సమీక్ష : మెయిల్ – మెప్పించే ఇంట్రెస్టింగ్ అటెంప్ట్

సమీక్ష : మెయిల్ – మెప్పించే ఇంట్రెస్టింగ్ అటెంప్ట్

Published on Jan 14, 2021 3:01 AM IST

నటీనటులు : ప్రియదర్శి, హర్షిత్ మాల్గిరెడ్డి, మణి ఏగుర్లా, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, వన్నార్న్, శ్రీకాంత్ పల్లె
దర్శకుడు: ఉదయ్ గుర్రాల
నిర్మాత: ప్రియాంక దత్, స్వప్న దత్
సినిమాటోగ్రఫీ : ఉదయ్ గుర్రాలా, శ్యామ్ దుపతి
సంగీత దర్శకుడు: స్వీకర్ అగస్తి
ఎడిటర్: హరిశంకర్ టిఎన్

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “మెయిల్”.తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో తాజా విడుదల కాబడిన ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ చిత్రం అంతా 2000 సంవత్సరం నాటి సమయంలో సెట్ చెయ్యబడింది. అప్పుడప్పుడే కంప్యూటర్ అనేది పల్లెల్లో తెలుస్తున్న సమయంలో హైబత్(ప్రియదర్శి) అనే ఓ చిన్నపాటి ఫోటోగ్రాఫర్ తన ఊరికి ఒక కంప్యూటర్ ను తీసుకొస్తాడు. దానితో అక్కడి యూత్ అతనికి అట్రాక్ట్ అవుతారు. మరి ఈ సమయంలో రావో(హర్షిత్ రెడ్డి) కంప్యూటర్ పై ఉన్న ఆత్రుతతో ఒక మెయిల్ ను చేసుకుంటాడు. కానీ ఓ రోజు దానికి అతడు 2కోట్లు గెలుచుకున్నాడని ఒక ఫేక్ మెయిల్ వస్తుంది. మరి ఇక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? లాస్ట్ కి ఎలా ముగిసింది అన్నదే అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కనిపించే ప్రతీ అంశం కూడా చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది. అలాగే ఆ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో అప్పటి వ్యత్యాసాన్ని చాలా ఇంపుగా చూపించారు. అలాగే ఈ చిత్రంలో ఓ కీలక రోల్ లో కనిపించిన హర్షిత్ రెడ్డి మంచి నటనను కనబరిచాడు. అన్ని రకాల ఎమోషన్స్ ను పలు సందర్భాలకు అనుగుణంగా చాలా బాగా పలికించాడు.

ఇక మెయిన్ లీడ్ ప్రియదర్శికి ఈ చిత్రం మరో మెట్టెక్కించేదే అని చెప్పాల్సిందే. తనకు ఇచ్చే ఎలాంటి రోల్ ను అయినా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు చాలా బ్యాలెన్సుడ్ గా చేస్తాడు. దానిని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్, హావభావాలు సింపుల్ అండ్ క్లీన్ గా అనిపిస్తాయి.

ఇక వీరి పైనే కాకుండా ఆ టైం లోని కొన్ని సన్నివేశాలను మేకర్స్ చాలా అందంగా మరపురాని దృశ్యాలతో చూపించారు. మంచి డిటైల్స్ మరియు అప్పటి వాతావరణంను ఒడిసిపట్టి మళ్ళీ మరపిస్తారు. ఇక అలాగే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కూడా హిలేరియస్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ను కూడా చాలా అందంగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

అయితే ఎంతో బాగుంది అనిపించే ఈ సినిమాలో కూడా అక్కడక్కడా లోటుపాట్లు లేకపోలేవు. కొన్ని మేజర్ గా కూడా అనిపిస్తాయి. ఇక వాటిలో అయితే మొదటిగా చెప్పాల్సింది కథనమే అని చెప్పాలి. బాగుంటుంది కానీ అలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.

ఇలా స్లో గా సాగడం అన్ని వర్గాల వారికి అంతగా నచ్చకపోవచ్చు. ఇక అలాగే ఈ చిత్రంలోని విజువల్స్ చాలా వరకు ఒక డాక్యుమెంటరీ లా అనిపిస్తుంది అది అంతగా సినిమా అనే ఫీల్ లోకి తీసుకురాకపోవచ్చు. వీటితో పాటుగా ఇందులో కనిపించే పాత్రలను మరింత ఆసక్తిగా మలచి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం :

ఇక ఈ చిత్రానికి సాంకేతిక విభాగం మేజర్ ఎస్సెట్ అని చెప్పాలి. కెమెరా వర్క్ లో కానీ ఆర్ట్ వర్క్ లో కానీ నిర్మాణ విలువలు అవుట్ స్టాండింగ్ గా ఉంటాయి. మేకర్స్ ఈ విషయంలో మంచి అవుట్ ఫుట్ ను అందించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే రచన, డైలాగులు, కాస్ట్యూమ్స్ చాలా నీట్ గా ఉంటాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు ఉదయ్ గుర్రాల విషయానికి వస్తే తాను మంచి పనితనం చూపాడని చెప్పాలి. సింపుల్ పాయింట్ నే చాలా ఎఫెక్టీవ్ గా అందంగా తీర్చిదిద్దిన విధానం చాలా మేర అందరినీ మెప్పించి తీరుతుంది. కాస్త స్లోగా తెరకెక్కించిన విధానం పక్కన పెడితే అతని ఆలోచనా సరళి, డిటైల్స్ చాలానే మెప్పించే విధంగా ఉంటాయి. ఓవరాల్ గా మాత్రం దర్శకునిగా ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “మెయిల్” ఒక కొత్త రకమైన కథను దాన్ని ఆసక్తిగా తెరకెక్కించిన విధానం ఎక్కడా చెడగొట్టకుండా డీసెంట్ నరేషన్ తో ఒకప్పటి దృశ్యాలను మళ్ళీ గుర్తు చేసి అన్ని విభాగాల్లో మంచి అవుట్ ఫుట్ ను చూపించారు. కాస్త నెమ్మదిగా సాగే కథనంను పక్కన పెడితే అన్ని రకాల ఎమోషన్స్ బాగా ఉన్న చిత్రం ఇది. అందుకోసం అయినా ఈ ఎమోషనల్ అండ్ హానెస్ట్ అటెంప్ట్ ను ఖచ్చితంగా చూడొచ్చు.

Rating: 3/5

ఆహాలో మెయిల్ మూవీ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు