సమీక్ష: మిన్నల్ మురళి – నెట్ ఫ్లిక్స్ లో మలయాళ చిత్రం

123telugu.com Rating : 3.25/5

తారాగణం : తోవినో థామస్, గురు సోమ సుందరం

దర్శకుడు : బాసిల్ జోసెఫ్

నిర్మాత : సోఫియా పాల్

సంగీత దర్శకుడు : సుశిన్ శ్యామ్

సినిమాటోగ్రఫి : సమీర్ తాహిర్

ఎడిటర్: లివింగ్స్టన్ మాథ్యూ

ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుకున్న మలయాళ చిత్రాలలో మిన్నల్ మురళి ఒకటి. తోవినో థామస్ నటించిన సూపర్ హీరో చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది, అది ఎలా ఉందో చూద్దాం.

 

కథ:

మిన్నల్ మురళి చిత్రం 80వ దశకం చివరి నాటి కేరళ లోని ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగుతుంది. జైసన్ (తోవినో థామస్) బిన్సీతో ప్రేమలో ఉన్న ఒక టైలర్. కానీ ఆమె అతనిని ధనవంతుడి కోసం వదిలిపెట్టి తోవినో గుండె పగిలేలా చేస్తుంది. మరోవైపు, శిబు (గురు సోమ సుందరం) ఒక టీ దుకాణంలో పనిచేస్తాడు. మరియు ఒకప్పుడు తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయిన ఉష పట్ల ఇప్పటికీ భావాలను కలిగి ఉంటాడు. ఒక రోజు, లైటింగ్ గ్రామాన్ని తాకింది, జైసన్ మరియు శిబు ఇద్దరినీ ఈ లైటింగ్ తాకింది. ఈ ఇద్దరు మనుష్యులు సూపర్ పవర్‌లను పొందుతారు కానీ జైసన్ వాటిని మంచి కోసం ఉపయోగించుకుంటాడు. శిబు జైసన్ వేరే కొరకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్య ముఖా ముఖి ఎలా జరిగింది ఏం జరిగింది అనేది కథ.

 

ప్లస్ పాయింట్స్:

మిన్నల్ మురళి లో బెస్ట్ పార్ట్ ఏమిటంటే, హీరో మరియు విలన్‌కు సూపర్ పవర్స్ ఇచ్చిన విధానం. ఈ శక్తులు మరియు లుంగీలో సూపర్ హీరో కార్ల మీద పరిగెత్తడం, చెడ్డ వ్యక్తిని కొట్టడం, పల్లెటూరి ప్రజలను రక్షించడం చాలా అరుదు. ఇవి చాలా ఆకట్టుకుంటాయి.

ఈ సినిమా లో ప్రధాన పాత్ర, తోవినో థామస్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. సూపర్ పవర్స్ కలిగి ఉన్న ఒక సాధారణ వ్యక్తి యొక్క పరివర్తనను సినిమా లో అందంగా చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే, జైసన్ పాత్ర లోపల ఏం జరుగుతోందో తోవినో చాలా చక్కగా బయటికి తీసుకొచ్చాడు. సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి.

ఈ సినిమా లో బ్యాక్‌డ్రాప్, స్క్రీన్‌ప్లే, సూపర్‌హీరో యాంగిల్‌ని సరైన లాజిక్‌తో తీసుకొచ్చిన విధానం ఈ సినిమాను చాలా సెన్సిబుల్‌గా మార్చాయి అని చెప్పాలి. నకిలీ మిన్నల్ మురళి పాత్రలో గురు సోమ సుందరం కూడా అద్భుతంగా నటించాడు. క్యారెక్టర్‌ లో తన స్వార్థాన్ని బయటపెట్టిన విధానం బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

కొన్ని సార్లు సినిమా లో స్క్రీన్ ప్లే సరిగ్గా సాగదు. జైసన్ తన తండ్రిని గుర్తు పట్టే విధానం మరియు సన్నివేశాలను ప్రదర్శించిన విధానం బలవంతంగా కనిపించి సరైన భావోద్వేగాలను తీసుకురాలేదు అని చెప్పాలి.

కొన్ని చోట్ల VFX మెరుగ్గా ఉంటే బావుండేది అని అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ కి వచ్చే సమయానికి ఏం జరుగుతుంది అనేది కొంచెం ఊహించే విధంగా ఉంటుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు కాస్త నిడివి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

 

సాంకేతిక విభాగం:

మలయాళ సినిమాలు సాంకేతిక అంశాలకు ప్రసిద్ధి చెందాయి. అందులో మిన్నల్ మురళి భిన్నమైనది కాదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, కథనంలో వాటిని అమర్చిన విధానం బాగున్నాయి. ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని అందించిన సమీర్ తాహిర్ అద్భుతమైన కెమెరా వర్క్ ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. డైలాగ్స్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా ఆకట్టుకున్నాయి.

దర్శకుడు బాసిల్ జోసెఫ్ విషయానికి వస్తే, ఒక చిన్న పల్లెటూరిలో సెట్ చేసి సూపర్ హీరో సినిమాని తీసిన పూర్తి క్రెడిట్ అతనికి దక్కుతుంది. అతను పెర్ఫార్మెన్స్ ను ఎక్స్‌ట్రాక్ట్ చేసిన విధానం మరియు హీరో కి విలన్ కి మధ్య ఘర్షణను ఆవిష్కరించిన విధానం చాలా బాగుంది.

 

తీర్పు:

మొత్తం మీద, మిన్నల్ మురళి చిత్రం యాక్షన్, డ్రామా మరియు కామెడీ యొక్క సరైన మోతాదులో బాగా రూపొందించబడిన సూపర్ హీరో చిత్రం. తోవినో థామస్ మరియు గురు సోమసుందరన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. స్లో పేస్ మినహా, ఈ చిత్రం లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు కలిగి ఉన్నాయి. ఈ వారం మంచి OTT వాచ్‌గా ముగుస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version