర్శకుడు : రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్

నిర్మాతల: రోహిత్ శెట్టి

సంగీత దర్శకులు : లిజో జార్జ్ డీజే, చేతస్

సినిమాటోగ్రఫీ: గిరీష్ కాంత్, రజా మెహతా

ఎడిటర్: బంటీ నాగి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన యాక్షన్ వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ సిరీస్ ని రోహిత్ శెట్టి తెరకెక్కించగా సిద్దార్ధ మల్హోత్రా, శిల్పా శెట్టి తదితరులు కీలక పాత్రలు చేసారు. మరి నేడు విడుదలైన ఈ సిరీస్ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

కథ :

దేశ రాజధాని ఢిల్లీ లో వరుసగా కొన్ని బాంబ్ బ్లాస్ట్ లు జరగడంతో అక్కడి పోలీసులు ఒకింత షాక్ కి గురై ఆలోచనలో పడతారు. స్పెషల్ ఢిల్లీ పోలీస్ టీమ్ సభ్యులైన కబీర్ మాలిక్ (సిద్దార్ధ మల్హోత్రా), విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్) ఇద్దరికీ కూడా ఆ బ్లాస్ట్స్ చేసిన టెర్రరిస్ట్ ముఠాలను పట్టుకునేందుకు ఆదేశాలు జారీ అవుతాయి. గుజరాత్ ఏ టి ఎస్ చీఫ్ తారా శెట్టి (శిల్పా శెట్టి) తో కలిసి వారిద్దరూ ఈ కేసులో పని చేస్తారు. ఆమె సహాయంతో ఈ వరుస బ్లాస్ట్స్ కు కారణమైన హైదర్ ఆకా జరార్ (మయాంక్ టాండన్) కు విక్రమ్ బక్షి, కబీర్ మాలిక్ దగ్గరవుతారు. మరి అనంతరం ఏమి జరిగింది, తారా శెట్టి సాయంతో వారు చివరిగా కేసుని చేధించారా, హైదర్ వీరి స్నేహాన్ని గుర్తించి ఏమి చేసాడు, వారిని పట్టుకున్నారు లేదా, ఇలా మిగతావి అన్ని కూడా సిరీస్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా యాక్షన్ సినిమాలు, సిరీస్ లు ఇష్టపడేవారికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఎంతో బాగా నచ్చుతుంది అని చెప్పాలి. యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలు సిరీస్ లో అద్భుతంగా ఉన్నాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే రొటీన్ గా కాకుండా మరింత బాగా చిత్రీకరించారు. ఆ విషయంలో సినిమాటోగ్రాఫర్స్ ఇద్దరినీ మెచ్చుకుని తీరాలి. యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ ఉన్న సిరీస్ కానప్పటికీ తన పాత్ర యొక్క పరిధి మేరకు సిద్దార్థ మల్హోత్రా ఆకట్టుకున్నారు. అతడి యాక్షన్ సీన్స్ ఎంతో బాగున్నాయి. కీలకమైన టెర్రరిస్ట్ సూత్రధారి గా నటించిన మయాంక్ టాండన్ నటన ఎంతో బాగుంది. ఈ సిరీస్ లో చిత్రికరించిన యాక్షన్ బ్లాక్స్ కోసం ఎంచుకున్న లొకేషన్స్ కూడా బాగున్నాయి .

మైనస్ పాయింట్స్ :

రోహిత్ శెట్టి నుండి కోరుకునే మసాలా ఎంటర్టైనర్స్ ని ఇష్టపడే వారు ఇండియన్ పోలీస్ ఫోర్స్ చక్కగా చూసేయవచ్చు. ఎప్పుడూ ఆయన తీసే సినిమాల మాదిరిగా ఇది కూడా ఎంతో స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా అలానే ఎటువంటి పెద్దగా ట్విస్ట్ లు టర్న్ లు లేకుండా ముందుకు సాగుతుంది. మనము ఈ సిరీస్ నుండి సాలిడ్ క్యారెక్టరైజెషన్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లాట్ వంటివి ఆశిస్తే మాత్రం డిజప్పాయింట్ అవుతాము. ఇక ఈ సిరీస్ లో కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. అయితే సినిమాల మాదిరిగా కాకుండా ఎక్కువగా సిరీస్ లో ఇన్ డెప్త్ అంశాలు ఆధారంగానే ముందుకు సాగడం చూస్తుంటాము. కానీ ఈ సిరీస్ మాత్రం అందుకు భిన్నంగా సినిమా స్టైల్ లో వెళుతుంది. ఇక రోహిత్ శెట్టి ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని తన సినిమాల్లో మాదిరిగా ఇక్కడ కూడా వాడారు. శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ లకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. ఇషా తల్వార్ క్యామియో పెద్దగా ఇంట్రెస్టింగా లేదు. అలానే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెద్దగా బాలేదు.

సాంకేతిక వర్గం :

లిజో జార్జ్ డీజే, చేతస్ లు కంపోజ్ చేసిన మ్యూజిక్ ఓకె అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరింత వర్క్ చేయాల్సింది. ఇక సినెమాటోగ్రాఫర్స్ ఇద్దరూ కూడా బాగా వర్క్ చేసారు. ముఖ్యంగా వారు తీసిన యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ బాగుంది, చాలా వరకు స్టోరీ రేసీ గా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ విఎఫ్ఎక్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. రోహిత్ శెట్టి తో పాటు సుశ్వంత్ ప్రకాష్ దీనికి తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ శెట్టి మాస్ మసాలా యాక్షన్ ఎంటెర్టైనర్స్ మాదిరిగా ఇది కూడా కథతో ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ లాజిక్స్ వెతకకూడదు.

తీర్పు:

మొత్తంగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే ఈ యాక్షన్ సిరీస్, ముఖ్యంగా యాక్షన్ సినిమాలు సిరీస్ లు చూసే వారికి బాగా నచ్చుతుంది. పలు రియలిస్టిక్ యక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయి. సిద్దార్థ మల్హోత్రా, మాయాంక టాండన్ ఆకట్టుకునే నటన కనబరిచారు. పోలీసులు, టెర్రరిస్టుల మధ్య జరిగే పిల్లి ఎలుక ఆట బాగుంటుంది. టిపికల్ యాక్షన్ తో కూడిన జనరల్ ఫార్ములాటిక్ పద్దతిలో రోహిత్ శెట్టి ఈ సిరీస్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించలేదు. అయితే నార్మల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఇష్టపడేవారు దీనిని చూసేయొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు