విడుదల తేదీ : నవంబర్ 12, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్నీ వేన్, భరత్ నివాస్
దర్శకత్వం : శ్రీనాథ్ రాజేంద్రన్
నిర్మాతలు: వే ఫారర్ ఫిల్మ్స్ & ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీత దర్శకుడు: సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి
ఎడిటింగ్: వివేక్ హర్షన్
శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్’. ఈ చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించింది. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
గోపి కృష్ణన్ (దుల్కర్ సల్మాన్) పరీక్షలో ఫెయిల్ అయి.. ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు. అయితే, అక్కడ గోపి కృష్ణన్ ప్రవర్తన కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో విసిగిపోయిన అతను విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతాడు. అలా దారి తప్పిన గోపి కృష్ణన్ తెలివిగా చిన్న చిన్న క్రైమ్ లు చేస్తూ క్యాష్ చేసుకుంటాడు. ఈ మధ్యలో శారదాంబ (శోభితా ధూళిపాళ)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ కావడానికి బిగ్ క్రైమ్ చేసి తాను చనిపోయినట్లు అందర్నీ నమ్మించి.. గోపి కృష్ణన్ నుంచి సుధాకర్ కురుప్ (దుల్కర్ సల్మాన్)గా మారతాడు. అసలు గోపి కృష్ణన్ చేసిన క్రైమ్ ఏమిటి ? అలాగే సుధాకర్ కురుప్ నుంచి మళ్ళీ అలెగ్జాండర్ గా ఎలా మారాడు ? అన్నిటికీ మించి అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? చివరకు అతను ఏమి సాధించాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
దుల్కర్ సల్మాన్.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వివిధ గెటప్స్ లో చక్కగా నటించి దుల్కర్ మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో దుల్కర్ చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.
ఇక హీరోయిన్ గా నటించిన శోభితా ధూళిపాళ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన ఇంద్రజిత్ సుకుమారన్ నటన కూడా బాగుంది. మరో నటుడు సన్నీ వేస్ కూడా చాల బాగా నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని క్రైమ్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లోని సస్పెన్స్ సీన్స్ మరియు కురుప్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
గోపి కృష్ణన్ అనే ఓ సాధారణ వ్యక్తి తన జీవితంలో ఎదగడానికి చేసిన అసాధారణ పనులను తెర పై అంతే స్థాయిలో అంతే క్లారిటీగా చూపించలేకపోయారు. అసలు గోపి కృష్ణన్ చనిపోయినట్టు అందర్నీ ఎలా నమ్మించగలిగాడు ? అనే కోణంలో వచ్చిన సీన్స్ అన్నీ పూర్తి సినిమాటిక్ గా ఉన్నాయి.
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సినిమాని నడపాలి. ఈ సినిమాలో కొన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ సీన్స్ ఆ స్థాయిలోనే ఆకట్టుకున్నా.. కీలక సన్నివేశాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.
కాకపోతే దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపాడు. కానీ ఫస్ట్ హాఫ్ ను మాత్రం బోరింగ్ ప్లేతో కన్ ఫ్యూజన్ డ్రామాతో నిరాశ పరిచాడు. దీనికి తోడు సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లే మిస్ అయింది. కొన్ని సీన్స్ గందరగోళంగా సాగుతున్న ఫీలింగ్ కలిగిస్తాయి. పైగా ఆ సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో సహజత్వం లోపించింది.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సుశీన్ శ్యామ్ వి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్షన్ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. అయితే దర్శకుడు ఇంకా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే అవుట్ ఫుట్ మరో స్థాయిలో ఉండేది. ఇక నిర్మాతగా దుల్కర్ సల్మాన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
‘కురుప్’ అంటూ వచ్చిన ఈ డార్క్ క్రైమ్ డ్రామాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అయితే ప్లేలో లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల ట్రీట్మెంట్ స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా దుల్కర్ సల్మాన్ నటన కోసమైనా ఈ సినిమాను చూడొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team
Click Here For English Version