సమీక్ష : మాచర్ల నియోజకవర్గం – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ యాక్షన్ డ్రామా!

Macherla Niyojakavargam Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 12, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా తదితరులు.

దర్శకత్వం : ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఎం.ఎస్ రాజాశేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా “మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్‌లుగా నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

‘మాచర్ల నియోజకవర్గం’లో రాజప్ప (సముద్రఖని) తనకు ఎవరు ఎదురు రాకుండా అడ్డు వచ్చిన వాడిని చంపుకుంటూ ఎలక్షన్సే లేకుండా గెలుస్తూ ఉంటాడు. మరోపక్క సిద్దార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ టాపర్. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో స్వాతి (కృతి శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే.. మాచర్ల నియోజకవర్గం’ రాజప్ప మనుషులు స్వాతిని చంపడానికి ట్రై చేస్తారు. అసలు రాజప్ప కి స్వాతికి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి ?, ఆ తర్వాత గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎలా జరిపించాడు ?, ఫలితంగా జరిగిన కొన్ని నాటకీయ పరిణాలు ఏమిటి ? చివరకు సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గం’లో పరిస్థితులు మార్చాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

నితిన్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం పక్కా పొలిటికల్ డ్రామాగా సాగడం వల్ల నితిన్ నుంచి వచ్చిన డిఫరెంట్ సినిమాగా ఈ సినిమా నిలుస్తోంది. ఇక నితిన్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కీలక పాత్రలో నటించిన హీరోయిన్ కృతి శెట్టి కూడా చాలా బాగా నటించింది. కథలో ఆమె పాత్రను ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. మరో హీరోయిన్ కేథరిన్ పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది.

విలన్ గా ప్రధాన పాత్రలో కనిపించిన సముద్రఖని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. అలాగే కొన్ని డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేకపోయారు. ఆయన రాసుకున్న సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా బోర్ గా సాగాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి.

ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, ఓన్లీ పొలిటికల్ డ్రామానే ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు. అదే విధంగా సముద్రఖని పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యారు. అలాగే కొన్ని చోట్ల ప్లే స్లో అయింది.

దీనికి తోడు ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితులకు ఈ సినిమాలో ప్రస్తావించిన రాజకీయ అంశాలకు మధ్య ఎక్కడా పొంతన లేదు. దాంతో ఈ సినిమాలో ప్రేక్షకులు మెయిన్ పాయింట్ కి అస్సలు కనెక్ట్ కారు. అలాగే లవ్ స్టోరీ కూడా బోరింగ్ గా సాగింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు సరైన కథా కథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

మాచర్ల నియోజకవర్గం అంటూ వచ్చిన ఈ పొలిటికల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. కానీ, నమ్మశక్యం కాని సన్నివేశాలతో, ఇంట్రెస్ట్ కలిగించలేని ప్లేతో అండ్ వర్కౌట్ కాని పొలిటికల్ సీన్స్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఐతే పొలిటికల్ జోనర్ లో సినిమాలను ఇష్ట పడే ప్రేక్షకులకు ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :