ఓటీటీ సమీక్ష: ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 వాల్యూమ్ 1 నెట్‌ప్లిక్స్‌లో ప్రసారం

ఓటీటీ సమీక్ష: ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 వాల్యూమ్ 1 నెట్‌ప్లిక్స్‌లో ప్రసారం

Published on Sep 4, 2021 8:59 PM IST

నటీనటులు: అల్వారో మొర్తె, ఉర్సుల కార్బెరో, ఇట్జియర్ ఇటునో, పెడ్రో ఆల్సోనో, పకో టౌస్, ఆల్బా ఫ్లోరెస్, మిగుయెల్ హెరెన్, జైమ్ లొరెంతే, ఎస్తర్ ఎకెబో, ఎన్రిక్ ఎర్స్, మరియా, డార్కో పెరిక్, కిటి మనోర్కోవ్, హోవర్ నిమ్రి, లుకా పెరోస్, బెలోన్ క్యూస్టా, ఫెర్నాండో కయో

దర్శకుడు: అలెక్స్ పినా

నిర్మాత: సోనియా మార్టినెజ్, జీసస్ కోల్మెనార్, ఎస్తేర్ మార్టినెజ్ లోబాటో, నాచో మనుబెన్స్

సంగీత దర్శకుడు: మానెల్ శాంటిస్టెబన్

సినిమాటోగ్రఫీ: మిగ్ అమోడో

ఎడిటర్: డేవిడ్ పెలెగ్రాన్, లూయిస్ మిగ్యుల్ గొంజాలెజ్ బెడ్‌మార్, వెరోనికా కాలిన్, రౌల్ మోరా, రెజినో హెర్నాండెజ్, రాక్వెల్ మర్రాకో, ప్యాట్రిసియా రూబియో

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ‘మనీ హీస్ట్’ సీజన్ 5 తాజాగా నెట్‌ప్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ చివరి సీజన్ యొక్క మొదటి వాల్యూమ్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

మనీ హేస్ట్ 4 వ సీజన్ ముగిసిన చోటు నుంచే సీజన్ 5 వాల్యూమ్ 1 మొదలవుతుంది. ఇందులో ముఠా భయపెట్టే బందీలను ఎదుర్కోవలసి ఉండడం మరియు తమలో తమకు తలెత్తుతున్న అంతర్గత యుద్ధాన్ని కూడా పరిష్కరించుకోవలసి ఉన్నందున బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లోపల ఒకింత ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇదంతా సియెర్రా ప్రొఫెసర్‌ని బందీగా ఉంచినప్పుడు జరుగుతుంది.

 

ప్లస్ పాయింట్స్:

 

మొదటి ఎపిసోడ్ మంచి యాక్షన్ మరియు ఉద్రిక్త క్షణాలతో కూడుకుని ఉండడంతో మంచి ప్రారంభం అని చెప్పుకోవాలి. గత సీజన్‌ల మాదిరిగానే ఈ సీజన్ మొదటి వాల్యూమ్‌లో కూడా తదుపరి ఏమి జరుగుతుందో ఊహించడం చాలా కష్టంగానే అనిపిస్తుంది.

ఇక బలమైన సంఘర్షణ పాయింట్ ప్రారంభంలోనే స్థాపించబడింది. సియెర్రా ప్రొఫెసర్ ట్రాక్ మంచి సస్పెన్స్ కారకాన్ని కలిగిస్తుంది. భావోద్వేగ కనెక్షన్ పాయింట్ ఆకట్టుకుంటుంది. నైరోబి మరణం మరియు ముఠా సభ్యులపై ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా విజయవంతం అయ్యే సన్నివేశాలు బాగా ప్రదర్శించబడ్డాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ సిరీస్ చివరి రెండు ఎపిసోడ్‌ల నుంచి కూడా ట్విస్టులు ఉన్నప్పుడు పలు సందర్భాల్లో లాజిక్ అనేది మిస్ అవుతూ వస్తుంది. దీని కారణంగా కథ యొక్క ప్రామాణికత అనేది ఒకింత దెబ్బతింటుంది.

ఇక ఏదైనా క్యారెక్టర్ ఆపదలో ఉన్నప్పుడు అందులో నుంచి బయటపడేందుకు అనుగుణంగా స్క్రీన్ ప్లేని రచించారు. అయితే మొదటి సీజన్ నుండి ఇదే ప్రధానమైన మైనస్ పాయింట్ అయినప్పటికీ కూడా సీజన్ 5లో మళ్ళీ అదే రిపీట్ చేశారు

 

సాంకేతిక విభాగం:

 

మనీ హీస్ట్ క్రైమ్ సిరీస్ అనూహ్యమైన కథనాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. సీజన్ 5 యొక్క మొదటి వాల్యూమ్ కూడా అదే విధంగా ఉంది. చాలా భాగాలకు రచన పదునైనది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది మరియు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

 

తీర్పు:

 

మనీ హెయిస్ట్ సీజన్ 5 వాల్యూమ్ 1 అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉంది అంతేకాకుండా చాలా మంచి ఎమోషనల్ కనెక్ట్‌ని కూడా కలిగి ఉంది. అయితే కొన్ని సమయాల్లో స్క్రీన్ ప్లేని అణుగుణంగా మార్చుకోవడం అనేది ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. అయితే వాల్యూమ్ 1 మంచి ముగింపునివ్వడంతో ఈ సంవత్సరం డిసెంబర్ 3న విడుదల కాబోతున్న వాల్యూమ్ 2పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఈ వారాంతంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది ఒక మంచి వీక్షణ అవుతుందని చెప్పవచ్చు.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు