సమీక్ష : కాజల్ అగర్వాల్ ‘కోస్టి’ – బోర్ గా సాగే హర్రర్ డ్రామా !

సమీక్ష : కాజల్ అగర్వాల్ ‘కోస్టి’ – బోర్ గా సాగే హర్రర్ డ్రామా !

Published on Mar 24, 2023 3:01 AM IST
Kajal Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 23, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు: కాజల్ అగర్వాల్, కేఎస్ రవికుమార్, జై, యోగి బాబు, ఊర్వశి, రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్లే, తంగదురై, ఆడుకాలం నరేన్, మనోబాల, మొట్ట రాజేంద్రన్ తదితరులు

దర్శకుడు : కాళ్యాణ్

నిర్మాతలు: సీడ్ పిక్చర్స్

సంగీత దర్శకులు: సామ్ సీఎస్

సినిమాటోగ్రఫీ: జాకబ్ రతినరాజ్

ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

స్టార్ కథానాయిక కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ హారర్ కామెడీ మూవీ కోస్టి. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని కళ్యాణ్ తెరకెక్కించారు. మరి నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

ఒక మిషన్ లో భాగంగా క్రిమినల్ దాస్ (కేఎస్ రవికుమార్) ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది ఇన్స్పెక్టర్ ఆర్తి (కాజల్ అగర్వాల్). నిజానికి అతడిని ఆర్తి వాళ్ళ తండ్రి 20 ఏళ్ళ క్రితం అరెస్ట్ చేస్తారు. అయితే ఈ మిషన్ లో భాగముగా అనుకోకుండా ఒక అమాయకుడైన (జై) ని చంపుతుంది ఆర్తి. దానితో కథ ఒకింత వేరొక మలుపు తిరుగుతుంది. మరి ఫైనల్ గా ఆర్తి క్రిమినల్ దాస్ ని అరెస్ట్ చేసిందా, అనంతరం ఆమెకు ఎటువని పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మొత్తం కూడా మనం కోస్టి మూవీ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ముందుగా ప్రధాన పాత్రలో నటించిన కాజల్ ఈ మూవీకి పెద్ద బలం. తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన కాజల్ కొన్ని వన్ లైనర్ డైలాగ్స్ ని అద్భుతంగా పలికారు. ఇక కీలకమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన కేఎస్ రవికుమార్ నటన ఎంతో బాగుంది, ఫన్నీ సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. సినిమాలో కేవలం కనిపించేది ఐదు నిమిషాలే అయినప్పటికీ కూడా హీరో జై తన పాత్రకు న్యాయం చేసారు. ఇక ఇతర పాత్రల్లో నటించిన ఊర్వశి, కమెడియన్ రాజేంద్రన్ వంటి వారు కూడా ఎంతో బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

నిజానికి ఈ సినిమా చూసిన తరువాత అసలు కాజల్ ఇటువంటి సినిమాని ఎలా ఒప్పుకున్నారు అనిపిస్తుంది. ఆమె అందం, నటన బాగున్నప్పటికీ వాటిని వినియోగించుకోదగిన కథ, కథనాలు సినిమాలో లేకపోవడం నిరాశాజనకం. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఆడియన్స్ కి ఏమి చెప్పదల్చుకున్నాడు అనేది ఏమాత్రం అర్ధం కాదు, చాలా వరకు కథనం సిల్లీ గా అనిపిస్తుంది. ముఖ్యంగా హర్రర్ మూవీ అనేవిధంగా చూడడానికి ఇందులో అసలు అటువంటి ఎలిమెంట్స్ ఏమాత్రం భయం కలిగించేవి గా ఉండవు సరికదా ఫన్నీ గా ఉంటాయి. అలానే చాలావరకు సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా పండలేదు. దర్శకుడు కళ్యాణ్ సినిమాలో చాలా వరకు ల్యాగ్ సీన్స్ జోడించారు, ముఖ్యంగా కేఎస్ రవికుమార్ పాత్ర విషయంలో అయితే అవి మరింత ఎక్కువ ఉన్నాయి. కొన్ని సన్నివేశాలకు కనెక్షన్ ఉండదు, అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ సీన్ కూడా పెద్దగా అలరించదు. సినిమాలో కాజల్, కేఎస్ రవికుమార్ వంటి వారి పాత్రల మేకప్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. సినిమాలో ఉన్న ఒక్క సాంగ్ గురించి మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్.

 

సాంకేతిక వర్గం :

 

దర్శకుడు కళ్యాణ్ ఈ మూవీ ద్వారా రైటర్ గా అలానే దర్శకుడు గా రెండు విధాలుగా ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి. ఈసారి మరింత బెటర్ స్టోరీ తో ఆడియన్స్ ముందుకి వస్తే బాగుంటుంది. కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటిని ఆయన వినియోగించుకోలేకపోయారు. సినెమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా అనిపిస్తాయి. డబ్బింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే కొన్ని అనవసర సన్నివేశాలు కట్ చేసి ఉంటె బాగుండేదనిపిస్తుంది.

 

తీర్పు :

 

మొత్తంగా కాజల్ నటించిన కోస్టి మూవీ అటు హర్రర్ కాదు ఇటు కామెడీ ఎంటర్టైనర్ కూడా కాదు. పూర్తిగా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా సాగే కథ, కథనాలతో పాటు కాజల్ పెర్ఫార్మన్స్ కూడా సినిమా విషయంలో పూర్తిగా వేస్ట్ అయింది. మొత్తంగా ఈ మూవీని ఈ వారం స్కిప్ చేయవచ్చు.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు