సమీక్ష : మిస్టర్ అండ్ మిస్ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాలేదు

సమీక్ష : మిస్టర్ అండ్ మిస్ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాలేదు

Published on Jan 30, 2021 3:02 AM IST
30 Rojullo Preminchadam Ela movie review

విడుదల తేదీ : జనవరి 29, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.25/5

నటీనటులు: సైలేష్ సన్నీ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, పవన్ రమేష్, భరత్ రెడ్డి కురుగుంట్ల, చాందిని రావు, రాకెట్ రాఘవ, లక్ష్మణ్ మీసాలా
దర్శకుడు: అశోక్ రెడ్డి
నిర్మాత: అశోక్ రెడ్డి
సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్
ఎడిటర్: కార్తీక్ కట్స్


షార్ట్ ఫిల్మ్స్ ఫేమ్ సన్నీ హీరోగా జ్ఞ్యానేశ్వరి హీరోయిన్ గా అశోక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ అండ్ మిస్”. లేటెస్ట్ గా విడుదల కాబడిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యిందనే నిరాశలో ఉన్నపుడు శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్ లో అనుకోకుండా శివ(సన్నీ) ను ముద్దు పెట్టుకుంటుంది. మరి అక్కడ నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. ఆమె అతనిపై ఇష్టం పెంచుకొని అతనికి అన్ని విధాలా సాయపడే విధంగా నడుచుకుంటుంది. వారి రిలేషన్ అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడే కొన్ని కారణాల చేత ఇద్దరూ విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి సరిగ్గా అదే సమయంలో శివ ఫోన్ మిస్సవుతుంది. మరి ఇక్కడ నుంచి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? ఆ ఫోన్ కు ఈ కథకు ఉన్న లింక్ ఏంటి? అంత ఇంపార్టెన్స్ ఉందా? వీరిద్దరి రిలేషన్ ఏమయ్యింది? ఫైనల్ గా ముగింపు ఎలా వచ్చింది అన్నది తెలియాలి అంటే ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటగా నటీ నటుల కోసం చెప్పుకున్నట్టయితే హీరోయిన్ జ్ఞ్యానేశ్వరి మంచి రోల్ చేసింది. తనకిచ్చిన రోల్ ను చక్కగా చేసింది. మంచి నటన అలాగే గ్లామర్ పాళ్లను కూడా బాగా కనబరిచింది. అలాగే హీరో సన్నీ కూడా మంచి నటనను కనబరిచాడు. ఓ చిన్న కుగ్రామం నున్నచీ వచ్చిన వాడిలా డీసెంట్ నటన ఇచ్చాడు.

అలాగే మరికొన్ని సన్నివేశాల్లో ఇంకా మంచి నటనను కనబర్చి ఉంటే బాగుణ్ణు. అలాగే మెయిన్ లీడ్ మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్స్ లో వీరిద్దరి నటన ఆకట్టుకుంటుంది. ఇంకా అలాగే రెండు పాటలు విజువల్ గా బాగా అనిపిస్తాయి. అలాగే ఇతర నటీనటులు మంచి తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని అతి పెద్ద బ్యాక్ డ్రాప్ సెకండాఫ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి సెల్ ఫోన్ పోయే సన్నివేశం నుంచి సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. కానీ అక్కడ నుంచే సినిమా నిరాశ పరుస్తుంది. దానిని వెతికే ప్రక్రియలో సీన్స్ అవేవి అంతగా ఆకట్టుకునేలా అనిపించవు.

అలాగే ఆ ఎపిసోడ్ కు సంబంధించి కూడా ఎక్కడా కూడా పొంతన ఉండదు చాలా సిల్లీగా అనిపిస్తుంది. పైగా దానిని ముగించిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. పైగా హీరో మరియు హీరోయిన్స్ మీదనే ఎక్కువ సీన్స్ ఉండడం వల్ల మిగతా సినిమాపై ఎలాంటి స్కోప్ కనిపించదు.

ఇవన్నీ నిరాశ కలిగించే అంశాలే అని చెప్పాలి. అలాగే హీరో కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. చాలా సన్నివేశాల్లో నటన కూడా అంతగా బాగోదు ఫేక్ ఎమోషన్స్ తో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని లాజిక్కులు అయితే ఏంటో.. అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలోని సాంకేతిక వర్గం పనితనం బాగుంది డైలాగ్స్ మరియు ఎడిటింగ్ అలాగే సినిమాటోగ్రఫీ బాగుంటాయి. ఈ విషయంలో నిర్మాత నిర్మాణ విలువలు బాగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు అశోక్ రెడ్డి పనితనానికి వస్తే తాను ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ను అనుకున్నా దానిని మాత్రం ఆకట్టుకునే విధంగా చూపించలేకపోయారు. అలాగే తాను రాసుకున్న లైన్ కు కొన్ని అనవసర సన్నివేశాలను యాడ్ చేసి సినిమాలోని మెయిన్ సోల్ ను దెబ్బ తీశారు. అందువల్ల ఈ సినిమా నిరాశ పరుస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టైయితే ఈ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సినిమా మెయిన్ లైన్ పర్వాలేదు అనిపించినా దానిని తెరకెక్కించిన విధానం నిరాశ పరుస్తుంది. హీరో నటన కూడా ఇంకా మెరుగ్గా ఉంటే బాగుణ్ణు, కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉన్నా పూర్తి స్థాయిలో మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు