సమీక్ష : కళాపురం – ఆకట్టుకోని విలేజ్ డ్రామా

సమీక్ష : కళాపురం – ఆకట్టుకోని విలేజ్ డ్రామా

Published on Aug 27, 2022 3:02 AM IST
Kalapuram Station Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 26, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సత్యం రాజేష్, సంచిత పూనాచ, కాశీమ రఫీ, చిత్రం శీను, ప్రవీణ్ యెండమూరి, జనార్దన్

దర్శకత్వం : కరుణ కుమార్

నిర్మాతలు: జీ స్టూడియోస్ & R4 ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీత దర్శకుడు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె

ఎడిటర్: S.B. రాజు తలారి

లైగర్ గురువారం విడుదలైనందున, కళాపురం అనే చిన్న చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యం రాజేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

కథ కుమార్ (సత్యం రాజేష్) సినిమాల్లో అవకాశం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న దర్శకుడు. కానీ అతను, తన ప్రేమలో మరియు అతని కెరీర్‌లో రిజెక్ట్ చేయబడతాడు. ఈ క్లిష్ట సమయంలో, నిర్మాత అని చెప్పుకొనే ఒక వ్యక్తి కుమార్‌ని కలుసుకుని, తన చిత్రాన్ని నిర్మిస్తానని హామీ ఇస్తాడు. అయితే నెక్స్ట్ సీన్ కళాపురం అనే తన గ్రామానికి మార్చాడు నిర్మాత, మరియు అక్కడ సినిమాను చిత్రీకరించమని కుమార్‌ను కోరడం జరిగుతుంది. కుమార్ కళాపురం లో అడుగుపెడతాడు. అక్కడ ఒక స్కామ్‌లో భారీగా మోసపోతాడు. కుమార్ తన సమస్యలను క్లియర్ చేసి తన తొలి చిత్రాన్ని ఎలా తీశాడు అనేది తెలియాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమా ఫస్ట్ హాఫ్ లో మంచి సన్నివేశాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న దర్శకుడు పరిశ్రమలో సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు, ప్రేమలో ఎలా మోసపోతాడు అనే విషయాలను చాలా డీసెంట్‌గా చూపించారు. హార్ట్ బ్రేకింగ్ సన్నివేశాల ద్వారా సత్యం రాజేష్ లవ్ ట్రాక్ మరియు ఎమోషన్స్ చాలా ప్లస్ అయ్యింది.

సీన్‌ని కళాపురం లోకి మార్చిన విధానం, పాత్రలను పరిచయం చేసిన విధానం కూడా బాగుంది. కన్నింగ్ ప్రొడ్యూసర్‌గా నటించిన జనార్ధన్ తన పాత్రలో చాలా బాగా చేశాడు. ప్రదీప్ రుద్ర ఈ చిత్రంలో చిన్న పాత్ర చేసినా, చాలా డీసెంట్ గా చేశారు. సెకండాఫ్‌లో, టీమ్ ఎలా సినిమా చేయడానికి ప్రయత్నిస్తుందో కొన్ని కామెడీ సన్నివేశాలను చక్కగా హ్యాండిల్ చేశారు.

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్‌లో సీరియస్‌నెస్‌ లేకపోవడంతో కథనం అంతగా ఆకట్టుకోదు. హీరో కుమార్ గ్రామ సభ్యులతో సినిమా తీయడానికి ప్రయత్నిస్తాడు, మరియు ప్రతి ఒక్కరూ కూడా అందులో వేలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అలాంటి కాన్సెప్ట్‌లు ఇంతకుముందు చాలా చిత్రాలలో చూపించడం జరిగింది. మరియు కళాపురంలో ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత సీరియస్‌నెస్ సెకండాఫ్ లో ఉండదు.

సెకండాఫ్ చివరి భాగంలో కీలకమైన ట్విస్ట్ ఉంది. అయితే దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ముములుగా, మరియు చాలా సిల్లీగా కనిపిస్తుంది. చిత్రం క్రియేట్ చేసిన విధానం బాగుంది, సెకండాఫ్‌లో కామెడీకి కూడా స్కోప్ ఉంది. కానీ దర్శకుడు అస్సలు అవసరం లేని సన్నివేశాలను చిత్రంలో వివరించడం జరిగింది.

సినిమాలో సెకండాఫ్‌లో అంతగా ఎమోషనల్ డెప్త్ లేదు. సమస్యలతో బాధపడే దర్శకుడు తన మొదటి సినిమా చాలా ఫోర్స్ గా చేయవలసి వస్తుంది. అయితే అతను సినిమాను ప్రారంభించే విధానం మరియు అతని పాత్ర ఎలా మారుతుంది అనేది సరిగ్గా చూపించలేదు.

సాంకేతిక విభాగం:

తక్కువ బడ్జెట్‌తో నిర్మించినా, ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విలేజ్ విజువల్స్ చూపించే కెమెరా వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. మణిశర్మ అందించిన సంగీతం ఆకట్టుకుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంది.

దర్శకుడు కరుణ కుమార్ విషయానికి వస్తే, ఇది అతనికి మూడవ చిత్రం. తన సినిమాల్లో సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయనే పేరుంది. కానీ అతను ఒక ట్విస్ట్‌తో చిత్రాన్ని ఎంచుకొని క్యూరియాసిటీని క్రియేట్ చేయడం లో విఫలమయ్యాడు అని చెప్పాలి. అతను సినిమాను స్లో నోట్‌లో ప్రారంభించినప్పటికీ, అతను ప్రధాన కథాంశంలోకి ప్రవేశించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ సినిమా సెకండాఫ్‌లోకి అడుగుపెట్టే తరుణంలో, సినిమా అదే విధంగా సీరియస్ గా సాగదు. మరియు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించని సన్నివేశాలు కూడా ఉండటం తో బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది.

తీర్పు:

మొత్తానికి కళాపురం అనే విలేజ్ డ్రామా, దానిని చూపించిన విధానంలో సీరియస్ నెస్ లోపించింది. సినిమా మంచి నోట్‌తో మొదలు అవుతుంది. కానీ, సెకండాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఆకట్టుకొని కథనం తో చిత్రం కొనసాగుతుంది. అయితే సత్యం రాజేష్ సిన్సియర్ పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంటుంది. అయితే రాజేష్ పెర్ఫార్మెన్స్ మినహా, ఇందులో అంతగా ఆకట్టుకొనే అంశాలు ఏమీ లేవు. ఈ వీకెండ్ ఈ చిత్రం ను చూసేందుకు లీస్ట్ ప్రయారిటీ ఇవ్వడం మంచిది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు