ఆడియో సమీక్ష : కో అంటే కోటి – ఫ్రెష్ ఫీల్ తో సాగే సరికొత్త ఆల్బమ్

ఆడియో సమీక్ష : కో అంటే కోటి – ఫ్రెష్ ఫీల్ తో సాగే సరికొత్త ఆల్బమ్

Published on Dec 11, 2012 4:00 AM IST


అందరిలా ఒకేలా వెళితే తనకంటూ ప్రత్యేకత ఏముంది అనుకున్నాడేమో మన యంగ్ హీరో శర్వానంద్ మొదటి నుండి రొటీన్ కి భిన్నంగా తన పాత్రలను, సినిమాలను ఎంచుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. తన సొంత ప్రొడక్షన్ శర్వా ఆర్ట్స్ బ్యానర్ పై ‘కో అంటే కోటి’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆడియో ఇటీవలే రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైంది. ప్రియ ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిష్ కురువిల్ల దర్శకత్వం వహించాడు. శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1) పాట : కో అంటే కోటి

గాయకుడు : సూరజ్ జగన్

రచయిత : బి.ఆర్.కె

ఆల్బంలో సాలిడ్ గా ఉండే ఓపెనింగ్ పాట ఇది. అలాగే ఈ పాటలో మెటల్ సౌండ్ మరియు ఇండియన్ వాయిద్యాల సౌండ్స్ ని చాలా బాగా ఉపయోగించారు. ఈ సాంగ్ బాగా నచ్చడానికి కొంత సమయం పడుతుంది, ఒకసారి నచ్చేసిందో ఇక ఈ పాటకి అడిక్ట్ అయిపోతారు. ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ ‘కొండవీటి సింహం’ నుండి ‘ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్’ డైలాగ్ అలాగే ఎస్.వి రంగారావు గారు ‘జగత్ జెట్టీలు’ లో చెప్పిన ‘డోంగ్రే’ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సూరజ్ జగన్ వాయిస్ సూపర్బ్ గా సెట్ అయ్యింది. ఇది విన్న తర్వాత ఈ పాట ఎలా తీసి ఉంటారా అనే ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఈ పాటలోని లిరిక్స్ మరియు భాష మీద శ్రద్ధ తీసుకోవాల్సింది.

2) పాట : ఓ మధురిమవై

గాయకుడు : నరేష్ అయ్యర్

రచయిత : శ్రేష్ఠ

ఇది స్లోగా సాగే రొమాంటిక్ సాంగ్, పాటకి తగ్గట్టుగానే నరేష్ అయ్యర్ సూపర్బ్ గా తన గాత్రాన్ని అందించాడు. మెల్ల మెల్లగా ‘ఓ మధురిమవై’ పాటకి మంచి పేరు, రెస్పాన్స్ వస్తుంది. శ్రేష్ఠ సాహిత్యం కూడా కవితలాగా ఉంది, పాటకి తగ్గట్టుగానే సౌండ్ ట్రాక్ కూడా చాలా మెలోడీగా ఉంది. ఈ పాట వింటుంటే హీరో అమ్మాయి ప్రేమని ఆస్వాదించేలా ఉంది. ఈ పాటలో గిటార్ – పెర్కుషన్ వాయిద్యాలను చాలా బాగా ఉపయోగించారు. పాట సింప్లీ సూపర్బ్.

3) పాట : వరాల వాన

గాయనీ గాయకులు : హరి చరణ్, ప్రియ హేమేష్

రచయిత : వసిస్థ శర్మ

ఇది ఆల్బంలో రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్, ఈ పాటకి హరి చరణ్, ప్రియ హేమేష్ తమ గాత్రంతో పూర్తి న్యాయం చేసారు. ఈ పాట మొదటి లైన్ లో వచ్చే లిరిక్ లానే ఈ పాటని కూడా వానలో షూట్ చేసి ఉంటారు. వసిస్థ శర్మ లిరిక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ పాటలో సౌండ్ ట్రాక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా మెలోడియస్ గా ఉండే ఈ పాటలో కొన్ని మెటల్ సౌండ్స్ మరియు ఎలక్ట్రిక్ గిటార్ ని చాలా బాగా ఉపయోగించారు. ఓవరాల్ గా డీసెంట్ గా ఉంది ఈ సాంగ్ మరియు ఈ పాటకి ప్రియ హేమేష్ వాయిస్ ప్రధాన హైలైట్.

4) పాట : బంగారు కొండ

గాయకుడు : హరిణి

రచయిత : శ్రేష్ఠ

క్లాసికల్ గా సాగే ‘బంగారు కొండ’ పాట 3 నిమిషాల 15 సెకన్లు మాత్రమే ఉండే చిన్న బిట్ సాంగ్. హరిణి వాయిస్ చాలా సూపర్బ్ గా ఉంది. శ్రేష్ఠ సాహిత్యం భక్తి ఫీల్ తో బాగుంది. కార్తీక్ ఈ పాటకి ఇండియన్ సాంప్రదాయ వాయిద్యాలను ఉపయోగించి సంగీతం అందించాడు. ఈ సాంగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది.

5) పాట : ఆగిపో

గాయనీ గాయకులు : కార్తీక్, శ్వేతా మోహన్

రచయిత : వసిస్థ శర్మ

ఈ రొమాంటిక్ డ్యూయెట్ పాట మొదట్లో వచ్చే గిటార్ సౌండ్ చాలా బాగుంది. ‘ఆగిపో’ అనే ఈ పాటలో కార్తీక్ – శ్వేతా మోహన్ కాంబినేషన్ సింగింగ్ బాగుంది. ట్రెడిషనల్ వాయిద్యాలతో మ్యూజిక్ చాలా మెలోడీగా ఉంటుంది. వసిస్థ శర్మ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా లవర్స్ స్లో పాటలను ఎక్కించుకోవడానికి కొంత టైం పడుతుంది, అలాగే ఆల్బం లోని ఈ పాట కూడా కొంచెం నిధానంగా జనాల్లోకి వెళుతుంది. ఓవరాల్ గా చాలా మంచి మెలోడీ సాంగ్ ఇది.

6) పాట : దేహం దేహం

గాయకుడు : శక్తి కాంత్ కార్తీక్

రచయిత : బి.ఆర్.కె

ఈ పాట మియామి పోలీసుల రేడియో చాటర్ సౌండ్ తో ఆసక్తికరంగా మొదలవుతుంది. బాగా బీట్ సౌండ్స్ ఇష్టపడే వారికి ఈ పాట తెగ నచ్చేస్తుంది, మిగతావారికి ఈ పాట డీసెంట్ గా అనిపిస్తుంది. బి.ఆర్ కె లిరిక్స్ హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి, అలాగే ఇది ఈ సినిమాకి థీం సాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పాట సినిమాలో ఎలా ఉంటుందో అని ఎంతో ఆసక్తిగా ఉంది. లిరిక్స్ కి తగ్గట్టుగా శక్తి కాంత్ మ్యూజిక్ చాలా నీట్ గా ఉంది.

తీర్పు :

చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉండే ‘కో అంటే కోటి’ ఆడియో స్టూడెంట్స్ కి మరియు యంగ్ జెనరేషన్ కి విపరీతంగా నచ్చేస్తుంది. ఈ ఆల్బంలో సాఫ్ట్ మరియు మెలోడీ పాటలతో పాటు రెండు రాకింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ‘కో అంటే కోటి’, ‘ఓ మధురిమవై’, ‘ఆగిపో’ మరియు ‘బంగారు కొండ’ పాటలు ఈ ఆల్బంలో నాకు బాగా నచ్చాయి. ఈ ఆల్బంతో శక్తి కాంత్ కార్తీక్ మంచి మార్కులు కొట్టేసాడు. ఈ సినిమా పాటలు మీకు www.koanteykoti.com లో ఫ్రీ గా దొరుకుతున్నాయి, ఆ సైట్లోకి వెళ్లి విని ఎంజాయ్ చేయండి.

Translated by Rag’s

సంబంధిత సమాచారం

తాజా వార్తలు