సమీక్ష : “మిషన్ ఇంపాజిబుల్” – ఓకే అనిపించే కామెడీ థ్రిల్లర్ డ్రామా

సమీక్ష : “మిషన్ ఇంపాజిబుల్” – ఓకే అనిపించే కామెడీ థ్రిల్లర్ డ్రామా

Published on Apr 2, 2022 3:04 AM IST
Mishan Impossible Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 01, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు మరియు తదితరులు

దర్శకత్వం : స్వరూప్ RSJ

నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా

ఎడిటర్ : రవితేజ గిరిజాల

డీసెంట్ బజ్ నడుమ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా “మిషన్ ఇంపాజిబుల్”. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె తెరకెక్కించిన ఈ సినిమాలో తాప్సి ప్రముఖ పాత్రలో నటించింది. మరి మంచి థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వెళ్లినట్టు అయితే ఈ సినిమా అంతా తిరుపతికి చెందిన చిన్న ఊరులో కనిపిస్తుంది. అక్కడ రగుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిన్న కుర్రాళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతూ లైఫ్ లో సింపుల్ పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు. అలా పేరు మోసిన గ్యాంగ్ స్టర్ దావుద్ ఇబ్రహీం ని పట్టుకునే భారీ రివార్డ్ ఇస్తారని విని పట్టుకోడానికి ఏది ఆలోచించకుండా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? వారి పరిస్థితి ఎలా మారింది? ఇక మరో పక్క ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్(తాప్సి) పాత్ర ఏమిటి? లాస్ట్ కి ఆ పిల్లలు ఏమవుతారు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ముఖ్యంగా ఈ సినిమాలో కనిపించే నేపథ్యం ఒకింత ఆసక్తిగా అనిపిస్తుంది. ముగ్గురు చిన్న పిల్లలు తమకి తెలియకుండానే ఒక రిస్క్ లోకి పడడం అనేది సహజంగా తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. అలాగే ఈ పాత్రల్లో ఆ ముగ్గురు కుర్రాళ్ళు కూడా మంచి పెర్ఫామెన్స్ ని కనిపించారు.

ముగ్గురు కూడా చాలా కాన్ఫిడెంట్ నటనని కనబరచడమే కాకుండా వారి చుట్టూ జెనరేట్ అయ్యే ఫన్ మంచి నవ్వులు పూయిస్తుంది. అలాగే వారిపై కనిపించే ఎమోషన్స్ కూడా బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో మరో మెయిన్ లీడ్ గా కనిపించే తాప్సి తన రోల్ ని మంచి ఈజ్ గా చేసింది.

మరీ అంత ఇంపార్టెన్స్ కనిపించకపోవచ్చు కానీ తన రో వరకు మాత్రం ఆమె తన బెస్ట్ ని ఇచ్చింది. అలాగే సినిమాలో కనిపించే కొన్ని ఎపిసోడ్ మంచి థ్రిల్ ని అందిస్తాయి. ఇవి అక్కడక్కడా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

తన గత సినిమాలో ఎంతైతే లాజిక్స్ పరంగా కానీ ఇతర చిన్న చిన్న జాగ్రత్తల్లో దర్శకుడు కేర్ తీసుకున్నాడో ఈ సినిమాలో అవి మిస్ చెయ్యడం గమనార్హం. చాలా వరకు సన్నివేశాల్లో ఈ లాజిక్స్ మిస్సయ్యాయి.

ఆ పిల్లలు దావుద్ ని పట్టుకుందామని ఓ ప్రాంతానికి వెళ్లడం ఆ చుట్టూ జరిగే ప్రక్రియ అంతా ఎక్కడా పొంతన లేకుండా సిల్లీ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో అయితే నరేషన్ మరీ ఓవర్ బిల్డప్ గా చూపినట్టు అనిపిస్తుంది.

అలాగే తాప్సి రోల్ ని కూడా ముందు కొంచెం బాగానే మంచి స్ట్రాంగ్ గా చూపించినా తర్వాత ఆమె పాత్ర నామ మాత్రంగానే మిగిలినట్టు అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమా అంతా కూడా ఏమంత మరీ ఎంగేజింగ్ గా అనిపించకుండా ఉంటుంది. ఆ పిల్లలు వారి పాత్రలను సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఇంకా బాగా డిజైన్ చెయ్యాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు గాని టెక్నికల్ టీం వర్క్ గాని డీసెంట్ గా ఉందని చెప్పాలి. సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. అలాగే దీపక్ ఎరగర సినిమాటోగ్రఫీ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా సహజంగా ఉంది. అలాగే ఎడిటింగ్ పర్వాలేదు, డైలాగ్స్ బావున్నాయి.

ఇక దర్శకుడు స్వరూప్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా తన ఫస్ట్ సినిమాలో చూపించిన మ్యాజిక్ అయితే ఈ సినిమా అంత బలంగా కనిపించదు. తాను ఎంచుకున్న నేపథ్యం నడిపించిన కథనం డీసెంట్ గానే అనిపిస్తాయి కానీ ముందు లాజిక్స్ తో అంత మంచి సినిమా తీసిన తన నుంచి ఇందులో అవి మిస్ చెయ్యడం ఒకింత డిజప్పాయింట్ గా ఉంటుంది.

అలా అని ఈ సినిమా విషయంలో తన వర్క్ మరీ తక్కువ చెయ్యడానికి లేదు. ఇందులో కూడా తన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాకపోతే మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే డెఫినెట్ గా మరింత మంచి ట్రీట్ ఆడియెన్స్ కి ఇచ్చి ఉండేవాడు. ఇది మినహా తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మిషన్ ఇంపాజిబుల్” లో అక్కడక్కడా మంచి కామెడీ మరియు పలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. కాకపోతే దర్శకుడు మిస్ చేసిన కొన్ని లాజికల్ ఎర్రర్స్ మాత్రం తన గత సినిమాతో పోల్చి చూస్తే కాస్త నిరాశ పరచొచ్చు. ఇది పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ చిత్రం డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు