విడుదల తేదీ : 07 జనవరి 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : మంజునాథ్
సంగీతం : సాండీ
నటీనటులు : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్..
వివాదాస్పద, విలక్షణ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరోసారి రియల్ లైఫ్ స్టొరీ తో చేసిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గజగజా వణికించిన స్మగ్లర్ వీరప్పన్ కథ ఏంటి, అతనిని ఎలా చంపారు అనే పాయింట్ మీద ఈ సినిమాని తీసారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో కనిపించారు. మరోసారి వర్మ రియల్ కిఫే స్టొరీతో చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
సౌత్ లోని మూడు రాష్టాల పోలీసులను ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులకు నిద్ర లేకుండా చేసిన స్మగ్లర్ అండ్ కిల్లర్ వీరప్పన్. అలాంటి వీరప్పన్ ని అడవి నుంచి ఎలా బయటకి తీసుకు వచ్చి తనని చంపారు అన్నదే ఈ కిల్లింగ్ వీరప్పన్ కథ.. ఇక సినిమా కథలోకి వెళితే.. వీరప్పన్(సందీప్ భరద్వాజ్) ఓ డీల్ కోసం బయటకి వస్తున్నాడని తెలిసి ఓ ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ టీం బయలుదేరుతుంది. కానీ మార్గమధ్యంలో పోలీసులనే చంపేస్తాడు వీరప్పన్. అప్పుడే వీరప్పన్ ఎలాగన్నా పట్టుకోవాలన్న ఆలోచన చేస్తారు. అప్పుడే స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి సంబందించిన విజయ్ కుమార్ ఆలోచిస్తుండగా.. విజయ్ కుమార్ అసిస్టెంట్, ఎస్.పి(శివరాజ్ కుమార్) ఓ ప్లాన్ చెప్తాడు.
అదే మనం వీరప్పన్ సామ్రాజ్యమైన ఆ ఫారెస్ట్ లోకి వెళ్లి అతన్ని చంపలేం.. కానీ వీరప్పన్ ని అడవి నుంచి బయటకి తీసుకు రాగలిగితే అతన్ని పట్టుకోవడం చాలా ఈజీ అంటాడు. దానికి అందరూ ఓకే అని మిషన్ స్టార్ చేస్తాడు.. ఇక ఎస్.పి వీరప్పన్ ని బయటకి తీసుకు రావడానికి ఏమేమి ప్లాన్స్ చేసాడు? ఎవరెవరిని రంగంలోకి దింపాడు? ఈ ప్లాన్ లో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీ()ని ఎలా వాడుకున్నారు. ఫైనల్ గా వీరప్పన్ ని పట్టుకోలేక పోయారు? ఎందుకు చంపేశారు? ఎలా చంపారు? అన్న విషయాలను మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
పోలీసులనే గడగడలాడించిన స్మగ్లర్ మరియు కిరాతకుడు అనే పేరున్న వీరప్పన్ గురించి ఈ సినిమాలో చూపించనున్నాడు అనడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్.. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమాని మొదలు పెట్టిన విధానం సూపర్బ్.. మొదటి ఎపిసోడ్ లోనే ఓ గ్రూప్ పోలీసులను చంపి వీరప్పన్ లోని విలనిజంని ఎలివేట్ చేసిన సీన్, అలాగే ఆ తర్వాత తన లైఫ్ లో జరిగిన రెండు విషయాలపై అతని రియాక్ట్ అయ్యే విధానాన్ని షూట్ చేసిన విధానం ఆడియన్స్ లో ఇంట క్రూరమైన వాడా వీరప్పన్ అనే ఫీలింగ్ ని జెనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే అందరినీ సర్పైజ్ చేసే ఎపిసోడ్ మాత్రం వీరప్పన్ లవ్ స్టొరీ.. ఈ ఎపిసోడ్ రొమాంటిక్ గా లేకపోయినా ఆ లవ్ సీన్ మాత్రం చూసే ఆడియన్స్ లో ఒక చిన్న స్మైల్ ని జెనరేట్ చేస్తుంది. అలాగే వీరప్పన్ ని వెయ్యాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ని తిప్పి కొట్టి అతని పోలీసులపై రివర్స్ లో అటాక్ చేసే ఇంటర్వల్ ఎపిసోడ్ సినిమాకి ఓ మెయిన్ హైలైట్.
వీరప్పన్ వలన రియల్ లైఫ్ లో బాగా సఫర్ అయిన శివరాజ్ కుమార్ ఇందులో వీరప్పన్ ని చంపాలని ట్రై చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. వీరప్పన్ ని చంపాలి దానికోసం ఏం చేయడానికైనా ఎవరిని చంపడానికైనా, తను చావడానికైనా సిద్దంగా ఉండే పాత్రలో శివరాజ్ నటన చాలా బాగా చేసాడు. శివరాజ్ కుమార్ తెలుగు వారికి కొత్తైనా నటనపరంగా ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇకపోతే వీరప్పన్ కి అచ్చుగుద్దినట్టు ఉండేలా సందీప్ భరద్వాజ్ కనిపించాడు. అలాగే క్రూరత్వం, ఫేస్ లో విలనిజం చూపించడంలో ది బెస్ట్ అనిపించుకున్నాడు. వీరిద్దరూ ఈ సినిమాకి ది బెస్ట్ కాస్టింగ్ సెలక్షన్ అని చెప్పాలి. వీరిద్దరి తర్వాత వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో చేసిన యజ్ఞ శెట్టి నటనతో పాటు తన క్యూట్ లుక్స్ కూడా బాగున్నాయి. ఇక పరుల్ యాదవ్ బాగా చేసింది. ఇక మిగిలిన కర్ణాటక నటీనటులు తమ తమ పాత్రల్లో బాగానే చేసారు.
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పార్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. దానికి కారణం రియల్ గా వీరప్పన్ ని చంపిన తరహాలోనే షూట్ చేసిన సీన్ అందరికీ నచ్చుతుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటే సెకండాఫ్ లో చివరి 15 నిమిషాలు మెప్పించగలిగింది.
మైనస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్ లో చెప్పిన మొదటి ప్లస్ పాయింటే ఈ సినిమాకి మైనస్ కూడాను. ఆ కామన్ పాయింట్ వీరప్పన్ పేరు. ఎలా అనే విషయానికి వస్తే.. వీరప్పన్ అనగానే అందరూ వీరప్పన్ లైఫ్ ని అందులోని మేజర్ ఇన్సిడెంట్స్ ని చూపిస్తారని అనుకుంటారు. కానీ ఈ కథని వీరప్పన్ పాయింట్ లో చెప్పలేదు.. ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా వీరప్పన్ ని చంపాలనుకున్నాడు అనే పాయింట్ లోనే సినిమాని చెప్పాడు. దాంతో వీరప్పన్ ఎపిసోడ్స్ తక్కువ పోలీస్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అందువలన వీరప్పన్ గురించి డీటైల్ గా చెప్పలేదే అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా ఉండిపోతుంది. అదీ కాక వీరప్పన్ ని పోలీసులు చంపిన మిషన్ గురించి ఇంచు మించు అందరికీ తెలిసిందే. దాని వలన సెకండాఫ్ లో తెలిసిన దాన్నే ఎందుకు చూపిస్తున్నారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. దానివలన చాలా చోట్ల ఆడియన్స్ కి సినిమా బోర్ కొడుతుంది.
సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే కథలో వీరప్పన్ ని ఎలా చంపబోతున్నామో అనేదే చూపించనున్నారు అనేది తెలిసిపోతుంది. దానివలన స్క్రీన్ ప్లే అనేది బాగా టఫ్ గా ఉండాల్సింది. కానీ సినిమా లేగ్త్ ఎక్కువ అవ్వడం, కథనంలో ఫుల్ గ్రిప్ లేనందు వల్ల చాలా చోట్ల బోర్ కొడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో పోలీస్ యాంగిల్ సినిమాని ఎక్కువగా సాగదీసినట్టు అనిపిస్తుంది. పరుల్ యాదవ్ పాత్రలో క్లారిటీ లేదు. సడన్ గా ఆ పాత్ర ఎందుకు కథలోకి వస్తుంది, ముత్తు లక్ష్మి పాత్రకి ఫ్రెండ్ చేయడం కోసం తననే ఎందుకు ఎంచుకున్నారు, తనెందుకు పోలీసులకి సపోర్ట్ చేసింది అనే విషయాలను గురించిన క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ దగ్గరలో వీరప్పన్ కి అసలు పొలిటికల్ గా ఎలాంటి సపోర్ట్ లేదు, తనకి ఎలాంటి సపోర్ట్ లేక ఒకరి సపోర్ట్ కోసం ఆరాటపడుతుంటాడు అనే పాయింట్ అస్సలు నమ్మశక్యంగా లేదు. ఎర్రమట్టి దిబ్బల్లో వీరప్పన్ ని అప్ట్టుకోవాలని ప్లాన్ చేసి దానిని అట్టర్ ఫ్లాప్ అయ్యేలా డీల్ చేసిన సీన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమాని మధ్య మధ్యలో బాగా స్లో చేసి సాగదీస్తూ రావడమే సినిమాకి మైనస్.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో చెప్పుకోదగిన కొన్ని డిపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. రమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఫారెస్ట్ ఎపిసోడ్ ని షూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక మ్యూజిక్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే.. రాజశేఖర్, రవిశంకర్, మున్నాకాశీ, సునీల్ కశ్యప్ లు కలిసి పాటలు కంపోజ్ చేసారు. వీరి సాంగ్స్ యాజిటీజ్ ఇది వరకూ వచ్చిన వర్మ సినిమాల సాంగ్స్ లానే ఉన్నాయి. అలాగే పెద్దగా హెల్ప్ కూడా అవ్వలేదు. ఇక సాండీ సినిమా స్టార్టింగ్ లో వీరప్పన్ ఎపిసోడ్స్ కి బాగా మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఆ ఆ తర్వాత చాలా కీలక సన్నివేశాల్లో బాగా పేలవమైన మ్యూజిక్ ఇచ్చాడు. రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్, లొకేషన్ సెలక్షన్ బాగుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ అండ్ షార్ప్ గా ఉండాల్సింది. అది లేకపోవడం వలనే సినిమా బోర్ కొడుతుంది.
ఇకపోతే కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది రామ్ గోపాల్ వర్మ.. కథ పరంగా వర్మ పోలీసులు వీరప్పన్ ని చంపడానికి ప్లాన్ చేసిన కకూన్ మిషన్ గురించి మాత్రమే చెప్పాడు. అలా కాకుద్నా మరికొన్ని వీరప్పన్ లైఫ్ లోని ఇన్సిడెంట్స్ ని కూడా జత చేసి కథని రాసుకొని ఉంటే బాగుండేది. ఇక స్క్రీన్ ప్లే పరంగా పోలీస్ యాంగిల్ లో చెబుతున్నప్పుడు ఇంకా వేగంగా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో స్లో అండ్ బోరింగ్ ఫీల్ ఎక్కువ కలుగుతుంది. ఇక డైరెక్టర్ గా పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో, రాసుకున్న వాటిలో మెయిన్ ఎపిసోడ్స్ ని తీయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ లాజికల్ గా మెయిన్ ప్లాట్ లోనే మిస్టేక్స్ చేసాడు. ఇక మంజునాథ్ నిర్మాణ వేలివాలు బాగున్నాయి.
తీర్పు :
‘రక్త చరిత్ర’ తర్వాత రామ్ గోపాల్ వర్మ మరోసారి వీరప్పన్ రియల్ లైఫ్ స్టొరీని తీసుకొని చేసిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ కథలో వీరప్పన్ చివరి దశ, అతన్ని చంపిన ప్లాన్ కి కొన్ని సినిమాటిక్ అంశాలను జోడించి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ మేరకు ఆకట్టుకుంటుందనే చెప్పాలి. వీరప్పన్ ఎంత స్ట్రాంగ్ అనేది చూపడం కోసం చూపిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసే ఆడియన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. వీరప్పన్ పాయింట్ అఫ్ వ్యూలో సినిమాని చెప్పే ప్రయత్నం చేసుంటే సినిమా సూపర్బ్ అనిపించుకునేది కానీ పోలీస్ యాంగిల్ లో చూపడం వలన జస్ట్ బాగుంది అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెగ్యులర్ మూస తరహా సినిమాలు చూసే వారికి, ఈ సినిమా అంత పెద్దగా అనిపించకపోయినా, రియల్ లైఫ్ స్టొరీస్, వర్మ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రీసెంట్ టైమ్స్ లో వర్మ నుంచి వచ్చిన బెస్ట్ ప్రోడక్ట్ ‘కిల్లింగ్ వీరప్పన్’ అని చెప్పుకోవాలి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం