విడుదల తేదీ : 05 డిసెంబర్ 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5 | ||
దర్శకత్వం : నంద్యాల రవి | ||
నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి | ||
సంగీతం : కెఎం రాధాకృష్ణ | ||
నటీనటులు : నాగ శౌర్య, అవిక గోర్… |
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో నాగ శౌర్య నటించిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం అవిక గోర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా నంధ్యాల రవి దర్శకుడిగా పరిచయం అయ్యారు. గిరిధర్ నిర్మాతగా, కెఎం రాధాకృష్ణ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ శౌర్య – అవిక గోర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం…
కథ :
లక్ష్మీ నిలయం – ఈ ఇంటికి పెద్ద సర్వేశ్ ఆనంద్ రావు(రావు రమేష్). అతనికి ఇద్దరు కొడుకులు, ఒక ముద్దుల కుమార్తె.. తనే లక్ష్మీ(అవిక గోర్). అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉండే సర్వేశ్ రావు తన కుటుంబ సభ్యులను ఎంతో పద్దతిగా పెంచుతాడు. అనుకున్నట్టుగానే చదువు పూర్తి చేసుకొని జాబు తెచ్చుకున్న లక్ష్మీకి పెళ్లి చేయడానికి సర్వేశ్ ఆనంద్ రావు నిర్ణయించుకుంటాడు. అందులో భాగంగానే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు.
అక్కడి నుంచి కట్ చేస్తే సాయి(నాగ శౌర్య) తన బిటెక్ ఫినిష్ చేసుకొని ఫ్రెండ్స్ తో కలిసి బాగా జులాయిగా తిరిగే కుర్రాడు. ఓ రోజు అనుకోకుండా లక్ష్మీని చూసిన సాయి ప్రేమలో పడతాడు. కానీ తన ప్రేమని చెప్పడానికి వెళ్ళిన సాయికి లక్ష్మీ తనకి నిశ్చితార్ధం అయిపోయిందని తెలిసి షాక్ అవుతాడు. అయినా ఆ రోజు నుంచి సాయి లక్ష్మీని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తుంటాడు. ఇలా సాయి తన లవ్ ని సక్సెస్ చేసుకోవడానికి ఏమేమి చేసాడు.? అలాగే లక్ష్మీ సాయిని ప్రేమించిందా.? లేదా.? చివరికి లక్ష్మీ – సాయి ఒకటయ్యారా.? లేక లక్ష్మీ వాళ్ళ నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుందా.? అనేది మీరు వెండితెరపైనే చూసి తెలుసుకోవాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది.. సినిమా స్టార్టింగ్.. సినిమా స్టార్టింగ్ టైటిల్స్ లో వచ్చే గుడ్డు కథకి, పాత్రల పరిచయానికి వచ్చే రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ మూవీ చూస్తున్న ప్రేక్షకున్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. అలాగే మొదటి 40 నిమిషాలు సినిమా చాలా వేగంగా ఉంటుంది. అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆ తర్వాత నుంచి కూడా అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది.
ఇక పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలి అంటే.. నాగ శౌర్య తన రెండు సినిమాలకంటే ఈ సినిమాలో ఇంకాస్త మెచ్యూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ ఆ మెచ్యూరిటీలో ఎక్కువగా ఇమిటేషన్ కనిపించింది. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గానే కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా ట్రై చేసాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో అతని మానరిజమ్స్ బాగానే ఉన్నా చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం మన స్టార్ హీరోస్ ని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక్క ఫైట్స్ లోనే కాకుండా చాలా సీన్స్ లో పలువురు స్టార్ హీరోలని బాగా ఇమిటేట్ చేసాడనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. ముఖ్యంగా నాగ శౌర్య ఇందులో డాన్సులు కూడా బాగా చేసాడు. ఇకపోతే అవిక గోర్ చూడటానికి ఇంకా చిన్న అమ్మాయిలానే కనిపిస్తున్నా అనిపించినా నటనలో మంచి మార్కులే కొట్టేసింది. చీరల్లో చూడటానికి అందంగా ఉంది. అవిక గోర్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన విద్యారావు చాలా బాగుంది.
ఒక ఫ్యామిలీ పెద్ద పాత్రలో రావు రమేష్ నటన చాలా బాగుంది. ఇక దొంగగా సప్తగిరి కనిపించేది కొద్దిసేపే అయినా తన కామెడీ ట్రాక్ మాత్రం ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఇక సాఫ్ట్ వేర్ సుబ్రమణ్యంగా వెన్నెల కిషోర్ కూడా ప్రేక్షకులని నవ్వించాడు. నరేష్, ప్రగతి, వేణు, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. ‘రాజా రాణి’ సినిమాలోని అమ్మాయిలు రియల్ గా ఎలా ఉంటారు అనే కాన్సెప్ట్ ని నరేష్ చేత చెప్పించిన ఎపిసోడ్ బాగా నవ్వు తెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా మొదటి 40 నిమిషాలు ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఆ తర్వాత సినిమా అంత స్లో అయిపోతుంది. ఆ తర్వాత కథ పెద్దగా ముందుకు సాగదు. ఇకపోతే అటు తిప్పి ఇటు తిప్పి ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకూ కథను కాస్త ముందుకు తీసుకువచ్చినా అక్కడి నుంచి మాత్రం సినిమా కథ క్లైమాక్స్ వరకూ అస్సలు కదలదు. సెకండాఫ్ అంతా కథ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనే అనుమానం చూసే ఆడియన్స్ కి వస్తుంది. రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాలో హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ ని 5 నిమిషాలు టైం అడిగే పాయింట్ ని ఇక్కడ కాస్త మార్చి 3 గంటలు చేసి సెకండాఫ్ అంతా సాగదీసారు. ఆ ఎపిసోడ్స్ అంతా పెద్దగా ఆకట్టుకోలేదు.
హీరోకి యాక్షన్ ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్లైమాక్స్ లో ఓ ఫైట్ ని పెట్టారు, కథా ప్రకారం అక్కడ ఫైట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అనవసరంగా పెట్టారని అనిపిస్తుంది. ఇకపోతే లాజికల్ గా నాకు ప్రేమ వద్దు అని వెళ్ళిపోయినా హీరోయిన్ ఏ కారణం చేత తన పేరెంట్స్ ని కాదని క్లైమాక్స్ లో హీరో కోసం వస్తుందనే పాయింట్ పై క్లారిటీ లేదు. సినిమాలో ఎక్కడా పర్సనల్ గా కూడా హీరోయిన్ లో లవ్ అనేది జెనరేట్ అయ్యిందనే విషయాన్ని తెలియజేయలేదు. స్క్రీన్ ప్లే పరంగా సినిమాలో మనం ఊహించలేనిది అంటూ ఏమీ ఉండదు. డైరెక్టర్ కథా ప్రకారం కొన్ని చోట్ల చాలా మంచి సీన్స్ ని రాసుకున్నప్పటికీ టేకింగ్ పరంగా మాత్రం సరిగా తీయలేదు. ఈ మధ్య కాలంలో డైలాగుల ప్రాస మీద పడి అవి సన్నివేశానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయా లేదా అనేది డైరెక్టర్స్ మిస్ అయిపోతున్నారు. ఈ సినిమా డైలాగ్స్ లో కూడా ప్రాస ఎక్కువ, భావం తక్కువ అయ్యింది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో బెస్ట్ అనిపించుకున్న వాటిల్లో ముందుగా చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ గురించి.. బాల్ రెడ్డి వైజాగ్ లోని అందాలని బాగా చూపించాడు. అలాగే ప్రతి ఫ్రేం చాలా గ్రాండ్ గా ఉండడమే కాకుండా బ్యూటిఫుల్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక కెఎం రాధాకృష్ణ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం సదర్భానికి తగ్గట్టుగా సెటిల్ గా ఉంటే, కొన్ని చోట్ల మాత్రం అవసరానికి మించిన డోస్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఎడిటింగ్ అనేదయితే ఎలా పడితే అలా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల అర్థవంతంగా అనిపిస్తుంది. గిరిధర్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.
ఇకపోతే నంద్యాల రవికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ విభాగాలను డీల్ చేసాడు. ఒక్కోదాని గురించి చెప్పుకుంటే.. కథ – కథ పాతదే అయినా కథలో రాసుకున్న పాత్రలను మాత్రం బాగా రాసుకున్నాడు. అందుకే సినిమా స్టార్టింగ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే – మీ ఊహించిందే ఉంటుంది, మీరు ఊహించనిది ఏమీ ఉండదు. డైలాగ్స్ – పైన చెప్పినట్టు ప్రాస కోసం పాకులాడడం వలన సందర్భంలోని భావం డైలాగ్స్ లో కనిపించదు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఫన్నీ డైలాగ్స్ ఇరికించాలని ట్రై చేసి తప్పు చేసాడు. దానివలన సీన్స్ లో ఉన్న ఎమోషన్ మిస్ అయ్యాయి. ఇక డైరెక్టర్ గా జస్ట్ పాస్ మార్కులు మాత్రమే సంపాదించుకున్నాడు. అనుకున్న కాన్సెప్ట్ ని ఇంకాస్త తక్కువ రన్ టైంలో చెప్పి, అనవసరపు ట్రాక్స్ ని పక్కన బెట్టి ఉంటే సినిమాని మంచి రెస్పాన్స్ వచ్చేది.
తీర్పు :
వరుసగా రెండు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకున్న నాగ శౌర్య సోలో హీరోగా చేసిన మూడవ సినిమా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా కూడా కొంత వరకూ మాత్రమే యువతని ఆకట్టుకోగలిగింది. డైరెక్టర్ నంధ్యాల రవి అనుకున్న కాన్సెప్ట్ ని సగం వరకూ మాత్రమే సరిగా డీల్ చేయగలగడంతో మిగతా సగం ఆడియన్స్ ని నిరాశ పరుస్తుంది. ఓవరాల్ గా నాగ శౌర్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే బోరింగ్ సెకండాఫ్, పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ లేని క్లైమాక్స్, స్క్రీన్ ప్లే, సందర్భంతో పెద్దగా సంబంధం లేకుండా వచ్చే ప్రాస డైలాగ్స్ ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. నాగ శౌర్య మొదటి రెండు సినిమాలు వారాహి చలన చిత్ర మ బ్యానర్ లో రావడం, అలాగే సాయి కొర్రపాటి భారీ ఎత్తున ప్రమోషన్స్ చెయ్యడం ఆ సినిమాలకి హెల్ప్ అయ్యాయి. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉండడం కూడా ఈ సినిమాకి మరో మేజర్ మైనస్ పాయింట్. ఎ సెంటర్స్ లో అక్కడక్కడా పరవాలేధనిపించుకునే ఈ సినిమా బి, సిలో పెద్దగా ఆకట్టుకునే చాన్స్ లేదు. చివరిగా ఫస్ట్ హాఫ్ ని ఎంజాయ్ చేసి, సెకండాఫ్ బాగాలేకపోయినా పర్లేదు అనుకునే వారు ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా చూడొచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5 /5
123తెలుగు టీం