సమీక్ష : ‘కనబడుటలేదు’ – బోర్ గా సాగే థ్రిల్లర్ డ్రామా

సమీక్ష : ‘కనబడుటలేదు’ – బోర్ గా సాగే థ్రిల్లర్ డ్రామా

Published on Aug 20, 2021 3:01 AM IST
Kanabadutaledu movie review

విడుదల తేదీ : ఆగస్టు 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

తారాగణం: సునిల్‌, సుక్రాంత్‌ వీరెల్ల, వైశాలిరాజ్, హిమ‌జ‌, యుగ్రం, శశిత కోన

దర్శకత్వం: బాల‌రాజు ఎం

నిర్మాత : ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్

సంగీతం : మ‌ధు పొన్నాస్‌

ఎడిటింగ్‌ : రవితేజ కుర్మాన‌


మళ్ళీ టాలీవుడ్ లో సినిమాలు విడుదల అవుతున్న పర్వంలో సునీల్ కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ చిత్రం “కనబడుటలేదు” కూడా రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే..తనని తన బాయ్ ఫ్రెండ్ సూర్య(సుక్రాంత్ వీరల్లా) మోసం చేశాడన్న ఒక డిస్టబెన్స్ లో శశిద(వైశాలి రాజ్) ఉంటుంది. అయితే వారి బ్రేకప్ తర్వాత ఆమెకి అయిష్టంగానే ఆదిత్య(యుగ్ రామ్) తో పెళ్లి కూడా జరుగుతుంది. మరి ఈ క్రమంలో సూర్యపై బాగా కోపం పెంచుకున్న శశిద తన భర్తతో కలిసి సూర్యని ఎలా అయినా సరే చంపేయాలని ప్లాన్ చేస్తుంది. అలా అతని కోసం వైజాగ్ కి వచ్చిన వారికి సూర్య కనిపించట్లేదు అని ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. మరి అతను మిస్సవడానికి గల కారణం ఏమిటి? అతడు మళ్ళీ దొరుకుతాడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో సునీల్ పాత్ర ఎలా ఉంటుంది? దీనిని ఛేదిస్తాడా లేదా అన్న అంశాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మాములుగా ఇలాంటి థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో మొదటి నుంచీ ఆడియెన్స్ మంచి ఎలిమెంట్స్ ని కోరుకుంటారు. అలాంటివి సినిమా స్టార్టింగ్ నుంచి బాగా కనిపిస్తుంది. క్రమంగా డెవలెప్మెంట్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే సునీల్ రోల్ వచ్చాక కూడా సినిమాలో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా ఎంగేజింగ్ గా కనిపిస్తాయి.

ఇక నటీనటుల్లో సునీల్ తన పార్ట్ వరకు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి నటన తన నుంచి కనిపిస్తుంది. అలాగే మరో ఇతర కీలక పాత్రల్లో కనిపించే హిమజ, వైశాలి రాజ్ లు కూడా ఆశ్చర్యపరుస్తారని చెప్పాలి. హిమజ అయితే సాలిడ్ నెగిటివ్ షేడ్ లో కనిపించి ఇంప్రెస్ చేస్తుంది. అలాగే వైశాలి కూడ పలు సన్నివేశాల్లో ముఖంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా కనిపించింది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో జస్ట్ లైన్ కొన్ని అంశాలు వరకు బాగానే ఉన్నా మిగతా చాలా అంశాలు మాత్రం నిరాశపరుస్తాయని చెప్పాలి. స్టార్టింగ్ లో ఆసక్తిగా అనిపించిన ఈ చిత్రం నెమ్మదిగా సమయం గడుస్తున్నా కొద్దీ మరింత ఆసక్తి తగ్గిస్తుంది. పెద్దగా డెప్త్ అండ్ డిటైలింగ్ లేని ఎమోషన్స్ అంతగా ఆకట్టుకోవు.

అలాగే సెకండాఫ్ కి వచ్చే సరికి సినిమాలో ఒక పాత్రకి ఇంకో పాత్రకి సరైన కనెక్షన్ లేకపోవడం పైగా పలు సన్నివేశాలు సరిగ్గా డీల్ చెయ్యకపోవడం వంటివి అనవసరం ఒకింత బోర్ అనిపిస్తాయి. అలాగే క్యాస్టింగ్ లో కూడా లోపాలు ఉన్నాయి. పలువురు నటీనటుల నుంచి సరైన పెర్ఫవుమెన్స్ ని మేకర్స్ రాబట్టుకొలేకపోయారు.

ముఖ్యంగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కిషోర్ రోల్ అయితే అస్సలు రుచించదు. ఓవర్ ఎగ్జైటెడ్ గా ఇందులో కనిపిస్తుంది. అలాగే సునీల్ రోల్ కి కూడా తన పాత్ర పరిధిని మించి అధిక ప్రాధ్యాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, ఇంకా తన రోల్ డెవలప్మెంట్ లో లాజిక్స్ లోపాలు కూడా మిస్సవుతాయి. దీంతో ఇవన్నీ ఈ చిత్రంపై ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో సాంకేతిక వర్గ లోపాలు కొన్ని కనిపిస్తాయి. మ్యూజిక్ వర్క్ కానీ ఎడిటింగ్ గాని ఇంకా చాలా బెటర్ గా ఉంటే బాగుండేది. అలాగే సినిమాటోగ్రఫీ పర్లేదు అని చెప్పొచ్చు. సినిమా సెటప్ అంతా నిర్మాణ విలువలు పర్లేదు కానీ డబ్బింగ్ ఇతర అంశాల్లో మేకర్స్ దృష్టి సారించి ఉండాల్సింది.

ఇక దర్శకుడు బాలరాజు విషయానికి వస్తే తాను ఎంచుకున్న పాయింట్ నిజంగా బాగుంది, కానీ దానిని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆవిష్కరించడంలో విఫలం అయ్యారని చెప్పాలి. బెటర్ స్క్రీన్ ప్లే రాసుకొని మరింత ఎంగేజింగ్ గా సినిమాని నడిపించి ఉంటే బాగుండేది కానీ తన వర్క్ పరంగా ఈ సినిమా విషయంలో నిరాశనే మిగిల్చారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ “కనబడుటలేదు” పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకోదని చెప్పాలి. సినిమాలో ముందు గుడ్ స్టార్ట్, కొంతమంది నటీనటుల పెర్ఫామెన్స్ లు అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా వాటిని మించిన లోపాలు ఈ సినిమాపై ఆసక్తిని దెబ్బ తీస్తాయి. సునీల్ తన వంతు ప్రయత్నం చేసినా సెకండాఫ్ కి వచ్చేసరికి డైరెక్షన్ లో లోపాలు ఆసక్తిగా సాగని స్క్రీన్ ప్లే, డబ్బింగ్ వంటివి ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసేదగిన రేంజ్ లో అనిపించేలా చెయ్యవు.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు