సమీక్ష : కపటధారి – అక్కడక్కడా ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : కపటధారి – అక్కడక్కడా ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్

Published on Feb 20, 2021 8:02 AM IST
Kapatadhaari movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : సుమంత్, నందిత శ్వేత, నాజర్, జయప్రకాష్, సుమన్ రంగనాథ్, వెన్నెల కిషోర్, సంపత్

దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి

నిర్మాత‌లు : డా.జి.ధనంజయన్ మరియు లలిత ధనంజయన్

సంగీతం : సైమన్ కె కింగ్

సినిమాటోగ్రఫీ : రసమతి

ఎడిటింగ్ : కె.ఎల్. ప్రవీణ్

చాలా కాలం తర్వాత ఒక లవ్ స్టోరీతో మంచి రీఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్ అక్కడ నుంచి థ్రిల్లర్ చిత్రాలు చెయ్యడం స్టార్ట్ చేసాడు. మరి అలా లేటెస్ట్ గా చేసిన మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “కపటదారి”. మంచి బజ్ ను ఏర్పర్చుకున్న ఈ చిత్రం నేడే విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ శాఖలో పని చెయ్యాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తి గౌతమ్(సుమంత్). కానీ తానేమో ట్రాఫిక్ శాఖలో పని చేస్తూ ఆ జాబ్ తో అయిష్టంగా ఉంటాడు. కానీ అనుకోకుండా ఓరోజున మెట్రో పనులు జరుగుతున్న దగ్గర గుర్తు తెలియని మూడు కపాలాలు దొరుకుతాయి. కానీ భయంకర ఘటనను పోలీసు వారు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. కానీ గౌతమ్ మాత్రం దీనిని ఛాలెంజింగ్ గా తీసుకొని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చెయ్యడం మొదలు పెడతాడు. మరి ఇక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? కేవలం ఆ కపాలాలు మాత్రమే దొరకడం ఏంటి? దీని వెనుక ఎవరు ఉన్నారు? గౌతమ్ ఈ కేసును ఎలా క్రాక్ చేసాడు అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇప్పటి వరకు పలు థ్రిల్లర్ చిత్రాల్లోనూ ప్రేమ కథా చిత్రాల్లోనూ కనిపించిన సుమంత్ ఈ సినిమాలో చేసిన పోలీస్ రోల్ లో కొత్తగా కనిపిస్తాడు. అలాగే తన పర్సనాలిటీకి తగ్గ పాత్ర కూడా కావడం ఈ రోల్ కు మంచి ప్లస్ అయ్యాడు. దీనికి తగ్గట్టుగానే సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ నందిత శ్వేతకు తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినా ఉన్నంత సేపు మంచి నటన ను కనబరిచింది. మరి వీరితో పాటుగా కీలక నటులు నాజర్ కూడా తన రోల్ కు న్యాయం చేకూర్చారు.

అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ అక్కడక్కడా కనిపించి నవ్వులు పూయిస్తాడు.అయితే ఈ సినిమా థీమ్ లోని కి వెళ్లినట్టయితే దాని కి అనుగుణంగా వచ్చే కొన్ని సీన్స్ మంచి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే ఆ కపాలాలను వాటి చుట్టూతా తిరిగే సస్పెన్స్ దానిని కనెక్ట్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అలాగే సినిమాలో వచ్చే ట్విస్టులు కూడా చాలా బాగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో సినిమాను ఎండింగ్ చేసిన విధానం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :

 

ఎంత ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా అయినప్పటికీ ఇందులో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని సీన్స్ ను మినహాయిస్తే అలా స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. దీని మూలాన అంత త్వరగా ఆడియెన్స్ సినిమాలోకి లీనం కాకపోవచ్చు ఈ అంశంలో జాగ్రత్త తీసుకోవాల్సింది.

మరి అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని లాజిక్స్ కూడా చాలా మేర మిస్సయ్యాయి. మరి అలాగే సుమంత్ మరియు ఇతర నటుల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు జస్ట్ సోసో గానే అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒక థ్రిల్లర్ సినిమాలో ఏవైతే అంశాలు కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తారో వారిని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేనట్టు అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఇక ఈ చిత్రంలోని నిర్మాణ విలువలకు వస్తే ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ఎంతైతే కావాలో ఎంతమేర క్రియేటివ్ ఎంటర్టైనెర్స్ వారు అందించారు. రసమతి అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో మంచి విజువల్స్ ను చూపిస్తుంది. అలాగే సైమన్ కే అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మంచి ఎస్సెట్ అని చెప్పాలి. మరి వీరితో పాటుగా ప్రవీణ్ కె ఎల్ అందించిన ఎడిటింగ్ పర్వాలేదని చెప్పొచ్చు. ఇంకా కొన్ని సీన్స్ ను తగ్గించి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి విషయానికి వస్తే..ఆల్రెడీ ఇది ఓ రీమేక్ సినిమా కాబట్టి కంటెంట్ లో చెప్పడానికి ఏముండదు కానీ దానిని తెరకెక్కించిన విధానం ఇంకా ఆసక్తిగా ఉంటే బాగుండేది.. కానీ ఫస్ట్ హాఫ్ ను ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. అంతే తప్ప మిగతా అంతా బాగా హ్యాండిల్ చేశారు, అలాగే డైలాగ్స్ బాగున్నాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే రీమేక్ గా వచ్చినటువంటి ఈ కపటదారి అక్కడక్కడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే చివరి 20 నిమిషాలు బాగుంటుంది. కానీ కాస్త స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, ఇంకా బోరింగ్ గా అనిపించే కొన్ని ఆకట్టుకోని అంశాలు నిరాశ పరుస్తాయి.ఇలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ వారాంతానికి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓ ఆప్షన్ గా నిలవొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు