సమీక్ష : “మోనికా, ఓ మై డార్లింగ్” – తెలుగు డబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

సమీక్ష : “మోనికా, ఓ మై డార్లింగ్” – తెలుగు డబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

Published on Nov 12, 2022 3:43 PM IST
Monica, O My Darling Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, హుమా ఖురేషి, రాధికా ఆప్టే, సికందర్ ఖేర్, సుకాంత్ గోయెల్, ఆకాంక్ష రాజన్ కపూర్, భగవతి పెరుమాల్, జైన్ మేరీ

దర్శకుడు : వాసన్ బాల

నిర్మాతలు: సంజయ్ రౌత్రాయ్ మరియు సరితా పాటిల్

సంగీత దర్శకులు: అచింత్ ఠక్కర్

సినిమాటోగ్రఫీ: స్వప్నిల్ సోనావానే

ఎడిటర్: అతాను ముఖర్జీ

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ థియేటర్స్ తో పాటు ఓటిటి లో కూడా పలు చిత్రాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. మరి ఆ చిత్రాల్లో అయితే ఓటిటి లో రిలీజ్ అయ్యిన చిత్రం మోనికా “ఓ మై డార్లింగ్” కూడా ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యిన ఈ హిందీ నుంచి తెలుగు డబ్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే.. జయంత్ అర్ఖేద్కర్(రాజ్ కుమార్ రావ్) ఓ ప్రముఖ రోబాటిక్ కంపెనీ లో ఓ పెద్ద బాధ్యతని ఆ కంపెనీ సీఈఓ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మరోపక్క జయంత్ అదే కంపెనీ సీఈఓ కూతరు నిక్కీ(ఆకాంక్ష రాజన్ కపూర్) ని పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ అతడు మరోపక్క తన కంపెనీ లో వర్క్ చేసే మరో అమ్మాయి మోనికా మకాడో (హుమా ఖురేషి) తో అఫైర్ నడుపుతాడు. అయితే తర్వాత మోనికా అతడిని బ్లాక్ మెయిల్ చెయ్యడం స్టార్ట్ చేస్తుంది. అంతే కాకుండా అతనితో పాటుగా కంపెనీ లో మరో కొందరు ప్రముఖులు కూడా ఆమె వలలో పడగా వీళ్లందరినీ ఈమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. మరి దీనితో వాళ్ళు ఆమెని ఎలాగైనా చంపెయ్యలని ప్లాన్ చేస్తారు. మరి ఆమెని వాళ్ళు చంపుతారా? లేక ఆమె వాళ్ళ రహస్యాలు బయట పెడుతుందా అసలు లాస్ట్ కి ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా ఈ సినిమా నటీనటుల్లో చూసినట్టు అయితే హీరో రాజ్ కుమార్ రావ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలో తాను ఎంత నాచురల్ పెర్ఫామార్ అనేది అందరికీ తెలుసు. మరి ఈ సినిమాకి కూడా అంతే ఈజ్ తో అయితే నటించాడు. అలాగే హుమా ఈ చిత్రంలో మంచి గ్లామ్ షో తో పాటుగా తన కన్నింగ్ రోల్ ని పర్ఫెక్ట్ గా చేసింది.అలాగే రాధికా ఆప్టే, భగవతి పెరుమాళ్ తదితరులు మెప్పిస్తారు.

ఇక తక్కువ సమయమే కనిపించినా సుకాంత్ గోయెల్ కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేస్తాడు. ఇక సినిమాలో మెయిన్ హైలైట్ గా సంగీతం కోసం చెప్పాలి. ఇందులో బ్యాక్గ్రౌండ్ లో నడిచే మ్యూజిక్ చాలా యూనిక్ మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. సినిమాపై మరింత ఆసక్తిని రేపడం మనం గమనించవచ్చు. ఇక వీటితో పాటుగా కొన్ని సమయాల్లో మంచి టెన్స్ వాతావరణం ట్విస్టులు వంటివి ఇంప్రెస్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం కాస్త డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ కాగా ఇది అందరికీ కనెక్ట్ అయ్యే రేంజ్ లో ఉంటుంది అని చెప్పలేము. చాలా అంశాలు ఒకింత ఓవర్ గా సిల్లీ గా ఈ సినిమాలో కనిపించడం మనం గమనించవచ్చు. ఇక అలాగే దీనితో పాటుగా సినిమా స్టార్టింగ్ నుంచి అలా కథనం మెయిన్ స్టోరీ లోకి వెళ్లే వరకు డల్ గా ఓ మాదిరిగా సాగుతూ ఉంటుంది.

దీనితో చూసే ఆడియెన్స్ కి మొదటి నుంచీ అంత ఎంగేజింగ్ గా సినిమా అనిపించదు. అలాగే సినిమాలో చూపించిన వైలెన్స్ చాలా దారుణంగా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో అయితే ఆడియెన్స్ బాగా డిస్టబ్ అయ్యే రీతిలో సన్నివేశాలు కనిపిస్తాయి.

అలాగే సినిమాలో కొన్ని పాత్రలు మెయిన్ గా కనిపించినా వాటిని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసినట్టు అనిపించదు. పైగా క్లైమాక్స్ లో ముగింపు కూడా ఏదో మిస్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. దీనితో ఉన్న ఫ్లాస్ కూడా కాస్త ఎఫెక్టీవ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు.

 

సాంకేతిక వర్గం :

 

చిత్రంలో నిర్మాణ విలువలు సూపర్బ్ గా ఉన్నాయి. బాలీవుడ్ నుంచి సినిమాలు అంటే ప్రొడక్షన్ లో సాలిడ్ గా కనబరుస్తారు. ఇక టెక్నికల్ టీం లో మొదటగా మ్యూజిక్ ఇచ్చిన అచింత్ టక్కర్ కోసమే చెప్పుకోవాలి తన వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ఎడిటింగ్ పర్వాలేదు. అలాగే తెలుగు డబ్బింగ్, మిక్సింగ్ కూడా మేకర్స్ తెలుగు నుంచి బాగా చేసారు.

ఇక దర్శకుడు వాసన్ బాల విషయానికి అయితే ఈ సినిమా విషయంలో తాను ఆల్ మోస్ట్ మిప్పిస్తారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అంశాలు పక్కన పెడితే తన ప్రెజెంటేషన్ అలాగే తన టెక్నికల్ టీం నుంచి తన మెయిన్ కాస్టింగ్ నుంచి రాబట్టుకున్న అవుట్ పుట్ బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ విషయాల్లో మరింత క్లారిటీగా జాగ్రత్తగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ “మోనికా, ఓ మై డార్లింగ్” చిత్రం తప్పకుండా ఒక కొత్త రకం థ్రిల్ ని అయితే ఆడియెన్స్ కి ఇస్తుంది. అయితే అన్ని వర్గాల ఆడియెన్స్ కి ఇది నచ్చకపోవచ్చు కానీ ఎలాంటి థ్రిల్లర్స్ ని చూసి అయినా ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకునేవారు ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని ఓసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు