విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: విక్రమ్, ధృవ్ విక్రమ్, సింహా, సిమ్రాన్, వాణి భోజన్, సనంత్, ముత్తుకుమార్, ఆడుకాలం నరేన్
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఎం షరీఫ్
ఎడిటర్ : వివేక్ హర్షన్
థియేటర్స్ తలుపులు తీర్చుకున్నా కరోనా మూడో వేవ్ ప్రభావంతో మరికొన్ని సినిమాలు ఓటిటి బాట పట్టడం తప్పలేదు. అలా లేటెస్ట్ గా ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యిన పెద్ద చిత్రమే “మహాన్”. కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా తన కొడుకు ధృవ్ విక్రమ్ మరో హీరోగా నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఇది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు సహా మరికొన్ని దక్షిణాది భాషల్లో ఈరోజు డిజిటల్ రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్ర ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇక కథలోకి వచ్చినట్టు అయితే మహాన్ గాంధీ(విక్రమ్) ని తన తండ్రి(ఆడుకులం నరేన్) మహాత్మా గాంధీ అంటే ఎంతో ప్రేమ కలిగిన వాడు స్వాతంత్రంలో కూడా పోరాటం చేసి గాంధీ అభ్యుదయ వాదాలు కలిగిన వాడు. ఎలాంటి మచ్చ లేకుండా తన కొడుకు గాంధీ అంత గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. అలాగే ఎదిగిన గాంధీ మహాన్ పెళ్లి సిమ్రాన్ ని పెళ్లి చేసుకొని తనకిష్టం లేని లైఫ్ నే కొనసాగిస్తాడు. కానీ ఓ రోజు తన పుట్టినరోజుకి తీసుకున్న నిర్ణయం తన జీవితంలో కీలక మార్పులు తీసుకొస్తుంది. అలా అక్కడ నుంచి తన ఫ్రెండ్ (సత్యవన్) బాబీ సింహా కలిసి ఒక గ్యాంగ్ స్టర్ గా తప్పుడు మార్గంలోనే ఎదుగుతాడు. అప్పుడు.. ఒక్కడు వస్తాడు నైరోజి(ధృవ్ విక్రమ్). దీనితో అక్కడ నుంచి మహాన్ కి ఎదురైన అసలైన సవాళ్లు ఏంటి? ఈ ఇద్దరికి ఉన్న లింక్ ఏంటి? చివరగా ఎవరు గెలుస్తారు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మొదటగా చెప్పుకోవాలి అంటే ఇది వరకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ముందు చిత్రాలతో పోలిస్తే ఇది బెటర్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఒక్కొక్కరి పాత్రని డిఫరెంట్ షేడ్స్ లో దర్శకుడు చూపించాడు. మొదటగా విక్రమ్ కోసం చెప్పుకున్నట్లయితే ఈ సినిమాలో విక్రమ్ తన రేంజ్ నటనను చూపించే సన్నివేశాలు లేవు కానీ తన సింపుల్ యాక్టింగ్ మాత్రం ఆకట్టుకుంటాడు.
అలాగే సినిమాలో మారుతున్న కాలానికి తగ్గట్టుగా తాను చూపించిన లుక్స్ లోని షేడ్స్ అయితే సాలిడ్ గా ఉంటాయని చెప్పాలి. ఇక ధృవ్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమాలో తన రోల్ ఎంట్రీ నుంచి తన పెర్ఫామెన్స్ తో సినిమాపై మరింత ఆసక్తి తెస్తాడని చెప్పాలి. ఒకింత విక్రమ్ పాత్ర కన్నా ధృవ్ పాత్ర కాస్త పవర్ ఫుల్ గా తన నటనలోని స్కోప్ ని కూడా ఈ చిత్రంలో చూపించి తన తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నాడు అనిపిస్తుంది.
తాను కూడా సాలిడ్ లుక్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటాడు. ఇక అలాగే ఇద్దరు హీరోస్ మధ్య సన్నివేశాలు కూడా మంచి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే మిగతా నటీనటులు బాబీ సింహా, సిమ్రాన్ తదితరులు తమ పాత్రలకి ది బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు, సెకండాఫ్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. యాక్షన్ సెటప్ గాని కథనం కానీ డీసెంట్ గా కొనసాగుతాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రానికి కూడా కార్తీక్ సుబ్బరాజ్ తన స్క్రీన్ ప్లే ఏమాత్రం మార్చలేదని చెప్పాలి. ఒక స్టేజ్ లో చాలా బాగుంది అనిపిస్తుంది ఇంకో స్టేజ్ లో నెమ్మదిగా ఉంది అనిపిస్తుంది. ఇలా రెండిటితో కథనం అయితే అలా నెమ్మదిగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
అలాగే సెకండాఫ్ లో ఎలిమెంట్స్ ఇంకా బాగుండడం మూలాన ఫస్ట్ హాఫ్ సోసో గానే ఉన్నట్టు అనిపిస్తుంది. వీటితో రేసింగ్ స్క్రీన్ ప్లే తో మంచి గ్యాంగ్ స్టర్ సినిమాలు కోరుకునే వారికి అయితే బోర్ కొట్టక తప్పదు. అలాగే సినిమా నిడివి కూడా వీటి మూలాన పెద్దది లానే అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి అని చెప్పాలి. సినిమాలో కనిపించే షేడ్స్ కి తగ్గట్టుగా చూపించిన సినిమాటోగ్రఫీ, సెట్స్ అన్నీ బాగున్నాయి. ఇక అలాగే సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సినిమాకి ఇంకో ప్లస్ అని చెప్పొచ్చు. ధృవ్ విక్రమ్ వచ్చాక తనకిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాలో పాటలు గాని తన పనితనం కోసం చెబుతాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చెయ్యాల్సింది. ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే..
మొదట చెప్పినట్టు గానే తన గత సినిమాలు “పేట”, “జగమే తందిరం” లను మించి అయితే ఈ “మహాన్” అనిపిస్తుంది. ఇద్దరు సరైన నటులను పెట్టుకొని ఎలాంటి కథ తీయొచ్చో ఈ సినిమాతో తాను హ్యాండిల్ చేసి చూపించాడు. అలాగే స్టెప్స్ వైజ్ సినిమాలో తాను చూపించిన వేరియేషన్స్ కానీ స్టోరీ టెల్లింగ్ గాని ఆకట్టుకుంటాయి. కాకపోతే తన స్లో నరేషన్ మాత్రం మారలేదు. ఇది తప్ప మిగతా అన్ని అంశాలు తన నుంచి ఇంప్రెస్ చేస్తాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “మహాన్”..లో విక్రమ్, ధృవ్ విక్రమ్ లాంటి హీరోస్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అనుకుంటే కార్తీక్ సుబ్బరాజ్ మంచి ఆన్సర్ ఇచ్చాడని చెప్పాలి. ఇద్దరి హీరోల తాలూకా సాలిడ్ పెర్ఫామెన్స్ లు వారి ఫ్యాన్స్ కి అయితే మంచి ట్రీట్ ని ఇస్తాయి. అదే రకంగా మూవీ లవర్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే దర్శకుడి నెమ్మదైన కథనం పక్కన పెడితే ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా ఈ డీసెంట్ గ్యాంగ్ స్టార్ డ్రామా “మహాన్” ను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team