విడుదల తేదీ : జూన్ 29, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: హారిసన్ ఫోర్డ్, ఫోబ్ వాలెర్-బ్రిడ్జ్, ఆంటోనియో బాండెరాస్, జాన్ రైస్-డేవీస్, టోబి జోన్స్, బోయ్డ్ హోల్‌బ్రూక్, ఎతాన్ ఇసిడోర్ మరియు మాడ్స్ మిక్కెల్‌సెన్
దర్శకుడు : జేమ్స్ మాన్ గోల్డ్
నిర్మాతలు : కాథ్లీన్ కెన్నెడీ, ఫ్రాంక్ మార్షల్ మరియు సైమన్ ఇమాన్యుయెల్
సంగీతం: జాన్ విలియమ్స్
సినిమాటోగ్రఫీ: ఫెడాన్ పాపామిచెల్
ఎడిటర్ : మైఖేల్ మెక్‌కస్కర్, ఆండ్రూ బక్‌ల్యాండ్ మరియు డిర్క్ వెస్టర్‌వెల్ట్
సంబంధిత లింక్స్: ట్రైలర్
హాలీవుడ్ లో ఉన్నటువంటి సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ లో స్టీవెన్ స్పీల్ బర్గ్ తెరకెక్కించిన వింటేజ్ వండర్ చిత్రాలు “ఇండియానా జోన్స్” ఫ్రాంచైజ్ కూడా ఒకటి. మరి ఈ అడ్వెంచర్ ఫ్రాంచైజ్ లో 15 ఏళ్ళు తర్వాత వచ్చిన లేటెస్ట్ సినిమానే “ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ”. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్లాన్ చేయబడగా ఆ టైం లో ఇండియానా జోన్స్ గా పేరుగాంచిన హెన్రీ జోన్స్(హారిసన్ ఫోర్డ్) ఓ రీసెర్చ్ లో నాజీలకి పట్టుబడతాడు. అయితే ఇదే క్రమంలో డైల్ ఆఫ్ డెస్టినీ అనే అంతికేతెరా ని జోన్స్ కనుక్కుంటాడు. తర్వాత 1969లో జర్గెన్ వాలెర్ అనే నాసా ఆస్ట్రో సైంటిస్ట్ ఆ యాంటికీతెరా తో గతాన్ని మార్చాలి అనుకుంటాడు. మరి ఈ క్రమంలో ఆ అంతికేతర జోన్స్ నుంచి హెలెనా షా(ఫోబే వాలర్-బ్రిడ్జ్)అనే ఒకామె దొంగిలించేస్తుంది. మరి అసలు ఈ అంతికేతర ఏంటి? దానిని ఉపయోగించి గతాన్ని ఎందుకు మార్చాలి అనుకుంటున్నాడు? ఈ సమయంలో జోన్స్ ఏం చేస్తాడు అనే ఇతర ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రం ఈ సిరీస్ లో లాస్ట్ సినిమా కావడంతో ఆడియెన్స్ లో మెయిన్ గా ఈ సిరీస్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. పార్ట్ 4 పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ సినిమాపై లాస్ట్ సినిమా అని మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి వాటికి తగ్గట్టే ఈ సినిమాలో పలు అంశాలు ఈ సిరీస్ ఫాన్స్ ని థ్రిల్ చేస్తాయి అని చెప్పొచ్చు.
మెయిన్ గా హారిసన్ ఫోర్డ్ ని యంగ్ ఏజ్ లో చూపించిన పలు సన్నివేశాలు ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. ఇక ఓల్డ్ ఏజ్ జోన్స్ గా కనిపించిన సన్నివేశాలు ఈ ఏజ్ లో కూడా కొన్ని అడ్వెంచరస్ సీన్స్ కూడా బావున్నాయి. 80 ఏళ్ల ఏజ్ లో కూడా తాను సినిమా కోసం కష్టపడడం ఇంప్రెసివ్ అంశం అని చెప్పాలి.
ఇక హెలెనా షా గా కనిపించిన ఫోబే వాలర్ బ్రిడ్జ్ మంచి నటన కనబరిచింది. తన రోల్ లో అయితే సాలిడ్ షేడ్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా ఫ్యాన్స్ కోరుకునే ఇంట్రెస్టింగ్ క్రేజీ ఛేజింగ్ సీక్వెన్స్ లు మంచి థ్రిల్ చేస్తాయి. అలాగే పలు సీన్స్ లో గ్రాండ్ విజువల్స్ గాని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని ఇంప్రెసివ్ గా ఉంటాయి.
మైనస్ పాయింట్స్ :
చాలా మందికి ఈ సినిమా విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. వింటేజ్ లో వచ్చిన సినిమాలు తరహాలో దీనికి ముందు చేసిన సినిమా కూడా అలాగే ఇది కూడా పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా లేదని చెప్పాలి. మోడ్రన్ వీక్షణలో ఏదో మ్యాజిక్ మిస్ అయ్యిన భావన మళ్ళీ కలుగుతుంది.
దాదాపు 4 దశాబ్దాల ఈ ఫ్రాంచైజ్ లో లాస్ట్ సినిమా ఇది దీనితో జోన్స్ పాత్రకి ఇంకా బెటర్ ఎండింగ్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. మొదటి సగం సినిమా అంతా మంచి ట్రీట్ ఇస్తూ ఆసక్తిగా సాగుతుంది కానీ సెకండాఫ్ మాత్రం ఫ్లాట్ అయ్యిపోయింది. దీనితో కాస్త డిజప్పాయింటింగ్ గా అనిపిస్తుంది.
చాలా సీన్స్ కాస్త ఊహించదగినట్టే ఉండగా కొత్తదనం కోరుకునేవారికి ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా మరికాస్త ఎక్కువగా ఉండాల్సింది. అలాగే మెయిన్ లీడ్ సహా ఇతర నటులపై మరింత బెటర్ సీక్వెన్స్ లు డిజైన్ చేయాల్సింది.
ఇక ఫైనల్ గా అయితే ఈ సినిమాలో కనిపించిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంత లాజికల్ గా కూడా అనిపించదు. ఈ ఫ్రాంచైజ్ లో ఈ కాన్సెప్ట్ తో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అయినప్పటికీ కాస్త అర్ధవంతంగా లాజికల్ గా చూపించి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం :
గత సినిమాల్లో ఏ రేంజ్ నిర్మాణ విలువలు ఉన్నాయో ఈ చిత్రంలో అంతకు మించే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆ గ్రాండియర్ విజువల్స్ అన్నీ భారీ లెవెల్లో కనిపిస్తాయి. ఇక టెక్నీకల్ టీం లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ లు ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ లో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఎడిటింగ్ మాత్రం మరికాస్త బెటర్ గా చేయాల్సింది. కొన్ని సీన్స్ ని సెకండాఫ్ లో తగ్గించాల్సింది.
ఇక ఈ చిత్ర దర్శకుడు జేమ్స్ మాన్ గోల్డ్ విషయానికి వస్తే..డెఫినెట్ గా స్టీవెన్ స్పీల్ బర్గ్ ని మ్యాచ్ చేయలేదని చెప్పొచ్చు. కానీ ప్రయత్నం అయితే పర్వాలేదు. మెయిన్ గా ఎంగేజింగ్ సెకండాఫ్ ని, స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసి ఉంటే మాత్రం ఈ ఫ్రాంచైజ్ కి ఒక గుడ్ ఎండింగ్ ఇచ్చినట్టు అనిపించేది.
తీర్పు :
ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే ఈ “ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ” ఈ ఫ్రాంచైజ్ లో చివరి సినిమాగా వచ్చి ఫ్యాన్స్ ని అయితే మెప్పించవచ్చు. కానీ అది పూర్తి స్థాయిలో ఉండదని చెప్పాలి. కొన్ని సీక్వెన్స్ లు ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి కానీ ఓవరాల్ గా ఈ చిత్రం యావరేజ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ బెటర్ గా ఉండి ఉంటే బాగుణ్ణు అలాగే సాగదీతగా సాగే స్క్రీన్ ప్లే ఆడియెన్స్ కి పరీక్ష పెడుతుంది. ఇక వీటితో ఈ చిత్రాన్ని ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు. ఇక మిగతా వారు అయితే ఈ వారాంతానికి ఇతర సినిమాలు ట్రై చేయడం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team