సమీక్ష : “మిషన్ ఇంపాజిబుల్ 7” – థ్రిల్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్

Mission Impossible Dead Reckoning Part One Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: టామ్ క్రూయిజ్, హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, రెబెక్కా ఫెర్గూసన్, ఇసై మోరల్స్, వెనెస్సా కిర్బీ, పోమ్ క్లెమెంటీఫ్ మరియు హెన్రీ క్జెర్నీ

దర్శకుడు : క్రిస్టోఫర్ మెక్‌క్వారీ

నిర్మాతలు: టామ్ క్రూజ్ మరియు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ

సంగీతం: లోర్న్ బాల్ఫ్

సినిమాటోగ్రఫీ: ఫ్రేజర్ టాగర్ట్

ఎడిటర్ : ఎడ్డీ హామిల్టన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “మిషన్ ఇంపాజిబుల్ 7″(డెడ్ రెకోనింగ్ పార్ట్ 1) అయితే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది. మరి ఇండియాలో కూడా సెన్సేషనల్ బుకింగ్ ఓపెన్ చేసిన ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ ని ఇప్పుడు హిట్ చేసింది. మరి హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ లోకి వస్తే..ఏజెంట్ ఈతన్ హంట్(టామ్ క్రూయిజ్) తన పాత ఫ్రెండ్ ఇల్సా ఫాస్ట్(రెబెకా ఫెర్గుసన్) నుంచి ఓ పవర్ ఫుల్ కీ ని సంపాదించడానికి తమ ఐఎంఎఫ్(ఇంపాజిబుల్ మిషన్ ఫోర్స్) నుంచి నియమించబడతాడు. అయితే ఇదే క్రమంలో ఈతన్ ఎన్టీటీ అనే ఒక డేంజరస్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కోసం తెలుసుకుంటాడు. మరి ఈ ఏఐ ని కంట్రోల్ చేయాలంటే రెండో కీ చాలా అవసరం. మరి ఈ కీ ని ఈతన్ కనుక్కుంటాడా లేదా? అదెక్కడ ఉంది? ఈ క్రమంలో తనకి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ ఏఐ ప్రపంచానికి అంత ప్రమాదకరమా? మరి ఈతన్ ఆ పవర్ ఫుల్ ఏఐ ని ఎదుర్కొని మిషన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇది కాగా మరి ఈ అంఛన్లకి తగ్గట్టుగా సినిమాలో కనిపించే పలు ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ని సహా యాక్షన్ మూవీ లవర్స్ ని థ్రిల్ చేస్తాయని చెప్పాలి. మరి ఈ చిత్రంలో కనిపించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పాటుగా హీరో టామ్ క్రూయిజ్ అయితే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్డ్ పెడతాడు అని చెప్పాలి. తన ఈజ్ అండ్ స్టైలిష్ యాక్టింగ్ అలాగే బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్ లలో టామ్ అదరగొడతాడు.

అలాగే తన సింపుల్ డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఇక అలాగే ప్రముఖ నటి హైలే అట్వేల్ ఇంప్రెసివ్ నటనను కనబరిచింది. మెయిన్ గా టామ్ తో ఉన్న అన్ని సీక్వెన్స్ లు చూడ్డానికి బాగుంటాయి. ఇక అలాగే ఫ్రెంచ్ నటి పామ్ క్లెమెంటిఫెస్ సాలిడ్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఫస్టాఫ్ లోని ఛేజింగ్ సీక్వెన్స్ సహా సెకండాఫ్ లోని ట్రైన్ సీక్వెన్స్ లు అయితే సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా ఇవి ప్రతో ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఈ చిత్రంలో మోస్ట్ పవర్ ఫుల్ థింగ్ గా ప్రెజెంట్ చేసిన ఏఐ కి సంబంచిన సన్నివేశాల్లో మరింత డీటెయిల్స్ చూపించాల్సింది. అలాగే సినిమా ఎండింగ్ లో కూడా దీనికోసం ఏమన్నా హింట్ ఇస్తే బాగుండు. ఇక ముఖ్య నటులు ఈసై మోరలెస్ అలాగే విలన్ గాబ్రియేల్ రోల్స్ ని ఇంకా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయాల్సింది.

తనపై మరిన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లు పెట్టి ఉంటే తన రోల్ మరింత స్ట్రాంగ్ గా కనిపించి ఉండేది. వీటితో పాటుగా సినిమా సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా కొనసాగినట్టు అనిపించదు. అలాగే టామ్ మరియు తన ఫ్రెండ్స్ కొలీగ్స్ పై మరికొన్ని ఫన్ ఎలిమెంట్స్ ని ఏమన్నా జోడించి ఉంటే కాస్త సీరియస్ నరేషన్ లో చిన్న ఫన్ లా అనిపించేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు అయితే గత సినిమాల కంటే ఎక్కువే ఉన్నాయి తప్ప తక్కువ స్థాయిలో లేవని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో టెక్నీకల్ అండ్ యాక్షన్ డిజైన్ టీం ని వారి ఎఫర్ట్స్ ని మెచ్చుకొని తీరాలి. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని చాలా గ్రాండ్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ తో అయితే వారు తీర్చిదిద్దారు.

కెమెరా వర్క్ సహా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు చూసే ఆడియెన్స్ కి మంచి థ్రిల్ ని కలుగజేస్తాయి. అయితే ఎడిటింగ్ సెకండాఫ్ ని బెటర్ గా కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు క్రిస్టోఫర్ మాక్ క్యురే ఈ పార్ట్ ని హ్యాండిల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చిన్న డీటెయిల్స్ మినహా తన వర్క్ అయితే ఈ చిత్రానికి సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకోనింగ్ పార్ట్ 1” టామ్ ఫ్యాన్స్ కి అలాగే ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి ఓ మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పొచ్చు. సినిమాలో గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ లు గాని వాటిని పెర్ఫామ్ చేసిన టామ్ కానీ ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి.. అయితే జస్ట్ కొన్ని ఫ్లాస్ మినహాయిస్తే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ లో చూసి ధారాళంగా ఎంజాయ్ చేయవచ్చు.

 

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version