ఓటీటీ రివ్యూ : ‘మిస్ ఇండియా’ – స్లోగా సాగే బిజినెస్ డ్రామా !

Miss India Telugu Movie Review

విడుదల తేదీ  : November 4,2020

123telugu.com Rating : 2.25/5

తారాగణం : కీర్తి సురేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ

రచన : నరేంద్రనాథ్‌

సంగీతం : థమన్

ఎడిటర్ : తమ్మిరాజు

దర్శకత్వం : నరేంద్రనాథ్‌

నిర్మాత : మహేష్ కోనేరు

 

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథ :

మానసా సంయుక్త (కీర్తి సురేష్) ఒక సాదారణమైన మద్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అయినా చిన్నప్పటి నుండి బిజినెస్ చేయాలని కల కంటోంది. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల ఆమె ఫ్యామిలీ అమెరికా వెళ్తారు. అయితే సంయుక్త కలలు చాలా ఉన్నతంగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు అమెరికాలో ఆమె మిస్ ఇండియా అనే చాయ్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తోంది. కానీ, అక్కడ కాఫీ బిజినెస్ పెట్టి బిజినెస్ ను రూల్ చేస్తోన్న కైలాష్ (జగపతిబాబు) లాంటి ప్రత్యర్థులను తట్టుకుని ఆమె ఎలా నిలబడింది ? చివరకు నిలబడి విజేతగా ఎలా నిలిచింది ? మొత్తంగా ఒక మద్య తరగతి అమ్మాయి ఛాలెంజిగ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఒక హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసేటప్పుడు మరింత పర్‌ఫెక్షన్‌తో పని చేయాలి. ఆ విషయంలో ఎంతో తపన ఉండాలి. కీర్తి సురేష్ అంతే తపనతో ఈ సినిమా చేసింది. నటిగా సినిమా సినిమాకి తనను తానూ ఎక్స్‌ప్లోర్‌ చేసుకుంటూ ముందుకుపోతోంది. పైగా ‘మిస్‌ ఇండియా’లో తన పాత్ర కోసం కీర్తి సురేష్ స్లిమ్‌ అయింది. ఆమె కొన్ని సన్నివేశాల్లో కొత్తగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ నరేష్, అన్నగా కమల్ కామరాజు నటించారు.

రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకపాత్ర అయిన తాతయ్య పాత్రలో నటించి మెప్పించారు. అలాగే నవీన్ చంద్ర, జగపతిబాబులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక బిజినెస్ చేయాలనుకునే అమ్మాయికి తన ఇంట్లో నుంచే వ్యతిరేకత మొదలవడం.. అన్నిటినీ ఎదిరించి ఒక అమ్మాయి వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ కావడం లాంటి కొన్ని సీన్స్ బాగున్నాయి. ఛాయ్ బిజినెస్‌ను ప్రారంభించిన కీర్తి.. ప్రత్యర్థిగా స్టైలిష్ బిజినెస్‌మెన్‌ జగపతిబాబును ఎలా ఓడించింది అనేది బాగానే ఉంది.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి రొటీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. ఎక్కడా మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దర్శకుడు నరేంద్రనాధ్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరీ బోర్ గా అనిపిస్తాయి.

ఇక సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. నిజానికి సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ల్యాగ్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో సీన్స్ బోర్ గా సాగాయి. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే.. సినిమాని విజువల్ గా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం పర్వాలేదు. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటర్ తమ్మిరాజు స్లో ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ల్యాగ్ సీన్స్ ను ఎడిట్ చేయకుండా వదిలేసి.. సినిమాలో బోర్ ను ఇంకా పెంచారు. సినిమాలోని నిర్మాత మహేశ్‌ కొనేరు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ముఖ్యంగా కథానుగుణంగా ఆయన సినిమాను చాలా రిచ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో నిర్మించారు.

 

తీర్పు :

మిస్ ఇండియా’ అంటూ మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తో మరియు కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, అలాగే మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఆ కారణంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించరు.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version