సమీక్ష : ‘కన్మణి రాంబో ఖతీజా’ – ఆకట్టుకోని సిల్లీ డ్రామా

సమీక్ష : ‘కన్మణి రాంబో ఖతీజా’ – ఆకట్టుకోని సిల్లీ డ్రామా

Published on Apr 28, 2022 11:01 PM IST
Kanmani Rambo Khatija Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజ‌య్ సేతుప‌తి, న‌య‌న తార‌, స‌మంత

దర్శకత్వం : విఘ్నేష్ శివ‌న్

నిర్మాత: లలిత్‌ కుమార్‌

సంగీత దర్శకుడు: అనిరుద్‌ రవిచంద్రన్‌

సినిమాటోగ్రఫీ: ఎస్‌ఆర్‌ కదిర్‌, విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌

ఎడిటర్ : శ్రీకర్‌ ప్రసాద్‌

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా “కణ్మణి రాంబో ఖతిజా”. స్టార్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నయనతార మరియు సమంతలు హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా కాస్త తక్కువ బజ్ లోనే తమిళ్ మరియు తెలుగు భాషల్ల్ రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్లు అయితే రాంబో(విజయ్ సేతుపతి) పాత్ర కాస్త ఆసక్తి గా కనిపిస్తుంది. తాను ఏ పని చేసినా ఏది తలపెట్టినా అది పాడైపోవడం తప్ప మంచి జరగదు. దీనితో తన ఊరు నుంచి సిటీ కి వచ్చేసి నైట్ ఒక జాబ్ పగలు ఒక జాబ్ లో సెట్ అవుతాడు. మరి ఈ క్రమంలో పరిచయం ఏర్పడిన కణ్మణి(నయన తార) ని చూసి తాను ప్రేమలో పడతాడు. అలాగే మరో జాబ్ లో కలిసిన ఖతిజా(సమంత) ని కూడా ఇష్టపడతాడు. అయితే మరి ఒకరికి తెలీకుండా ఒకరిని ప్రేమించిన రాంబో లైఫ్ లో తర్వాత ఏం జరుగుతుంది? ఒకరి ప్రేమ కోసం ఒకరికి తెలిసిందా చివరికి రాంబో ఎవరితో సెటిల్ అవుతాడు అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన హైలైట్ ఏమన్నా ఉంది అంటే అది ఈ సినిమా తాలూకా మెయిన్ లీడ్ అని చెప్పాలి. ముగ్గురూ ముగ్గురే.. మంచి నటనతో ఇది వరకే మంచి విలక్షణతను వారు కనబరిచారు. మరి మొదటగా నటుడు విజయ్ సేతుపతి కోసం చెప్పినట్లు అయితే తనకి ఇచ్చే ఎలాంటి పాత్రని అయినా కూడా మంచి ఈజ్ తో చేసే సేతుపతి ఈ సినిమాలో కూడా తన డిఫరెంట్ రోల్ ని పూర్తి స్థాయిలో పండించాడు.

అలాగే స్టార్ హీరోయిన్ లు సామ్ మరియు నయన్ లు కూడా తమ రోల్స్ లో డీసెంట్ నటనను అందించారు. ముఖ్యంగా సమంతా లోని కామెడీ టైమింగ్ సినిమాలో బాగుంది. ఇంకా కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి గా కనిపించి డీసెంట్ లుక్స్ మరియు నటనతో నయనతార తన ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాలో పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా కథనం అని చెప్పాలి. మాంచి లైన్ నే తీసుకున్న దర్శకుడు దాన్ని పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా మలచడంలో విఫలం అయ్యాడు. ఎక్కడా కూడా బేసిక్ సీరియస్ నరేషన్ కనిపించదు. అలాగే మెయిన్ లీడ్ తో కనిపించే సపోర్టింగ్ కాస్ట్ కి ప్రాధాన్యత మిస్ అవ్వడం మరో మైనస్ అంశం.

ఇంకా ఈ సినిమాలో లాజిక్స్ కూడా చాలా చోట్ల మిస్ అయ్యాయి. హీరో పాత్ర డిజైన్ చెయ్యడంలో అలాగే దాన్ని డెవలప్మెంట్ లో చాలా లోపాలు కనిపిస్తాయి. అలాగే ఎమోషన్స్ కూడా అంత వర్కవుట్ కాలేదు. చాలా వరకు ఇరికించిన ఎమోషన్స్ లా కనిపిస్తాయి.

ముఖ్యంగా సినిమాలో కొన్ని సీన్స్ ని ఇంకా బెటర్ గా చూపించే ఛాన్స్ ఉన్నా దాన్ని దర్శకుడు వదిలేసాడు. దీనితో ఆడియెన్స్ కి మరింత బోర్ ఫీల్ కలిగిస్తుంది. ఇంకా పాటలు గాని కొన్ని కీలక సన్నివేశాలు గాని అంత పండలేదు.

 

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో 7 స్క్రీన్ స్టూడియో వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే అసలు ఈ సినిమాకి సంగీతం అందించింది అనిరుద్ నేనా అనే అనుమానం కలగక మానదు. తన పాటలు గాని నేపథ్య సంగీతం గాని ఏమాత్రం ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు విగ్నేష్ శివన్ విషయంలోకి వస్తే తన వర్క్ మాత్రం ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేస్తోంది. తను మంచి థీమ్ ని తీసుకున్నా దాన్ని ఆకట్టుకునే విధంగా ఆవిష్కరించడంలో విఫలం అయ్యాడు. డల్ గా నడిపించే కథనం పొంతన లేని లాజిక్స్ తో సినిమా పై ఆసక్తి ని తాను దెబ్బ తీసాడు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కణ్మణి రాంబో ఖతిజా” సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదని చెప్పక తప్పదు. విజయ్ సేతుపతి, సమంత మరియు నయనతార ల సిన్సియర్ పెర్ఫార్మన్స్ లు ఆకట్టుకుంటాయి కానీ దర్శకుడు వైఫల్యం మాత్రం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. దీనితో ఈ వారంతానికి ఈ సినిమా బోర్ ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు