విడుదల తేదీ : సెప్టెంబర్ 24, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: తనీష్,ముస్కాన్ సేథీ, భాను శ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర
దర్శకుడు: జాని
నిర్మాతలు: మిర్త్ మీడియా
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
ఎడిటర్: క్రాంతి (ఆర్కే)
తనీష్ హీరోగా నటించిన కొత్త సినిమా మహాప్రస్థానం. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించాడు. ముస్కాన్ సేథీ నాయికగా నటించింది. మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించింది. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
శివ (తనీష్) ఒక క్రిమినల్. రాణే భాయ్ (కబీర్ సింగ్ దుహాన్) అనే గ్యాంగ్ లీడర్ కి రైట్ హ్యాండ్ గా ఉంటూ అనేక క్రైమ్స్ చేస్తాడు. అయతే, శివ నైనితో (అర్చనా ఖన్నా) ప్రేమలో పడి, నైనిని పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ వదిలేసి.. తన భార్యతో గోవాలో సెటిల్ అవుదామని శివ ప్లాన్ చేసుకుంటాడు. అందుకు గోవా వెళ్లి అన్ని సెట్ చేసుకుని వచ్చే సరికి అతని జీవితం మారిపోతుంది. ఓ డెడ్ బాడీ చూసిన దగ్గర నుంచి అతనిలో మార్పు వస్తోంది. ఇక అప్పటి నుంచి తన గ్యాంగ్ సీక్రెట్స్ లీక్ చేస్తూ.. ఆ క్రమంలో తన గ్యాంగ్ లోని వ్యక్తులనే చంపేస్తూ ఉంటాడు. అసలు శివలో మార్పు రావడానికి కారణం ఏమిటి ? తన గ్యాంగ్ ప్లాన్ చేసిన బ్లాస్ట్ లను శివ ఎలా ఆపాడు ? ఈ మధ్యలో జర్నలిస్ట్ సమీర (భాను శ్రీ మెహ్రా)కి ఈ గ్యాంగ్ కి మధ్య సంబంధం ఏమిటి ? చివరకు శివ అనుకున్నది సాధించాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో మెయిన్ ఎమోషన్, అండ్ కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. శివ పాత్రలో తనీష్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా మారిపోయిన ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ కు తనీష్ పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ ముస్కాన్ సేథి తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. అలాగే నైని పాత్రలో అర్చనా సింగ్ ఓకే అనిపించింది. అలాగే రాణె భాయ్ గా కబీర్ సింగ్ దుహాన్ సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు.
అలాగే మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్రలను అలాగే హీరోలోని రెండు విభిన్న సంఘర్షణలను దర్శకుడు బాగా మలిచాడు. క్రైమ్ నేపథ్యంలోని నేరాలను ఘోరాలను దర్శకుడు బాగా ఎఫెక్టివ్ గా చూపించాడు. ఇక సింగిల్ షాట్ లో చిత్రాన్ని కొత్తగా తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్:
ఈ మూవీలో సస్పెన్సు చివరివరకు దర్శకుడు కొనసాగించినప్పటికీ, సన్నివేశాలను దర్శకుడు తెర పై ఆవిష్కరించిన విధానం మాత్రం ఆకట్టుకోదు. అయితే ఈ చిత్రానికి ప్రధాన బలం సెకండ్ హాఫ్, మొదటి సగం సో సో గానే నడుస్తోంది. పైగా కీలక సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి.
ఇక సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో.. కానీ దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాను మలచలేకపోయింది. దానికి తోడు సీరియస్ గా సాగే ఈ సినిమాలో కథనం కూడా బాగలేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడంలో కొంత వరకు విజయం సాధించినా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు. ఐతే రెగ్యులర్ రివేంజ్ డ్రామాను విభిన్నమైన రీతిలో చెప్పడం జరిగింది. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని డైలాగ్ లు సందర్భానుసారంగా చక్కగా పేలాయి. ఇక కెమెరా పనితనం బాగుంది. అలాగే కీలక సన్నివేశాలలో మ్యూజిక్ డైరెక్టర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. ఇక నిర్మాణ విలువ పర్వాలేదు.
తీర్పు:
ఈ మరో ప్రస్థానం మేకింగ్ పరంగా ఇన్నోవేటివ్ ప్రయత్నంతో తెరకెక్కింది. ఇక సినిమాలో అక్కడక్కడా ఆకట్టుకునే రివేంజ్ డ్రామా ఉన్నప్పటికీ.. స్లోగా సాగే స్క్రీన్ ప్లే, అండ్ బోర్ కొట్టించే ఓవర్ సినిమాటిక్ డ్రామా బాగాలేదు. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలను తెర పై ఆవిష్కరించిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, తనీష్ నటన, కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా క్రైమ్ అండ్ సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని ఓ సారి చూడొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team
Click Here For English Version