ఆడియో సమీక్ష : జిల్ – టాలీవుడ్ కి స్టైలిష్ వెస్ట్రన్ ఆల్బమ్.

ఆడియో సమీక్ష : జిల్ – టాలీవుడ్ కి స్టైలిష్ వెస్ట్రన్ ఆల్బమ్.

Published on Mar 12, 2015 6:24 PM IST

Jil

‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన యువి క్రియేషన్స్ ప్రమోద్ – వంశీకృష్ణలు ఈ సారి రాధ కృష్ణ కుమార్ ని పరిచయం చేస్తూ మాచో హీరో గోపీచంద్ ని హీరోగా పెట్టి చేసిన సినిమా ‘జిల్’. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఆడియో మార్చి 12న విడుదలవుతోంది. కానీ ముందుగానే మార్కెట్ లోకి అడ్వాన్స్ గా ఆడియో వచ్చేయడంతో 5 పాటలున్న ఈ సినిమా ఆడియో సమీక్షని మీకందిస్తున్నాం.

1. పాట : మాన్ ఆన్ ఫైర్

గాయకులు : యజిన్ నిజర్, బియాంక గోమ్స్04

సాహిత్యం : శ్రీమణి

‘జిల్’ ఆల్బంలో వచ్చే మొదటి సాంగ్ ‘మాన్ ఆన్ ఫైర్’. ఈ పాట స్టార్టింగ్ లో వచ్చే ఎలక్ట్రిక్ గిటార్ బీట్, హార్డ్ రాక్ బ్యాండ్ ఎఫెక్ట్ వింటున్న వారి బాడీలో వేవ్స్ ని తీసుకు వస్తుంది. ఈ సాంగ్ మొత్తంగా వచ్చే ఇన్స్ట్రుమెంటేషన్ కి మీరు కచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. ముఖ్యంగా లిరిక్స్ లో ‘మాన్ ఆన్ ఫైర్’ అనే లైన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే శ్రీమణి రాసిన సాహిత్యంలో సినిమాలో గోపీచంద్ పాత్ర ఎలా ఉంటుందా అనేది తెలియజేసేలా ఉంది. యజిన్ నిజర్ వాయిస్ వినడానికి చాలా కొత్తగా ఉండడమే కాకుండా సౌండింగ్ చాలా బాగుంది. అతనితో గొంతు కలిపినా లేడీ సింగర్ బియాంక గోమ్స్ హస్కీ వాయిస్ పాటకి పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా ఓ పాప్ ఆల్బంలో పాట వింటున్నాం అనే ఫీలింగ్ ని కలుగజేస్తుంది. ఓవరాల్ గా ఈ పాట జేమ్స్ బాండ్ సినిమాల్లో వచ్చే థీమ్ సాంగ్ ఫీల్ ని మనలో కలిగిస్తుంది. ఈ పాట వినగానే మీకు నచ్చేస్తుంది.

022. పాట : జిల్ జిల్ జిల్ మనసే

గాయనీ గాయకులు : యజిన్ నిజర్, శల్మలి ఖొల్గడే

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

జిల్ ఆల్బం లో వచ్చే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ‘జిల్ జిల్ మనసే’. ఈ పాట మూడ్ కి తగ్గట్టే రామ జోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యం ఉంది. ముఖ్యంగా ఈ పాటలో హీరో – హీరోయిన్ ఒకరిపై ఒకరికి ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేసుకుంటూ ఉంటారు, అందుకోసం శాస్త్రి వాడిన పదాలు చాలా బాగున్నాయి. జిబ్రాన్ ఉపయోగించిన ప్లజంట్ వయోలింగ్, గిటార్ మరియు కీ బోర్డ్ సౌండ్స్ పాట మూడ్ కి బాగా సింక్ అయ్యాయి. యజిన్ నిజర్ తో పాటు గొంతు కలిపిన బాలీవుడ్ సింగర్ శల్మలి ఖొల్గడే డిఫరెంట్ టోన్ ఈ రొమాంటిక్ సాంగ్ కి బాగా సెట్ అయ్యింది.ఈ సాంగ్ సోల్గా ఉన్నా వినగా వినగా ఈ పాటకి బాగా అడిక్ట్ అయిపోతారు. ఈ పాట ఆన్ స్క్రీన్ విజువల్స్ పరంగా ఇంకా రొమాంటిక్ గా ఉంటుందని ఆశించవచ్చు.

3. పాట : స్వింగ్ స్వింగ్ స్వింగ్03

గాయనీ గాయకులు : బ్లాజే, సంగీత సంతోషం

సాహిత్యం : శ్రీజో

జిల్ ఆల్బంలో మూడో పాట విషయానికి వస్తే స్వింగ్ స్వింగ్ అంటూ సాగే ఈ పాట ఫుల్ డిజే బీట్స్ తో సాగే పార్టీ సాంగ్ లా ఉంటుంది. చాలా పెప్పీగా సాగే ఈ పాటలో జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. పార్టీ సాంగ్ అనే ఒకే టెంపోలో వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో బీట్ ని స్లో చేస్తూ సింగర్స్ శింగింగ్ ఫ్లోతో పాటు మ్యూజిక్ బీట్స్ ని కూడా స్పీడ్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ పాట మధ్యలో వచ్చే హిందీ లిరిక్స్ ని శ్రీజో బాగా రాసాడు. వినడానికే కాకుండా హమ్ చేయడానికి కూడా బాగున్నాయి. బ్లాజే, సంగీత సంతోషం వాయిస్ లు కూడా డిజే ఎఫెక్ట్స్ కి బాగా సెట్ అయ్యాయి. ఈ సాంగ్ త్వరలోనే పార్టీలలో ఎంజాయ్ చేసే సాంగ్స్ లిస్టులలో చేరిపోతుంది.

054. పాట : ఏమైంది వేళ

గాయనీ గాయకులు : క్లింటన్ సెరేజో, శరణ్య గోపీనాథ్

సాహిత్యం : కృష్ణ కాంత్

జిల్ ఆల్బంలో ఏమైంది వేళ ని బెస్ట్ సాంగ్ గా చెప్పవచ్చు. ఈ సాంగ్ వినగానే నచ్చేస్తుంది. జిబ్రాన్ ఈ పాటని కంపోజ్ చేసిన విధానం మరియు క్లింటన్ సెరేజో, శరణ్య గోపీనాథ్ ల చేత పాడించిన విధానం చాలా బాగుంది. ఈ రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ లో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తమ భావాలను సర్ చేసుకునే సాహిత్యాన్ని కృష్ణ కాంత్ చాలా బాగా రాసాడు. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ మరోసారి ఇంటర్నేషనల్ ఫీల్ ని కలుగజేస్తుంది. పాటతో పాటు బీట్స్ ఎంతో స్పీడ్ గా ఉన్నా లిరిక్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఈ పాట మధ్యలో వచ్చే కోరస్ మరియు ఇంగ్లీష్ లైన్స్ క్లాస్ సాంగ్స్ వినే వారికి బాగా నచ్చుతాయి. వినగానే నచ్చే ఈ సాంగ్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది.

5. పాట : పోరి మసాల పోరి01

గాయనీ గాయకులు : నివిన్ బెడ్ఫోర్డ్, శరణ్య గోపీనాథ్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

తెలుగు సినిమా ఆల్బంలో ఒక మాస్ సాంగ్ లేదు అంటే ఆ ఆల్బం అసంపూర్తిగా ఉంటుంది. అలాంటి అసంపూర్తిని జిల్ ఆల్బంలో ఫినిష్ చేసే మాస్ పాటే పోరి మసాల పోరి. తెలుగు ప్రేక్షకులు కోరుకునే మాస్ పాటే అయినప్పటికీ ఈ పాటలో కూడా జిబ్రాన్ వెస్ట్రన్ బీట్స్ ని మిస్ చెయ్యలేదు. ఒక డిఫరెంట్ మాస్ సాంగ్ ని ఇచ్చాడు. శరణ్య గోపీనాథ్ వాయిస్ ఈ మాస్ సాంగ్ లో బాగుంది. రామజోగయ్య శాస్త్రి ఈ మాస్ సాంగ్ లో ఇంగ్లీష్ లైన్స్ని కూడా మిస్ చేసి రాసాడు. జిబ్రాన్ ఈ సాంగ్ లో మాస్ కి నచ్చే బీట్స్ ఉంటూనే స్టైలిష్ డ్రమ్స్ ని కూడా ప్లే చేసాడు. ఈ పాట విజువల్స్ పరంగా ముందు బెంచ్ వారి చేత డాన్స్ చేయించే అవకాశం ఉంది.

తీర్పు :
మ్యూజిక్ యువ సంచలనం జిబ్రాన్ లోని మ్యూజిక్ టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేసిన ఆల్బం ‘జిల్’. డైరెక్టర్ రాధా కృష్ణ సినిమాలో గోపీచంద్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయడమే కాదు, మ్యూజిక్ కి కూడా చాలా డిఫరెంట్ గా అడగడమే కాకుండా అందరికీ నచ్చేలా జిబ్రాన్ నుంచి ట్యూన్స్ తీసుకున్నాడు. జిబ్రాన్ టాలీవుడ్ కి వెస్ట్రన్ టచ్ తో ఇంటర్నేషనల్ ఫీల్ వచ్చే సూపర్బ్ ఆల్బం ఇచ్చాడు. నా పరంగా మాన్ ఆన్ ఫైర్, ఏమైంది వేళ, స్వింగ్ స్వింగ్ సాంగ్స్ ఆల్బంలో బెస్ట్, అలాగే జిల్ జిల్ మనసే సాంగ్ వినగా వినగా నచ్చితే, పోరి మసాల పోరి విజువల్ గా నచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, పోస్టర్స్ ని బట్టి ఈ సాంగ్స్ విజువల్స్ కూడా కలర్ఫుల్ గా ఉంటాయని ఆశించవచ్చు. ఫైనల్ గా యువి క్రియేషన్స్ వారు ‘జిల్’ సినిమాతో హ్యాట్రిక్ మ్యూజికల్ హిట్ ని అందుకున్నారు.

జిల్ పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Click here for Jill English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు