విడుదల తేదీ : అక్టోబరు 06, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర, శ్రేయ నవిలే, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు తదితరులు
దర్శకుడు : శ్రీకాంత్ నాగోతి
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
సంగీతం: అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్
ఎడిటర్: రవికాంత్ పెరుపు
సంబంధిత లింక్స్: ట్రైలర్
స్వాతి రెడ్డి మరియు నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన మంత్ ఆఫ్ మధు చిత్రం నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ:
రెండు దశాబ్దాల పెళ్లి తర్వాత, లేఖ (స్వాతి రెడ్డి) తన భర్త మధుసూధన్ రావు (నవీన్ చంద్ర) నుండి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. అదే టైమ్ లో, మధుమిత (శ్రేయ నవిలే) అనే ఒక ఎన్నారై, తన కజిన్ పెళ్లికి హాజరయ్యేందుకు వైజాగ్ వస్తుంది. ఆమె అనుకోకుండా మధుసూధన్ ను కలిసి, అతని పర్సనల్ లైఫ్ లోకి అడుగు పెడుతుంది. తర్వాత ఏమి జరిగింది? ఆమె అతని రిలేషన్ ను ఇంకా బెటర్ గా చేస్తుందా? లేకపోతే మరింతగా దిగజారుస్తుందా? లేఖ మధు నుండి ఎందుకు విడిపోవాలనుకుంటోంది?లేఖ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు సినిమాలో సమాధానాలు ఉన్నాయి
ప్లస్ పాయింట్స్:
ఇందులో మతి స్వాతి రెడ్డి నటన చాలా బాగుంది. తన జీవితంలోని రెండు విభిన్న దశలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అంతేకాక ఎమోషన్ సన్నివేశాల్లో బాగా నటించి, మెప్పించింది.
నవీన్ చంద్ర తన పాత్రలో ఒదిగిపోయాడు. తను నమ్మకాలతో జీవించే వ్యక్తిగా, తాగుబోతు గా మంచి నటనను కనబరిచారు. అతని నటన నిజ జీవితంలోని కొన్ని పరిస్థితులకి అద్దం పడుతుంది.
మధుమిత పాత్రను పోషించిన శ్రేయ నవిలే మంచి నటనతో ఆకట్టుకుంది. ఎలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎన్నారైగా మరియు తన స్వంత నిబంధనలపై జీవితాన్ని గడుపుతుంది. సినిమాలో నటించిన ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాకి మొదటి మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది రన్ టైమ్ అని చెప్పాలి. 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను కలిగి ఉంది. కథలో అంత డెప్త్ లేదు, స్క్రీన్ ప్లే చాలా వీక్ గా, అంతగా ఆకట్టుకోదు. వీటి ప్రభావం నటీనటుల పెర్ఫార్మెన్స్ పై క్లియర్ గా కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో కథ మంచిగా డెవెలప్ అవుతున్నట్లు అనిపించినా, సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి అంతగా అనిపించదు.
రైటర్, డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి యొక్క ప్రెజెంటేషన్‌లో డెప్త్ లేదు. ఫలితంగా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయడం లో విఫలమయ్యాడు.
మంజుల ఘట్టమనేని మరియు రాజా చెంబోలు వంటి పాత్రలు సినిమాపై చాలా తక్కువ ప్రభావం చూపుతాయి. హర్ష చెముడు కామెడీ సీన్స్ ఇంకా బాగా రాసుకుని ఉండొచ్చు. సినిమాలోని పాటలు అంతగా ఆకట్టుకోలేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్ గా లేదు.
సాంకేతిక విభాగం:
రైటర్ గా, డైరెక్టర్ గా శ్రీకాంత్ నాగోతి మంచి డైలాగులతో ఆకట్టుకునే కథనాన్ని రూపొందించలేకపోయాడు.
అచ్చు రాజమణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నప్పటికీ, అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫీ పరవాలేదు. రవికాంత్ పెరుపు ఎడిటింగ్ లో జాగ్రత్త వహించే ఉంటే బాగుండేది.
తీర్పు:
స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన మంత్ ఆఫ్ మధు మొత్తానికి అంతగా ఆకట్టుకోదు. ప్రధాన నటీనటుల పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా, బోరింగ్ మరియు స్లోగా సాగే స్క్రీన్ ప్లే సినిమా ఫలితాన్ని మార్చేశాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లలో అనవసర సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీకెండ్ ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team