ఓటిటి రివ్యూ : “భూమి” – తెలుగు చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం

ఓటిటి రివ్యూ : “భూమి” – తెలుగు చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం

Published on Jan 15, 2021 2:43 PM IST

నటీనటులు: జయం రవి, నిధి అగర్వాల్

దర్శకత్వం: లక్ష్మణ్

నిర్మాత: సుజాత విజయకుమార్

సంగీతం: డి. ఇమ్మన్

సినిమాటోగ్రఫీ: డడ్లీ

ఎడిటింగ్: జాన్ అబ్రహం & రూబెన్

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “భూమి”.స్ట్రీమింగ్ యాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో తాజాగా విడుదల కాబడిన ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక ఈ కథలోకి వెళ్లినట్టయతే అంతర్జాతీయ స్పేస్ సంస్థ అయినటువంటి “నాసా”లో పని చేసే భూమినాథన్(జయం రవి) ఒక శాస్త్రవేత్తగా పని చేస్తాడు. అయితే ఒక పెద్ద మిషన్ పని మీద మార్స్ గ్రహానికి వెళ్లాల్సి వస్తుంది. అలాగే మరోపక్క చాలా ఏళ్ళు ఆ వృత్తిలోనే ఉన్న భూమి తన స్వస్థలానికి వచ్చేయాలని అనుకంటాడు. అలా వచ్చి శక్తి(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. కానీ తన ఊరిలో ఉన్న రైతులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి మరి అక్కడ నుంచి హీరో హీరోయిన్ తో కలిసి ఏం చేసాడు? వారికి ఎదురైన సమస్య ఏంటి? దానిని ఎలా పరిష్కరించారు అన్నదే అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

మొదటగా జయం రవి సినిమాలు అంటేనే కాస్త కొత్తదనం సబ్జెక్టు అనే గ్యారంటీ ఉంటుంది మరి అలాగే ఇందులో కూడా అలాంటి కోసం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే జయం రవి ఆ రోల్ ను సాలిడ్ గా చేసాడు. దాదాపు తన పెర్ఫామెన్స్ తోనే ఈ చిత్రాన్ని లాగేసాడు. ఇక అలాగే నిధి తన డెబ్యూ చిత్రంలో బాగా చేసింది. ఓ విలేజ్ అమ్మాయిలా తన పాత్రకు న్యాయం చేకూర్చింది.

ఇక హిందీ నటుడు రోనిత్ రాయ్ తన రోల్ సూపర్బ్ చేసారని చెప్పాలి. ఈ కథకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ విలన్ గా కనిపించి మెప్పిస్తాడు. మరి అలాగే ఈ చిత్రంలో సాలిడ్ ఎమోషన్స్ రైతులు పడే కష్టాలను చాలా ఇంప్రెసివ్ గా చూపించారు. అలాగే సినిమాలో కనిపించే పల్లె వాతావరణం, ఆర్ట్ వర్క్ మరియు కెమెరా పనితనం చాలా నీట్ గా అనిపిస్తాయి. అలాగే పాటలు కూడా విజువల్ గా చాలా బాగున్నాయి.

 

ఏమి బాగోలేదు?

 

ఈ చిత్రం విషయంలో ఎలాంటి డౌట్ లేకుండా చెప్పెయ్యొచ్చు ఇది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ చేసిన స్వదేశ్ కు ఫ్రీ మేక్ అని. ఈ చిత్రం చూస్తున్నంత సేపు కూడా ఆ చిత్రమే గుర్తుకు వస్తుంది. సబ్జెక్టు కానీ ఇతర అంశాలు కానీ అన్నీ ఒకేలా అనిపిస్తాయి ఇది పెద్ద మైనస్ అనిపిస్తుంది.

అలాగే జయం రవి పాత్ర డిజైన్ చేసిన విధానం కూడా మరీ ఓవర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అలాగే రైతులపై చూపిన పలు ఎపిసోడ్స్ కానీ వారు ఎంచుకున్న కోణం కానీ పెద్దగా కొత్తగా ఏమి అనిపించదు. మన తెలుగులో మహేష్ చేసిన మహర్షి, శ్రీమంతుడు, అలాగే ఇప్పటికే కొన్ని తమిళ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో చూసేసినట్టే అనిపిస్తుంది.

సో అంత కొత్తదనం కనిపించదు. ఇక అలాగే చాలా మేర ఆసక్తిగా అనిపించే కథనం మిస్సవుతుందని కూడా అనిపిస్తుంది. మరి గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు కూడా ఈ చిత్రంలో పెద్దగా స్కోప్ ఉన్నట్టు కూడా అనిపించదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ భూమి చిత్రం ఒక మిస్ ఫైర్ అయిన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం అని చెప్పాలి. ఇది వరకే మనం చూసేసిన కొన్ని సందేశాత్మక చిత్రాలను కలిపి తెరకెక్కించినట్టు ఉంటుంది. అలాగే నటీ నటుల పెర్ఫామెన్స్ లు జస్ట్ ఓకే అనిపించినా మిగతా అంశాలు ఏవి కూడా పెద్దగా ఈ సినిమాను చూసేలా చేయవు. మరి ఈ పొంగల్ కు ఈ చిత్రాన్ని కాస్త పక్కన పెట్టడమే బెటర్.

Rating: 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు