సమీక్ష : “లక్కీ లక్ష్మణ్” – అక్కడక్కడ ఆకట్టుకొనే రొటీన్ డ్రామా

సమీక్ష : “లక్కీ లక్ష్మణ్” – అక్కడక్కడ ఆకట్టుకొనే రొటీన్ డ్రామా

Published on Dec 31, 2022 3:06 AM IST
Lucky Lakshman Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్

దర్శకుడు : ఏ ఆర్ అభి

నిర్మాత: హరిత గోగినేని

సంగీత దర్శకులు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ

ఎడిటర్: ప్రవీణ్ పూడి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సోహెల్ ర్యాన్ నటించిన కొత్త చిత్రం లక్కీ లక్ష్మణ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

లక్ష్మణ్ (సయ్యద్ సోహెల్ ర్యాన్) ఒక మధ్యతరగతి విద్యార్థి, అతను తన కాలేజ్ మేట్ శ్రియ (మోక్ష) తో ప్రేమలో పడతాడు, ధనవంతురాలు అయినప్పటికి చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి. తన కోసం ఏమీ చేయని తన పేద తండ్రిని లక్ష్మణ్ వదిలేస్తాడు. శ్రియ లక్ష్మణ్‌ ను చూసుకుంటుంది. అయితే దురదృష్టవశాత్తు, వారు ఒక సమస్య కారణం గా విడిపోతారు. తరువాత లక్ష్మణ్ ధనవంతుడు కావాలని నిర్ణయించుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితులతో కలిసి మ్యారేజ్ బ్యూరోను స్టార్ట్ చేసాడు. అతను ఏ సమయంలోనైనా ధనవంతుడుగా, అనుకున్న విధంగా మారగలడు. ఒక రోజు, అతను శ్రియ యొక్క బ్యాడ్ ఫేజ్ గురించి తెలుసుకుంటాడు. శ్రియ ఏమైంది? అప్పుడు లక్ష్మణ్ ఏం చేశాడు? వారు మళ్లీ కలిశారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా ను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తన పాత్రలో డీసెంట్ గా కనిపించాడు. మధ్యతరగతి వ్యక్తిగా అతని నటన బాగుంది. సినిమాలో తన కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాక మంచి డాన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. మొత్తంగా, తన నటనతో సినిమా మొత్తాన్ని నడిపించాడు.

హీరోయిన్ మోక్ష స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆమె డీసెంట్ పెర్ఫార్మెన్స్ చెప్పుకోవాల్సిన వాటిలో ఒకటి. మిగిలిన నటీనటులు ఇచ్చిన పాత్రల్లో తమ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు.

కథ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎవరైనా దానిని సులభంగా అంచనా వేయవచ్చు. కానీ, దర్శకుడు ఏఆర్ అభి రొటీన్ కథను కొన్ని మంచి కామెడీ సన్నివేశాలను చిత్రీకరించి, సినిమాను చూడదగినదిగా మార్చడంలో విజయం సాధించాడు.

 

మైనస్ పాయింట్స్:

 

ఇలాంటి కథల్ని ప్రేక్షకులు చాలా ఏళ్లుగా చూస్తున్నారు. సినిమా రచయిత, దర్శకుడు అయిన AR అభి సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించాడు. రొటీన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నాడు. అతను సోహెల్ కోసం మంచి స్క్రిప్ట్ రాయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఓవర్ డ్రమటిక్ గా ఉన్నాయి. మొత్తానికి కథ పర్వాలేదు కానీ గొప్పగా అయితే లేదు.

మరోవైపు, సినిమాలో కొన్ని అనవసరమైన పాత్రలు ఉన్నాయి. అవి కొంత స్క్రీన్ టైమ్‌ను కిల్ చేసినట్లు అనిపిస్తుంది. క్లియర్ స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే లక్కీ లక్ష్మణ్‌ సినిమా ఇంకాస్త బాగుండేది. డైరెక్టర్ ఇంకా మంచి డైలాగ్స్ రాసి ఉండి ఉంటే బావుండేది. కానీ అలా జరగలేదు.

 

సాంకేతిక విభాగం:

 

పైన చెప్పినట్లుగా, డైరెక్టర్ అభి ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను ఎంచుకుని, చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయంలో అతను సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా బాగుండాలంటే చివరి భాగంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది.

 

తీర్పు:

 

మొత్తం మీద, లక్కీ లక్ష్మణ్ ఒక రొటీన్, పర్వాలేదు అనిపించే రొమాంటిక్ కామెడీ డ్రామా. సోహెల్ మరియు మోక్షల పెర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. సినిమాలో అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. రోటీన్ చిత్రాలని మీరు ఇష్టపడే వారు అయితే, ఈ వారాంతంలో సినిమాను చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు