విడుదల తేదీ : జూలై 21, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : గోవింద్ లాలం
నిర్మాత : కె.వి. హరికృష్
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : దిలీప్ కుమార్, ఇషా
ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన చాలా హర్రర్ సినిమాలు ప్రేక్షకులని భాగా ఆకట్టుకొని కలక్షన్స్ వర్షం కురిపించాయి. తక్కువ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాలు హిట్ అయితే నిర్మాతకి లాభాలు తెచ్చిపెడతాయి. అలా తెలుగులో హర్రర్ జోనర్ లో వచ్చిన మరో లో బడ్జెట్ సినిమా మాయామాల్. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎ మేరకు ఆకట్టుకుంది అనే విషయం తెలుసుకుందాం.
కథ :
దిలీప్(దిలీప్ కుమార్), మైత్రి(ఇషా) లవర్స్. అయితే వాళ్ళ పెళ్ళికి మైత్రి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్ళిచేసుకోవాలని అనుకుంటారు. ఆ క్రమంలో పారిపోయి సిటీ లో ఓ షాపింగ్ మాల్ కి చేరుకుంటారు. అయితే అనుకోకుండా ఆ మాల్ లో ఇద్దరు చిక్కుకుంటారు. ఆ క్రమంలో వారిలాగే మాల్ లో షాపింగ్ మాల్ లో చిక్కుకున్న శంకర్(షకలక శంకర్), కిడ్నాప్ కి గురై స్టోర్ రూమ్ లో బందీగా ఉన్న రమ్య(దీక్ష సేథ్), షాపింగ్ మాల్ లో పని చేసే తాగుబోతు రమేష్ అందరు లోపల ఉండిపోతారు. అయితే అనుకోకుండా ఆ రాత్రి షాపింగ్ మాల్ లో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదే సమయంలో రమ్య ఫ్రెండ్ సౌమ్య(సోనియా) చనిపోయి కనిపిస్తుంది. దీంతో వాళ్ళందరు అక్కడ ఎదో ఉందని భయంతో షాపింగ్ మాల్ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇంతకి షాపింగ్ మాల్ లో నిజంగానే దెయ్యం ఉందా? వాళ్ళు షాపింగ్ మాల్ లో చిక్కుకోవడానికి కారణం ఏమిటి? సోనియా చావుకి ఆ షాపింగ్ మాల్ కి సంబంధం ఏమిటి? అనేది మాయామాల్ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా లో ప్లస్ గురించి చెప్పాలంటే ముందుగా సినిమా మొత్తం ఒక రాత్రి వ్యవధిలో జరిగే కథ కావడం. అలాగే లాస్ట్ వరకు షాపింగ్ మాల్ లో గోస్ట్ ఉందని అందరు అనుకుంటారు అయితే క్లైమాక్స్ తో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు గోవింద్ లాలం ప్రేక్షకులని థ్రిల్ చేసే ప్రయత్నం చేసాడు.
ఇక నటీనటుల సంగతి చూసుకుంటే తెలుగమ్మాయి ఇషా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. హీరోగా దిలీప్ గా మొదటి చిత్రం అయిన ఉన్నంతలో భాగానే చేసాడు. ఇక. షకలక శంకర్, తాగుబోతు రమేష్ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసారు. ఇకే దీక్షా పంత్, హ్యాపీ డేస్ ఫేం సోనియా గత సినిమాలతో పోల్చుకుంటే అందంగా కనిపించి మెప్పించింది. ఇక మిగిలిన పాత్రలు కూడా ఎవరి పరిధి మేరకు వారు భాగానే చేసారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ముందుగా సినిమాకి బలమైన కథ లేకపోవడం పెద్ద మైనస్, ఇప్పటి వరకు వచ్చిన రొటీన్ హర్రర్ సినిమాల తరహాలోనే ఇది కూడా ఉంటుంది. ఇక కథని నడిపించడం కోసం దర్శకుడు ఎసుకున్న సన్నివేశాలలో అన్ని కావాలని ఒకదానికి ఒకటి అల్లినట్లు ఉంటాయి తప్ప. ఎక్కడ నిజంగా జరుగుతున్నా ఫీలింగ్ కనిపించదు. అలాగే రెగ్యులర్ హరర్ర్ సినిమాల్లో ఫాలో అయినట్లే ఇందులో కూడా హరర్ర్ కామెడీ పేరుతో పిచ్చి పిచ్చి అరుపులు, దెయ్యం కేకలతో మొత్తం నడిపించారు. ఇక అసలు షాపింగ్ మాల్ లో ఉండి కూడా లైట్స్ వేసుకునే అవకాశం ఉండి కూడా అన్ని పాత్రలు చీకటిలో ఎదో భూత్ బంగ్లాలో ఉన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. ఇలా అన్ని కూడా ఊహాజనితంగా, అసలు ఎ మాత్రం పస లేకుండా సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి.
సాంకేతిక విభాగం :
సినిమా మొత్తం షాపింగ్ మాల్ లో అది ఒక ఎక్కువ భాగం చీకటిలో కథ నడవడం ఎక్కడ బడ్జెట్ అయితే కనిపించదు. ఇక దర్శకుడుగా గోవింద్ లాలం ఎ విభాగంలో కూడా మెప్పించలేకపోయాడు. సినిమాకి ఒకే ఒక పాత ఉంటుంది. అది కాస్తా ఆకట్టుకుంది. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒకే అనిపించుకుంటుంది. ఇక సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్నంత లో పాతలో కాస్తా నేచర్ బ్యూటీని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక ఎడిటింగ్ పర్వాలేదు అనిపించుకుంది. మొత్తం సన్నివేశాలు అన్ని రొటీన్ గా ఉండి నిడివి తక్కువ ఉన్నప్పుడు అందులో ఇంకా కత్తెరకి పనిచేప్పే అవకాశం ఉండదు.
తీర్పు :
తెలుగులో వచ్చిన రొటీన్ హర్రర్ సినిమాల దారిలో వచ్చిన ఈ సినిమా కూడా అన్ని సినిమాల మాదిరి ఎలాంటి కొత్తదనం లేకుండా హర్రర్ మూసలో కొట్టుకుపోయింది. ఇక నటీనటుల విషయంకి వస్తే వాళ్ళ పరిధి మేరకు అందరు భాగానే చేసారు. కాకపోతే సినిమాలో విషయం లేనపుడు వారు మాత్రం చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ మాయామాల్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఓవరాల్ మాయామాల్ లో అక్కడక్కడ మెరుపులు తప్ప ఎక్కడ ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team