ఆడియో సమీక్ష : లవర్స్ – జెబి మెలోడియస్ ఆల్బమ్..!

ఆడియో సమీక్ష : లవర్స్ – జెబి మెలోడియస్ ఆల్బమ్..!

Published on Jul 11, 2014 12:00 PM IST

‘అంతకముందు ఆ తరువాత’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్, ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫేం నందిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ‘లవర్స్’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి హరినాథ్ డైరెక్టర్. ఈ లవ్ స్టొరీకి మ్యూజిక్ డైరెక్టర్ జెబి సంగీతాన్ని అందించాడు. ఇటీవలే విడుదలైన ఈ ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఈ ఆల్బంలోని 6 సాంగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : లవర్స్
గాయకులు : రేవంత్, పృథ్వి, అనుదీప్, హైమంత్
సాహిత్యం : శ్రీ మణిLovers (1)
‘లవర్స్’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ లో హీరో హీరోయిన్ పాత్రలని, సినిమాలోని వీళ్ళ మధ్య జరిగే ప్రేమకథని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రమోషనల్ సాంగ్ లా ఈ పాటని రూపొందించారు. కథలోని కంటెంట్ ని శ్రీ మణి తన సాహిత్యంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. రేవంత్, పృథ్వి, అనుదీప్, హైమంత్ ల వాయిస్ ల మధ్య ఉన్న వైవిధ్యం పాటకి బాగా మ్యాచ్ అయ్యింది. అలాగే డ్రమ్ బీట్స్, పెర్క్యూషణ్ ఇంస్ట్రుమెంట్స్ మరియు గిటార్ సౌండ్స్ తో యువతకి నచ్చేలా జెబి మ్యూజిక్ అందించాడు. ఈ బిట్ సాంగ్ ని సినిమా టైటిల్స్ అప్పుడు లేదా సినిమా ప్రమోషన్స్ లో ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Lovers (6)2. పాట : ఓ మైన మైన
గాయకుడు : హరి చరణ్
సాహిత్యం : కాసర్ల శ్యామ్

‘ఓ మైన మైన’ పాట ఆల్బమ్ లో వచ్చే మొదటి మెలోడీ సాంగ్. ప్రేమలో పడిన హీరో తను ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ, ఆమెని పొగుడుతూ పాడే ఈ పాటలో కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. వినదగిన సాహిత్యానికి హరి చరణ్ తన గాత్రంతో పాటకి ప్రాణం పోశాడు. వీరిద్దరికీ ఏ మాత్రం తీసిపోకుండా జెబి కూడా గిటార్, వీణ, గజల్ సౌండ్స్ కి మధ్య మధ్యలో డ్రమ్ బీట్స్ ని జత చేసి చాలా వినసొంపుగా పాటకి ట్యూన్ ఇచ్చాడు. పాట మధ్య మధ్యలో వచ్చే కొన్ని సౌండ్స్, అలాగే సింగర్ వాయిస్ తో పాటు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఇంస్ట్రుమెంట్ సౌండ్స్ వినేవారిని ఆ పాటలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఆల్బమ్ లో ఇది బెస్ట్ సాంగ్.

3. పాట : హ్యాపీ హ్యాపీ
గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగంజ్, లిప్సిక
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రిLovers (2)

‘హాపీ హ్యాపీ’ అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసింది. కాస్త ఫోక్ సాంగ్ స్టైల్లో ఉండే ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. హిందీ, తెలుగు మిక్స్ చేసిన ఆయన సాహిత్యం ఓకే అనేలా ఉన్నా రాహుల్ సిప్లిగంజ్, లిప్సికలు తమ వాయిస్ తో పాటలో ఊపు తెచ్చారు. ఇక జెబి అందించిన ఈ ట్యూన్ లో కొత్తదనం ఏమీ లేదు. పూర్తిగా బీట్స్ తో మధ్య మధ్యలో గిటార్ సౌండ్ తో సాగే ఇలాంటి ట్యూన్స్ ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే చాలా సార్లు విన్నారు. వినేటప్పుడు ఈ పాటకి పెద్దగా కనెక్ట్ కాకపోయినా ఫోక్ స్టైల్లో మంచి జోష్ వచ్చేలా ఈ పాటని షూట్ చేసి ఉంటే మాస్ ప్రేక్షకులు ఈ పాటకి బాగా కనెక్ట్ అవుతారు.

4. పాట : ఎంతో తెలియని దూరం
గాయకుడు : హైమంత్
సాహిత్యం : కాసర్ల శ్యామ్ 

Lovers (5)ఈ ఆల్బమ్ లో మెలోడీ లిరిక్స్ కి, ఫాస్ట్ బీట్స్ జత చేసిన సాంగ్ ‘ఎంతో తెలియని దూరం’. ఈ పాట ఒకే ఫ్లో లో వెళ్ళకుండా అక్కడక్కడా స్లో అవ్వుతూ మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది. ఈ మెథడ్ వినేవారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. మనం ప్రేమించబోయే వ్యక్తి పక్కనే ఉన్నా తెలుసుకోలేని కొన్ని క్షణాలను, ప్రేమలో ఉన్న కొన్ని ఫీలింగ్స్ ని ఈ పాటలో బాగా రాశాడు. దానికి హైమంత్ గాత్రం పర్ఫెక్ట్ గా సరిపోయింది. అలాగే జెబి అందించిన సంగీతం కూడా ఈ పాట మూడ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది. గిటార్ సౌండ్స్, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే డిజెంబే సౌండ్స్, డ్రమ్స్ ని పాట ఫీల్ ని పోగొట్టకుండా జెబి బాగా ఉపయోగించాడు. ఈ ఆల్బంలో ఇదొక చెప్పుకోదగిన సాంగ్ అవుతుంది.

 

5. పాట : ప్రియతమా నా మనసే
గాయకుడు : దివ్య దివాకర్, సాయి చరణ్
సాహిత్యం : ఓరుగంటి

Lovers (4)ఈ ఆల్బమ్ లో వచ్చే మరో మెలోడీ డ్యూయెట్ సాంగ్ ‘ప్రియతమా నా మనసే’. బ్యూటిఫుల్ కీ బోర్డ్ అండ్ గిటార్ సౌండ్స్ తో మొదలయ్యే ఈ పాట మొదట వినగానే ఎఆర్ రెహమాన్ చేసిన ‘ప్రేమించే ప్రేమవే’ పాటలా ఉంటుంది. కానీ వినగా వినగా ఈ పాటకి బాగా కనెక్ట్ అవుతారు. ఒకరికి ఒకరు తమ ప్రేమను గురించి వ్యక్త పరిచే ఈ పాటలో ఓరుగంటి అందించిన సాహిత్యం చాలా బాగుంది. దివ్య దివాకర్, సాయి చరణ్ ల వాయిస్ ఈ మెలొడీకి చాలా బాగా సరిపోయింది. అలాగే జెబి ఈ పాటకి వాయించిన పెర్క్యూషణ్ ఇంస్ట్రుమెంట్స్, గిటార్, వయొలిన్ సౌండ్స్ పాట మూడ్ కి బాగా సరిపోయింది.

 

6. పాట : పెదవి చివర
గాయకుడు : రమ్య, రేవంత్
సాహిత్యం : కిట్టు ప్రగడ

Lovers (3)

ఈ పాట ఆల్బంలో వచ్చే చివరి మెలోడీ సాంగ్ మరియు ఇదొక విషాదకరమైన సాంగ్. హీరో – హీరోయిన్ మధ్య దూరం ఎక్కువనప్పుడు లేదా విఫలమైనప్పుడు తన ప్రేమ గురించి బాధపడుతూ పాడుకునే బిట్ సాంగ్ ఇది. ఈ పాటకి ఆడియన్స్ కనెక్ట్ చెయ్యాలని జెబి పాట మొదట్లో వయొలిన్ ని ఉపయోగించిన విధానం చాలా బాగుంది. అలాగే కీ బోర్డ్, గిటార్ ని కూడా బాగా ఉపయోగించి విషాదకరమైన పాటకి తన మ్యూజిక్ తో సగం ప్రాణం పోస్తే రమ్య, రేవంత్ కలిసి తన గాత్రంతో ఈ పాటకి మిగిలిన సగం ప్రాణం పోశారు.

 

తీర్పు :

ఇప్పటివరకూ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కే జెబి మ్యూజిక్ చేసినా ఎప్పుడూ ఎక్కువగా మెలోడీ సాంగ్స్ కొట్టేవాడు కాదు. కానీ మొదటిసారి జెబి ‘లవర్స్’ ఆడియోలో ఎక్కువగా మెలోడీ సాంగ్స్ కి ప్రాధాన్యం ఇచ్చాడు. జెబి మెలోడియస్ ట్యూన్స్ కి కాసర్ల శ్యామ్, ఓరుగంటి, కిట్టు ప్రగడ అందించిన సాహిత్యం మరింత హెల్ప్ అయ్యింది. ఈ మెలోడీస్ అన్నీ సినీ ప్రేక్షకులని, సంగీత శ్రోతల్ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే ఒక ఫోక్ సాంగ్ మాస్ ప్రేక్షకులను నచ్చే అవకాశం ఉంది. నా పరంగా ‘లవర్స్’ ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్స్ – ‘ఓ మైన మైన’, ‘ఎంతో తెలియని దూరం’, ‘ప్రియతమా నా మనసే’ మరియు ‘పెదవి చివర’. ఓవరాల్ గా ‘లవర్స్’ ఆడియో జెబి నుంచి వచ్చిన ఒక మెలోడియస్ ఆల్బమ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు