సమీక్ష : ఇంటింటి రామాయణం – పర్వాలేదనిపించే ఫ్యామిలీ డ్రామా

Intinti Ramayanam Telugu Movie Review

విడుదల తేదీ : జూన్ 09, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, అంజి, చేవెళ్ల రవి, జీవన్, రాధిక, స్టీవెన్ మధు, కవిత శ్రీరంగం తదితరులు.

దర్శకుడు : సురేష్ నరెడ్ల

నిర్మాతలు: గోపీచంద్ ఇన్నమూరి, వెంకట్ ఉప్పుటూరి

సంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్

సినిమాటోగ్రఫీ: పిసి మౌళి

ఎడిటర్: ఎస్ బి ఉద్దవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


ఆహా ఓటిటి వారి నుండి నేడు గ్రామీణ నేపధ్య కుటుంబ కథా సినిమా ఇంటింటి రామాయణం మొత్తానికి థియేటర్స్ లో విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, డైరెక్టర్ మారుతీ సమర్పించిన ఈ మూవీ మరి ఎలా ఉంది అనేది ప్రస్తుతం సమీక్ష లో చూద్దాం.

కథ :

రాములు (నరేష్) ఒక మంచి మనసున్న వ్యక్తి, ఎప్పుడూ తన చుట్టూ ఉండేవారికి తన వీలైనంతలో సహాయం చేస్తూ ఉంటాడు. శ్రీనివాస్ (రాహుల్ రామకృష్ణ) రాములు కూతురైన సంధ్య (నవ్య స్వామి) ని ప్రేమిస్తాడు. ఆ విధంగా వారిద్దరూ ప్రేమించుకుంటుండగా ఒకరోజు రాములు ఇంట్లో ఒక ముఖ్యమైన వస్తువు మిస్ అవుతుంది. దానితో ఇంట్లోని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది. ఆఖరుకి శ్రీనివాస్ ని కూడా అనుమానిస్తారు. మరి ఇంతకీ ఆ ఇంట్లో పోయిన వస్తువు ఏంటి, మరి దొంగ ఎవరు, ఆ వస్తువు దొరికిందా, ఆపైన వారి ఇంటి పరిస్థితులు ఏవిధమా ముందుకు సాగాయి అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు సురేష్ నరెడ్ల అందరినీ ఆకట్టుకునే సింపుల్ స్టోరీ ని తీసుకుని ఇంటింటి రామాయణం మూవీని తెరకెక్కించారు. స్టోరీ ని నేరేట్ చేసిన విధానం పాత్రల యొక్క పరిచయం బాగుంది. ఇక అన్ని పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం, స్క్రీన్ ప్లే లో పెద్దగా ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ ని బాగా నడిపించారు. డీసెంట్ కామెడీ, తెలంగాణ స్లాంగ్ లో వచ్చే డైలాగ్స్ ఆడియన్స్ ని మంచి ఉల్లాసాన్ని అందిస్తాయి మరియు బాగా ఎంటర్టైన్మెంట్ ని కూడా అందిస్తుంది. మరొకసారి ఈ మూవీలోని రాములు పాత్రలో సీనియర్ నరేష్ అద్భుతంగా నటించి ఆడియన్స్ ని అలరించారు. సినిమా మొత్తం ఆయన పాత్ర యొక్క తీరు తెన్నులు బాగుంటాయి. ఇక రాహుల్ రామకృష్ణ పాత్ర కూడా బాగుంది. నటి నవ్య స్వామి కూడా ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ లో కూడా ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచారు. సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, అంజి, చేవెళ్ల రవి, జీవన్ తదితరులు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సినిమాలో మూడు పాటలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ కథ నిజానికి మంచి రియాల్టిస్టిక్ పద్ధతిలో సాగినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో కొంత సాగతీత గా మనకి అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మనకు ఇట్టే తెలిసిపోతుంటాయి, ఒకరకంగా అవి కథనాన్ని మరింత సాగతీతగా మార్చి బోర్ కొట్టించే అవకాశం ఉంది. కొందరు ఆడియన్స్ తెలంగాణ భాషలోని కొన్ని పదాలను అర్ధంచేసుకోలేకపోవచ్చు. అయితే కథ ని మరింత ఇంప్రెసివ్ గా ముందుకు నడిపితే ఓవరాల్ గా మంచి సక్సెస్ లభించి ఉండేది. ఈ సినిమా చూస్తే దర్శకుడు ఎక్కువగా ఎమోషనల్ గా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కంటే వారికి ఎంటర్టైన్మెంట్ అందించాలని ఉద్దేశ్యంతో సినిమా తీసారా అని మనకు అనిపిస్తుంది. పాత్రల యొక్క తీరుతెన్నులు బాగున్నా వారికి మరింతగా ఎమోషనల్ టచ్ ఇచ్చి ఉంటె తప్పకుండా ఇంటింటి రామాయణం మరొక రేంజ్ లో ఉండేది.

 

సాంకేతిక వర్గం :

రచయిత మరియు దర్శకుడు సురేశ్ నరెడ్ల ఆడియన్స్ ని ఆకట్టుకునే మంచి కథను ఎంచుకున్నందుకు ప్రశంసించాలి. అదనంగా, కళ్యాణి మాలిక్ సంగీతం కూడా బాగుంది. పి సి మౌళి సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది, ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉంటె బాగుండేది. నాగ వంశీ, దర్శకుడు మారుతి, ఐవివై ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు, స్క్రీన్‌పై రిచ్‌గా ఉన్నాయి.

 

తీర్పు :

మొత్తానికి ఇంటింటి రామాయణం ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంది. కామెడీ గా సాగుతూ ప్రధాన నటీనటుల మెచ్చుకోదగిన నటన సినిమాకు బలం. అయితే, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సాగతీత సన్నివేశాలు బోర్‌గా అనిపిస్తాయి. ఆ సీన్లు బాగానే ఉండి ఉంటే ఈ వీకెండ్ లో ఇంటింటి రామాయణం చూడొచ్చు అని చెప్పాలి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version