విడుదల తేదీ : ఆగస్టు 06, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : హస్వంత్ వంగ, నమ్రత దరేకర్, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర తదితరులు
దర్శకుడు: వై యుగంధర్
నిర్మాతలు : చింత గోపాల కృష్ణ రెడ్డి
సంగీత దర్శకుడు : సాహిత్య సాగర్
సినిమాటోగ్రఫీ : జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్
హస్వంత్ వంగ, నమ్రత దరేకర్ జంటగా వై యుగంధర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ డ్రామా “ఇప్పుడు కాక ఇంకెప్పుడు”. తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ:
గౌతమ్ (హస్వంత్ వంగ), అను (నమ్రత దరేకర్) వీరిద్దరిని చిన్నప్పటి నుంచే సాంప్రదాయం, పద్ధతులు అంటూ ఎన్నో రిస్ట్రిక్షన్స్ మధ్య వారి వారి తల్లిదండ్రులు పెంచుతారు. అయితే వీరిద్దరు టీనేజ్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ మూలాన తారసపడుతారు. ఆ తర్వాత ఇద్దరికి జాబ్స్ రావడంతో హైదరాబాద్‌కి వెళ్తారు. అయితే అప్పటివరకు పద్ధతులు, కట్టుబాట్ల మధ్య పెరిగిన వీరు సిటీ కల్చర్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఆ తర్వాత వీరిద్దరు ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటి? చివరకు వీరిద్దరి జీవితాలు ఎలా మలుపు తీసుకున్నాయి? అనేది తెలియాలంటే సినిమాను స్క్రీన్‌పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
వై యుగంధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రొమాన్స్ కాస్తంతా ఎక్కువే చూపించినా అంతే స్థాయిలో మన సాంప్రదాయం, పద్ధతులు ఎలా ఉంటాయనేవి కూడా ఎమోషనల్‌గా చూపించాడు. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన హస్వంత్ వంగ, నమ్రత దరేకర్ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. చివరలో హీరో చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.
ఇకపోతే సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తన పాత్రకు తగ్గట్టుగా చక్కటి పెర్ఫార్మెన్స్‌ని కనబర్చాడు. జబర్దస్థ్ నటుడు రాకెట్ రాఘవ కూడా తనదైన కామెడీతో ఒకింత నవ్వులు పూయించాడు. ఇక మిగిలిన నటీ నటులు కూడా పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ ఏమిటంటే రొమాన్స్ ఎక్కువవ్వడమే అని చెప్పాలి. దర్శకుడు తాను రాసుకున్న కథ ప్రకారం ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చూపించడంలో భాగంగానే రొమాన్స్ కాస్త పెంచాడని అర్ధమవుతుంది కానీ ఆ రొమాంటిక్ ట్రీట్ కాస్త తగ్గించే ఉంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాగా ఈ చిత్రం నిలిచేది.
ఇకపోతే ఈ సినిమా కథనం బాగానే ఉన్నప్పటికే దానికి ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే బాగుండనిపించింది. స్క్రీన్‌ప్లే కూడా కాస్త నిరాశపరిచింది. ఇదిలా ఉంటే రాకెట్ రాఘవ కనిపించే రెండు మూడు సీన్లు తప్పా కామెడీనీ కూడా చాలా తక్కువ మోతాదులో చూపించారు. ఇక సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల వాటిని రివీల్ చేసిన విధానం బాగోలేదు. ఇక క్లైమాక్స్‌కి కూడా ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే పిల్లలకు తల్లిదండ్రులు సాంప్రాదాయలు, పద్ధతులు, మన కట్టుబాట్లను నేర్పించాలే తప్పా వారికి అదే లోకమని చెప్పే ప్రయత్నం చేయొద్దనేది మరియు ప్రస్తుతమున్న కల్చర్‌కి అలవాటు పడి యువత వ్యవహరిస్తున్న తీరు కారణంగా కొన్ని సార్లు అది వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలను తెచ్చిపెడతాయి అన్న కథాంశంతో దర్శకుడు రాసుకున్న స్టోరీ బాగుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఇక ఈ సినిమాకు డైలాగ్స్ కూడా మెయిన్ హైలెట్‌గా నిలిచాయి. ఇదే కాకుండా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపించింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” చిత్రంలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువైనప్పటికీ అది పక్కన పెడితే ఒకింత ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండడంతో ఆ యాంగిల్‌లో ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని పక్కన పెడితే యూత్‌కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఓ ఛాయిస్ అవుతుందని చెప్పాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team