సమీక్ష : ఇష్టంగా – విసిగించిన రొమాంటిక్ డ్రామా

Ishtangaa movie review

విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : అర్జున్ మహి , తనిష్క్ రాజన్ , ప్రియదర్శి, మధు నందన్

దర్శకత్వం : సంపంత్ వి రుద్ర

నిర్మాత : వెంకటేశ్వరరావు

సంగీతం : ఎలేందర్ మహావీర్

ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి

అర్జున్ మహి , తనిష్క్ రాజన్ జంటగా నూతన దర్శకుడు సంపంత్ వి రుద్ర తెరకెక్కించిన చిత్రం ఇష్టంగా.. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

కృష్ణ (అర్జున్ మహి ) కు పెళ్లి మీద నమ్మకం ఉండదు కొరియోగ్రఫేర్ గా పని చేస్తూ చాలా మంది అమ్మాయిలతో లవ్ బ్రేక్ అప్ చేసుకుంటాడు. అయితే అనుకోని సందర్భంలో కంటెంట్ రైటర్ గా పని చేసే సత్య (తనిష్క్ రాజన్ ) కృష్ణ తో ప్రేమ లో పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరికంగా దగ్గర అవుతారు. ఆ తరువాత సత్య , కృష్ణ ను పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేస్తుంది. దానికి కృష్ణ ఒప్పుకోడు అయినా కూడా సత్య ఇంకా కృష్ణ ను లవ్ చేస్తుంది. కృష్ణ కు యూ ఎస్ వెళ్లే ఆఫర్ వస్తుంది. ఆ తరువాత సత్య ఏమైంది ? వారిద్దరూ మళ్ళీ కలుసుకున్నారా ? లాంటి విషయాలు చూడాలనుంటే ఈ సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొత్తం కృష్ణ పాత్రే చుట్టూ తిరగడంతో ఆ పాత్ర సినిమాకు హైలైట్ అయ్యింది. ఇక ఆ పాత్రలో నటించిన అర్జున్ మహి చాలా బాగా నటించాడు. తన నటన తో ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు.

ఇక సత్య పాత్రలో నటించిన తనిష్క్ రాజన్ గ్లామర్ కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంది. వారి ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ కు నచ్చుతాయి.

మైనస్ పాయింట్స్ :

యూత్ ను టార్గెట్ చేసుకుని దర్శకు డు సంపత్ రాసుకున్న కథలో కొత్త ధనం ఏమి లేదు కనీసం కథనంతో కూడా ఏమి మ్యాజిక్ చేయకపోవడంతో సినిమా మరి తీసికట్టుగా మారింది. అసలు దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో సినిమాతో అనేదే స్పష్టంగా చెప్పలేకపోయాయడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కాన్ ఫ్లిక్ట్ కూడా చాలా సిల్లీ గా అనిపిస్తుంది.

ఇక ప్రియదర్శి , దువ్వాసి మోహన్ చేసిన కామెడీ నవ్వు తెప్పించకగా పోగా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. రొటీన్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ రొమాంటిక్ సన్నివేశాలతో తప్ప మిగితా అంశాలు మెప్పించకపోవడంతో సినిమా బోర్ కొట్టిస్తుంది.

సాంకేతిక వర్గం :

దర్శకుడు సంపత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపథ్యంలో స్టోరీ ని రాసుకొని దాన్ని తెర మీదకు తీసుకురావడంలో పూర్తిగా తడబడ్డాడు. ఆసక్తికరంగా లేని కథనం , గ్రిప్పింగ్ లేని నరేషన్ సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. అయితే మిగితా సాంకేతిక నిపుణులు సినిమా కు చాలా ప్లస్ అయ్యారు.

మహావీర్ అందించిన సంగీతం బాగుంది . ముఖ్యంగా అద్నాన్ సమీ పాడిన టైటిల్ ట్రాక్ గుర్తిండిపోతుంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా వున్నాయి.

తీర్పు :

రొమాంటిక్ ఎంటరైనర్ గా వచ్చిన ఈ ఇష్టంగా మెప్పించలేకపోయింది. అర్జున్ మహి , తనిష్క్ రాజన్ నటన సినిమాకి హైలైట్ అవ్వగా రొటీన్ స్టోరీ ,గ్రిప్పింగ్ లేని నరేషన్ సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. చివరగా ఈ చిత్రం ఏ వర్గానికి కూడా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు.

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version