ఓటీటీ రివ్యూ: “జగమే మాయ” తెలుగు చిత్రం హాట్ స్టార్ లో

Jagame Maya Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ అయినంపూడి, పృథ్వీరాజ్

దర్శకుడు : సునీల్ పుప్పాల

నిర్మాతలు: ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే

సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: రాహుల్ మాచినేని

ఎడిటర్: మధు రెడ్డి, కళా సాగర్ ఉడగండ్ల

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇప్పుడు థియేటర్స్ సహా ఓటిటి లో కూడా పలు చిత్రాలు అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మరి అలా లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రం “జగమే మాయ”. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే.. ఆనంద్(తేజ అయినంపూడి) ఓ ఫ్రాడ్ కాగా జనాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. మరి ఈ విషయం తెలియని చిత్ర(ధన్య బాలకృష్ణ) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడ్డాక ఆమె గతం కోసం తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటాడు. కానీ తర్వాత ఆమె కోసం ఓ షాకింగ్ నిజాన్ని అయితే తాను తెలుసుకుంటాడు. మరి అక్కడ నుంచి వీరి కథ ఎలా మలుపు తిరిగింది? ఇంతకీ ఈమె గతం ఏంటి? ఆమె ఏం చేసింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కొన్ని అంశాలు డీసెంట్ గా థ్రిల్ చేస్తాయి అలాగే నటి ధన్య బాలకృష్ణ తన పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్టయ్యి బాగా చేసింది. ముఖ్యంగా ఆమె నటనలో ఇంట్రెస్టింగ్ షేడ్స్ కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో ఆమె కనబర్చిన నటనకి సెకండాఫ్ లో నటనకి చాలా లేయర్ డిఫరెన్స్ కనిపిస్తుంది.

ఇక నటుడు తేజ కూడా మంచి నటన కనబరిచాడు. తన కామెడీ టైమింగ్ అయితే అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. కొన్ని సీన్స్ లో తన హావభావాలు కూడా బాగున్నాయి. అలాగే నటి చైతన్య రావుకి ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ దక్కగా దానిని ఆమె డీసెంట్ గా చేసేసారు. ఇతర పాత్రధారులు పర్వాలేదనిపిస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మేజర్ డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా కథే అని చెప్పాలి. ఇది ఏమంత గొప్పగా అనిపించకపోవడం ఒకటైతే దీనిని దర్శకుడు అంత ఆసక్తిగా మలచకపోవడం అనేది మరో డిజప్పాయింటింగ్ అంశం అని చెప్పాలి. దీనితో అయితే ఈ చిత్రం చాలా డల్ గా కనిపిస్తుంది.

సినిమాలో చాలా చోట్ల మంచి ఆసక్తికర కథనాన్ని చూపించడానికి స్కోప్ ఉన్నా కూడా దర్శకుడు దాన్ని పూర్తిగా మిస్ చేసాడు. అలాగే ఓ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన మినిమమ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో కనిపించవు కథనం ఊహించే రేంజ్ లోనే ఉంటుంది ఇలా ఉంటే ఓ థ్రిలర్ చిత్రంపై ఈజీగా ఆసక్తి తగ్గిపోతుంది.

ఇక అలాగే ధన్య తన రోల్ కనిపించినంత వరకు కూడా బాగానే ఆకట్టుకుంటుంది కానీ ఇంకా ఆమె పాత్రకి స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండు అలాగే పృద్వి రాజ్ పాత్ర కూడా మరింత మెరుగ్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లోకి వస్తే ఓ థ్రిల్లర్ కి కావాల్సిన సరైన అవుట్ ఫుట్ అయితే చిత్ర టెక్నీకల్ టీం నుంచి మిస్ అయ్యిందని చెప్పాలి. ఏ అంశం కూడా ఈ చిత్రంపై ఆసక్తి రేపే విధంగా అనిపించదు. కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లు ఏమాత్రం ఆకట్టుకోవు.

ఇక దర్శకుడు సునీల్ పుప్పాల విషయానికి వస్తే ఈ సినిమా విషయంలో తాను పూర్తిగా వైఫల్యం చెందారు. అతి తక్కువ నరేషన్ లో సినిమాని రెడీ చేసుకున్నప్పటికీ చిత్రంలో ఏమాత్రం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ సీన్స్ ని రాసుకోలేదు. దీనితో అయితే ఈ చిత్రం చాలా బోర్ గా ఉంటుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “జగమే మాయ” చిత్రంలో ఒక్క మెయిన్ లీడ్ సిన్సియర్ పెర్ఫామెన్స్ తప్ప ఇంకే అంశం కూడా ఈ థ్రిల్లర్ ని చూసేందుకు దోహదపడలేదు. పైగా దర్శకుని వైఫల్యం కూడా ఇందులో బాగా కనిపిస్తుంది. దీనితో ఈ చిత్రం ఓటిటి లో స్కిప్ చేసేయడమే బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version