సమీక్ష : “మహా సముద్రం” – ఎమోషన్ బాగున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు !

Maha Samudram Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 14, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

దర్శకుడు: అజ‌య్ భూప‌తి

నిర్మాతలు: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట‌

సంగీత దర్శకుడు: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌

ఎడిటర్: ప్ర‌వీణ్ కె.ఎల్‌

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా వచ్చిన సినిమా ‘మహా సముద్రం’. వైజాగ్ నేపథ్యంలో నడిచే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

 

కథ :

 

అర్జున్ ( శర్వానంద్), విజయ్ (సిద్ధార్ద్) మంచి స్నేహితులు. విజయ్ మహాతో (అదితిరావు హైద‌రీ) ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గర అవుతాడు. అయితే అనుకుని జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా విజయ్ వైజాగ్ నుంచి వెళ్ళిపోతూ.. మహాను మోసం చేసి పారిపోతాడు. అయితే, విజయ్ చేసిన పొరపాట్లు కారణంగా అర్జున్ స్మగ్లింగ్ లోకి దిగాల్సి వస్తోంది. ఈ క్రమంలో చుంచు మామ (జగపతిబాబు) అర్జున్ కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు ? అర్జున్ వైజాగ్ సముద్రం పై ఆధిపత్యం సాధించాడా ? మళ్ళీ అర్జున్ జీవితంలోకి విజయ్ వచ్చి ఏమి చేశాడు ? చివరకు అర్జున్ మహా జీవితాల్లో జరిగిన మలువు ఏమిటి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా పంతం సినిమా చూడాల్సిదే
ప్లస్ పాయింట్స్ :

 

శ‌ర్వానంద్‌ గత చిత్రాలకు భిన్నంగా ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా సాగింది. అర్జున్ పాత్రలో శ‌ర్వానంద్‌ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్ లో శర్వానంద్ నటన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సిద్ధార్థ్‌ కూడా తన లుక్స్ లో యాక్షన్ లో ఫ్రెష్ నెస్ ఉన్న ఫీలింగ్ కలిగించాడు. తన పాత్రలో సిద్ధార్థ్‌ బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన అదితిరావు హైద‌రీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నంతలో ఆకట్టుకుంది. జ‌గ‌ప‌తిబాబు, రావు రమేష్ ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో కొన్ని మెయిన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు డైలాగ్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

రెగ్యులర్ ప్లేతో కూడుకున్న బోరింగ్ కథతో వచ్చిన ఈ సినిమాలో ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా రొటీన్ సీన్స్ తో సాగుతూ సినిమా బోర్ కొడుతుంది. నిజానికి దర్శకుడు సినిమాని ఇంట్రస్ట్ గా మొదలుపెట్టినప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడు. నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లోను దెబ్బ తీశాడు.

పైగా సినిమా కథాంశంలో కూడా ఎలాంటి కొత్తధనం చూపించకపోవడం, అలాగే సినిమాలో బలమైన కంటెంట్ లేకపోవడంతో సినిమా నిరాశ పరుస్తోంది. సెకండాఫ్‌లో విజయ్ క్యారెక్టర్ ఆర్క్ అసలు బాగాలేదు. దీనికి తోడు ఎప్పటిలానే రొటీన్ వ్యవహారాలతోనే సినిమాలో ఎక్కువ భాగం నడుస్తోంది. హీరో, హీరోయిన్ సమస్యల గురించి అంతగా ఆలోచించి, ఆమె కోసం హీరో చేసే పనులు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్‌ చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ రాజ్ తోట‌ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

మహా సముద్రం అంటూ వైజాగ్ నేపథ్యంలో నడిచే ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సాగుతూ రొటీన్ కమర్షియల్ సినిమాలా ముగుస్తుంది. శర్వానంద్ నటన, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశంలోని ఎమోషన్ బాగున్నాయి. అయితే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీయడం, బోరింగ్ ప్లే, స్లో నెరేషన్, ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version