సమీక్ష : మార్క్ ఆంటోనీ – పర్వాలేదనిపించే టైమ్ ట్రావెల్ డ్రామా !

సమీక్ష : మార్క్ ఆంటోనీ – పర్వాలేదనిపించే టైమ్ ట్రావెల్ డ్రామా !

Published on Sep 16, 2023 3:02 AM IST
Mark Antony Movie Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 15, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విశాల్, ఎస్.జె .సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతూ వర్మ, అభినయ, కింగ్స్లీ, వై.జి .మహేంద్రన్ మరియు తదితరులు

దర్శకుడు : ఆధిక్ రవిచంద్రన్

నిర్మాత: : ఎస్. వినోద్ కుమార్

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం

ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

తమిళ యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోని’. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

చిరంజీవి (సెల్వ రాఘవన్ ) టైమ్ ట్రావెల్ లో గతంలోకి వెళ్లే ఒక టెలిఫోన్ మెషిన్ ని కనిపెడతాడు. అసలు ఆ టెలిఫోన్ మెషిన్ ఏమిటి ?, ఆ ఫోన్ కి ఉన్న రూల్స్ ఏమిటి ?, ఆ ఫోన్ కి మార్క్ (విశాల్)- ఆంటోనీ (సీనియర్ విశాల్)ల జీవితాలకు ఉన్న సంబంధం ఏమిటి ?, మార్క్ ఆ ఫోన్ తో తన తండ్రి ఆంటోనీ ని ఎలా తిరిగి బతికించుకున్నాడు ?, ఈ మధ్యలో జాకీ (ఎస్.జె .సూర్య) పాత్ర ఏమిటి?, అలాగే మధన్ పాత్ర ఏమిటి ?, చివరకు గతంలోకి వెళ్లి పాస్ట్ ను మార్చే అవకాశం ఉన్న ఆ టెలిఫోన్ తో జరిగిన కధలు, మలుపులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఎంటర్టైనింగ్ మోడ్ లో సాగిన ఈ ఫిల్మ్ లో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అండ్ గుడ్ యాక్షన్ సీన్స్ మరియు కొన్ని బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా విశాల్ – సూర్య పాత్రలు, వాటి చిత్రీకరణ అలాగే వారి గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి. పైగా సినిమాలో టైమ్ ట్రావెల్ నావెల్టీ కూడా బాగుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా విశాల్ సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. విశాల్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్ లలో విశాల్ చాలా బాగా నటించాడు.

ఇక విలన్ పాత్రలో నటించిన ఎస్.జె .సూర్య తన నటనతోనూ మరియు తన బాడీ ఈజ్ తోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మకి పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సెల్వరాఘవన్ నటన కూడా సహజంగా ఉంది. సునీల్, అభినయ, కింగ్స్లీ, వై.జి .మహేంద్రన్ మరియు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇప్పటివరకూ టైమ్ బ్యాక్ డ్రాప్ లో చాలా చిత్రాలే చూసాం, కానీ ఈ చిత్రంలోని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మరియు కామెడీ టచ్ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ మార్క్ ఆంటోనీ కథా నేపథ్యం, అలాగే ప్రధాన పాత్రల చిత్రీకరణ, మరియు నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఇంట్రెస్ట్ కలిగించ లేకపోయారు. ముఖ్యంగా టెలిఫోన్ మెషిన్ చుట్టూ సాగే ట్రాక్ లో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికితోడు సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్ తో ప్లే సాగడంతో మార్క్ ఆంటోనీ కొన్ని చోట్ల నిరాశ పరిచాడు.

పైగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని మెయిన్ సీన్స్ కూడా మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. మొత్తమ్మీద దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ మార్క్ ఆంటోనీ ని మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా లేదు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. ఎస్. వినోద్ కుమార్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

 

తీర్పు :

 

మార్క్ ఆంటోనీ అంటూ వచ్చిన ఈ టైమ్ ట్రావెల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో.. స్టైలిష్ మేకింగ్, కొన్ని ఫన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే విశాల్ – ఎస్.జె .సూర్య నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్, రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ మార్క్ ఆంటోనీ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతుంది.

 

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు