విడుదల తేదీ : నవంబర్ 25, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: అశ్విన్ కుమార్, వర్ష బొల్లమ్మ, శ్రీ విద్యా పి, సమీర్ మల్ల, సత్యరాజ్, రుహాని శర్మ, రాజా చెంబోలు, రోహిణి, ఆకాంక్ష సింగ్, సురేఖా వాణి, ధీక్షిత్ శెట్టి, శ్రీప్రియ ఇదూరి, అదా శర్మ, అలేఖ్య హారిక, శివ కందుకూరి, సంచి పూనాచా, సునైనా , గోవింద్ పద్మసూర్య, కివిష్, కళ్యాణి నటరాజన్, డిడి శ్రీనివాస్
దర్శకుడు : దీప్తి గంటా
నిర్మాతలు: గంటా నవీన్ బాబు, ప్రశాంతి తిపిర్నేని
సంగీత దర్శకులు: విజయ్ బల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎ.వసంత్
ఎడిటర్: గ్యారీ బి హెచ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
రీసెంట్ గా ఓటిటి లో రానున్న ఓ బ్యూటిఫుల్ కంటెంట్ గా మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “మీట్ క్యూట్”. టీజర్ మరియు ట్రైలర్ లతో ఆసక్తి రేపిన ఈ సిరీస్ నాచురల్ స్టార్ నాని సమర్పణలో తన సోదరి దీప్తి గంట దర్శకత్వంలో అయితే తెరకెక్కిన ఈ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే.. ఈ సిరీస్ లో ఒకో ఎపిసోడ్ లో పలు పాత్రలు మరియు వారి మధ్య కథలు కనిపిస్తాయి. మొదటగా ‘మీట్ ది బాయ్’ అనే ఎపిసోడ్ లో యువ నటి వర్ష బొల్లమ్మ పాత్ర కనిపిస్తుంది. ఆమె ఓ స్ట్రేంజర్ ని కలవడం వారి కలయిక ఎక్కడికి వెళ్ళింది దాని స్టోరీ ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే దానిలో రుహాణి శర్మ, నటుడు సత్యరాజ్ ల పాత్రలు వారి మధ్య కథ ఏంటి, వారు ఎందుకు కలుస్తారు అనేది ఉంటుంది. అలాగే తర్వాత ఓ తల్లి(రోహిణి) తన కొడుకు గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఏం చేస్తుంది. ఈ కథ ఎటువంటి ఎమోషన్స్ తో ఉంటుంది అనేది తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ కథలో సినిమాల్లో ఓ పెద్ద స్టార్ ని ఓ డాక్టర్ కలవడం ఇది ఆదా శర్మ మరియు శివ కందుకూరి మధ్యలో కనిపిస్తుంది. ఇక చివరిగా అయితే తన భర్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అయ్యే ఓ భార్య కథగా ఇది సునైనా మరియు సంచిత పూనాచా ల మధ్య కనిపిస్తుంది. మరి వీరంతా ఎందుకు ఎలా మీట్ అయ్యారు? దీని వెనుక ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని సోని లివ్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సిరీస్ కి సంబంధించి టీజర్ మరియు ట్రైలర్ లు చూసినప్పుడే మంచి ప్రామిసింగ్ గా అనిపించాయి. మరి అదే ప్రామిసింగ్ నరేషన్ అయితే ఈ సిరీస్ లో వీక్షకులకు డెఫినెట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా ఒకరికి ఒకరు పరిచయం లేని వారు కలిస్తే వారి మధ్య మాటలు ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేవి బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. చాలా చక్కటి నరేషన్ లో అయితే తన మొదటి అటెంప్ట్ లోనే దీప్తి గంట సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
అలాగే ప్రతి కథలో చూపించిన అన్ని ఎమోషన్స్ సహా వాటికి ఇచ్చిన ముగింపులు అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. డెఫినెట్ గా అయితే దీప్తి గంట నుంచి మరిన్ని ఈ తరహా కొత్త అటెంప్ట్ లను మనం ఆశించవచ్చు. ఇక ఈ సిరీస్ లో మరో పెద్ద హైలైట్ ఏమన్నా ఉంది అంటే అది క్లీన్ గా ఓ మెలోడ్రామా లా సాగే ఇంట్రెస్టింగ్ నరేషన్ అని చెప్పొచ్చు. ఆల్ మోస్ట్ ఏ ఎపిసోడ్ లో కూడా ఇది మిస్ కాలేదు.
మంచి ఫన్, ఎమోషన్స్, అద్భుతమైన డ్రామా ప్రతి కథలో ఒక నేర్పు అనేవి కనిపిస్తాయి. మరి ఈ అన్ని ఎపిసోడ్స్ లో అందరికీ బాగా టచింగ్ గా అనిపించేది నటి రోహిణి మరియు ఆకాంక్ష సింగ్ ల లవ్(లా) ఎపిసోడ్ అని చెప్పాలి. తన కొడుకు పెళ్లి విషయంలో తల్లి ఏం చేస్తుంది ఈ ఎపిసోడ్ లో తన కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఆకాంక్ష మధ్య కన్వర్జేషన్ వారి నటన తీరు సాలిడ్ గా కనిపిస్తాయి.
అలాగే ఇతర నటీనటులు వర్ష బొల్లమ్మ, అదా శర్మ, శివ కందుకూరి మంచి నటన కనబరిచి ఎమోషనల్ గా ఆకట్టుకుంటారు. అలాగే రుహాణి శర్మ, వెర్సటైల్ నటుడు సత్య రాజ్ ల ఎపిసోడ్ కూడా మంచి ఆసక్తిగా అంతకు మించి అర్ధవంతంగా కూడా అనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఎపిసోడ్ సునైనా పై చూపించేది అందులోని ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి.
ఇలా ఓవరాల్ గా అయితే ఈ అంథాలజీ సిరీస్ చాలా కాలం తర్వాత ఓ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ ని చూసే వీక్షకులకు అందిస్తుంది. చాలా క్లీన్ నరేషన్ తో హత్తుకునే డైలాగ్స్ తో ఎక్కడా కూడా అతిగా అనిపించకుండా చాలా నీట్ గా ఈ సిరీస్ అయితే కొనసాగుతుంది. మన తెలుగు నుంచి ఈ తరహా ఓ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ అటెంప్ట్ రావడం మంచి విషయం అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ఈ సిరీస్ లో అందరికీ అని చెప్పలేం కానీ ఓటిటి కోసం ఈ సిరీస్ ని తెరకెక్కించడం వలనో ఏమో కానీ చాలా వరకు మాటలు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఇది అందరికీ వెంటనే అర్ధం కాకపోవచ్చు. అలాగే ఆల్ మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ బాగానే అనిపిస్తాయి కానీ స్టార్ స్ట్రక్ అనే ఎపిసోడ్ మాత్రం ఎందుకో మిగతా వాటితో పోలిస్తే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు.
ఈ ఒక ఎపిసోడ్ లో మాత్రం కాస్త లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. ఇంకా ఈ తరహా సిరీస్ లలో అంటే అక్కడక్కడా స్లో నరేషన్ తప్పనిసరి వీటి మూలాన కొద్దిగా బోర్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. అలాగే కేవలం ఎంటెర్టైనెంట్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సాంకేతిక వర్గం :
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు డెఫినెట్ గా ఉన్నతంగా ఉన్నాయని చెప్పాలి. ఈ సిరీస్ నేపథ్యం కోసం క్రియేట్ చేసిన ప్రతీ సెటప్ అలాగే ఆ అట్మాస్పియర్ లో నిర్మాణ విలువలు కనిపిస్తాయి. అలాగే టెక్నికల్ టీం లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ వర్క్ లు ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరి టీం వర్క్ కూడా ఈ సిరీస్ సక్సెస్ కి దోహదపడ్డాయి.
ఇక దర్శకత్వం విషయానికి వస్తే మొదట చెప్పినట్టుగానే తన డెబ్యూట్ అయినా కూడా దీప్తి గంట ఇచ్చిన ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి పాత్రకి ఇచ్చిన డిటైలింగ్ వాటి ఎమోషన్స్ ని ఆవిష్కరించిన విధానం ఆమెలోని పర్ఫెక్ట్ డైరెక్టర్ ని ప్రతిబింబించేలా చేసాయి. తన నరేషన్ లో సహజత్వమే డైరెక్టర్ గా ఆమెని మంచి స్థాయికి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. డెఫినెట్ గా ముందు రోజుల్లో దీప్తి నుంచి మరిన్ని మంచి ఆవిష్కరణలు వస్తాయని తప్పకుండా మనం చూడొచ్చు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మీట్ క్యూట్” ఆంథాలజీ సిరీస్ టైటిల్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తూ ఓ ఫ్రెష్ నరేషన్ తో బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో ఓటిటి ఆడియెన్స్ ని మెప్పించి తీరుతుంది. మెయిన్ గా దర్శకురాలు దీప్తి గంటా ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ అందులోని తన మొదటి ప్రాజెక్ట్ తోనే తన ప్రతిభను కనబర్చడం చాలా హర్షణీయం. అనేకమంది నటీనటులను సమర్ధవంతంగా డీల్ చేసి సూపర్బ్ అవుట్ పుట్ ని రాబట్టడం చిన్న విషయమేమి కాదు దీనితో అయితే ఈ సిరీస్ డెఫినెట్ గా మంచి ట్రీట్ ని ఇస్తూ ఓటిటి లో తప్పకుండా ఈ సిరీస్ ని వీక్షించి ఎంజాయ్ చెయ్యవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team