సమీక్ష : “జాతి రత్నాలు” – ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్

సమీక్ష : “జాతి రత్నాలు” – ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్

Published on Mar 12, 2021 10:00 AM IST
Jathi Ratnalu movie review

విడుదల తేదీ : మార్చి 11, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : నవీన్ పొలిషెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మజీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్.

దర్శకత్వం : అనుదీప్ కె వి

నిర్మాత‌లు : నాగ్ అశ్విన్

సంగీతం : రాధన్

సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్

ఎడిటింగ్ : అభినవ్ దండా

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి. అలాగే ఇప్పటికే తన కామికల్ యాంగిల్ తో ఆకట్టుకున్న మరో టాలెంటెడ్ నటులు ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల కలయికలో అనుదీప్ కె వి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “జాతి రత్నాలు”. సాలిడ్ ప్రమోషన్స్ తో మంచి హైప్ నడుమ ఈ ఫన్ జర్నీ ఈరోజు విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే జోగిపేట్ అనే చిన్నపాటి టౌన్ లో జోగిపేట్ శ్రీకాంత్(నవీన్ పొలిశెట్టి) అతని ఫ్రెండ్స్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలుగా కనిపిస్తారు. మరి మిగతా ప్రపంచం కోసం పెద్దగా పరిచయం లేని ఈ ముగ్గురు బయటకొచ్చి బతకాలి అని హైదరాబాద్ కు వచ్చి ఓ పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటారు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా అక్కడి లోకల్ ఎమ్మెల్యే(మురళీ శర్మ) మూలాన సంబంధం లేని మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఇక ఇక్కడ నుంచి వాళ్ళు పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నారు? ఆ కేసు నుంచి బయట పడతారా లేదా ఇంతకీ ఆ మర్డర్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాను మొదటి నుంచీ ఒక అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ సినిమాగా తెరకెక్కించినట్టుగా మేకర్స్ చూపించారు. మరి వాటి అన్నిటికీ తగ్గట్టుగానే ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుంది. ముఖ్యంగా సందర్భానుసారం వచ్చే కామెడీ సీన్లు కానీ సింపుల్ అండ్ సూపర్బ్ పంచ్ డైలాగ్స్ గాని సినిమాలో మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. ఇక మెయిన్ లీడ్ నవీన్ పొలిశెట్టి మరోసారి తన బెస్ట్ చూపించాడని చెప్పాలి. లాస్ట్ టైం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లోనే తన కామికల్ టైమింగ్ ను సూపర్బ్ గా చూపించిన ఈ యువ నటుడు ఈ సినిమాలో అంతకు మించే ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చాడు.

తన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఈ చిత్రంలో చాలా ప్లెసెంట్ గా అనిపిస్తాయి. లాస్ట్ లో అయితే లెజెండ్ బ్రహ్మానందం గారికి తనకి వచ్చిన సీన్స్ లో మరింత హిలేరియస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక మిగతా ఇద్దరు జాతి రత్నాలు ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల విషయానికి వస్తే.. ఇద్దరూ కూడా తమ తమ డిఫరెంట్ రోల్స్ ను చక్కగా పండించారని చెప్పాలి. ప్రియదర్శి నుంచి అయితే ఆల్ రౌండ్ షో పెర్ఫామెన్స్ ఇందులో కనిపిస్తుంది. మరి రాహుల్ తన సరికొత్త మ్యానరిజం తన డైలాగ్స్ తో మంచి ఫన్ ఇచ్చాడు. అంతే కాకుండా వీరి నడుమ మధ్య వచ్చే సిచుయేషనల్ కామెడీ మరో మంచి ఎస్సెట్ గా కనిపిస్తాయి.

ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు స్క్రీన్ పై కనిపించినంత సేపు మంచి నటనతో ఆకట్టుకుంది. నవీన్ మరియు ఆమెకు మధ్య కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్స్ ఫన్నీ సీన్స్ చాలా బాగుంటాయి వీరికి మంచి కెమిస్ట్రీ కుదిరింది. అలాగే డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా తన నుంచి కూడా బెస్ట్ ను ఈ చిత్రంలో ఇచ్చింది అని చెప్పొచ్చు.

మరి లాస్ట్ బట్ లీస్ట్.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఎంటర్ అయ్యాక ఎంటెర్టైన్మెంట్ వీక్షకులకు ఓ రకమైన ఆనందం స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టు ఆయనపై కోర్ట్ లో డిజైన్ చేసిన కామెడీ ప్రతీ ఒక్కటీ కూడా పేలుతుంది. తన రోల్ లో చాలా కాలం తర్వాత మంచి ట్రీట్ అనుకోవచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉన్నా డిమాండ్ చేసిన కొన్ని పరిస్థితుల్లో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం కనిపిస్తుంది. మేకర్స్ మొదటి నుంచి రోల్స్ వల్ల మంచి సిచుయేషనల్ కామెడీ పండుతుంది అన్నారు అది ఉంది కానీ కొన్ని చోట్ల అది మరీ ఓవర్ గా వెళ్లినట్టు అనిపిస్తుంది. అలాగే వాళ్ళు ఇరుక్కున్న కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ దానిని డీల్ చేసిన విధానంలో కూడా కొన్ని లాజిక్స్ మిస్సవుతాయి అక్కడ మరింత డీటైలింగ్ ఉంటే బాగుండేది. ఇంకా సెకండాఫ్ లో నరేషన్ కాస్త నెమ్మదించినట్టు కూడా అనిపిస్తుంది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగుంటాయి. సినిమాకు ఎంత మేర కావాలో ప్రతీ సీన్ కు నాచురల్ లుక్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్ర టెక్నికల్ యూనిట్ లో రాధన్ మ్యూజిక్ కు స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. కేవలం సాంగ్స్ లోనే కాకుండా తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఎస్సెట్ గా ఈ చిత్రానికి నిలిచింది. ఇక ముందు చెప్పినట్టుగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ డీసెంట్ గా అనిపిస్తాయి.

ఇక దర్శకుడు అనుదీప్ విషయానికి వస్తే..తనకిది ఫస్ట్ సినిమానే అయినా ఒక అవుట్ అండ్ అవుట్ ఫన్నీ రోలర్ కాస్టర్ జర్నీగా ఈ సినిమాను హ్యాండిల్ చెయ్యడంలో తన పనితనం కనిపిస్తుంది. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై ఆద్యంతం కామెడీను హైలైట్ చేస్తూ బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ చివరి వరకూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ “జాతి రత్నాలు” ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు మంచి హిలేరియస్ కామెడీ నవీన్, ప్రియదర్శి, రాహుల్ లా కాంబో జెనరేట్ చేసిన సిచుయేషనల్ కామెడీ వీక్షకులను ఆకట్టుకుంటాయి. కాకపోతే కథ మరియు నరేషన్ లు సెకండాఫ్ లో కాస్త నెమ్మదించడం మినహాయిస్తే ఓ ఫన్ ఎంటర్టైనర్ ను చూసి నవ్వుకోవాలి అంటే ఈ “జాతి రత్నాలు” నిరాశ పరచరు.

123telugu.com Rating :  3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు