సమీక్ష : “మిస్టర్ కింగ్” – బోరింగ్ డ్రామా

Mr. King Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శరణ్ కుమార్, యస్విక నిష్కల, ఉర్వి సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సునీల్

దర్శకుడు : శశిధర్ చావలి

నిర్మాతలు: బి.ఎన్. రావు

సంగీత దర్శకులు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: తన్వీర్ అంజుమ్

ఎడిటర్: శశిధర్ చావలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి పలు చిన్న చిత్రాలు అయితే ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో కొత్త నటుడు శరన్ కుమార్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన చిత్రం “మిస్టర్ కింగ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే..శివ(శరన్ కుమార్) తనకంటూ కొన్ని విలువలు పెట్టుకొని తన లక్ష్యం దిశగా సాగాలని చూస్తాడు. వైమానిక రంగంలో ఇంజినీరింగ్ చేస్తూ తాను ఈ ఫీల్డ్ లో ఓ ప్రాజెక్ట్ చేసి తన కల నెరవేర్చుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలో తన లైఫ్ లోకి ఉమాదేవి(యస్విక నిష్కల) అలాగే వెన్నెల(ఉర్వీ సింగ్) లు వస్తారు. మరి వారు వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది. తాను పెట్టుకున్న లక్ష్యం ఏంటి? తాను చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటి? ఇంతకీ తన లక్ష్యాన్ని తాను చేరుకున్నాడా లేదా అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో డెబ్యూట్ ఇచ్చిన యువ నటుడు శరన్ కుమార్ డీసెంట్ పెర్ఫామెన్స్ అందించాడు. తనకంటూ కొన్ని విలువలు ఉన్న కుర్రాడిలా బాధ్యతలతో బాగా నటించాడు. అలాగే సినిమాలో కనిపించిన కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది.

అలాగే సినిమాలో కనిపించిన హీరోయిన్స్ యశ్విక మరియు ఉమా దేవి లు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. అలాగే తమ లుక్స్ కూడా సినిమాలో బాగున్నాయి. అలాగే సీనియర్ నటులు మురళి శర్మ మరియు తనికెళ్ళ భరణి లాంటి నటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెప్పించే అంశాలు కన్నా దారుణంగా నిరుత్సాహ పరిచే అంశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాలి. అసలు సినిమాలో సరైన కథా కథనాలు ఎక్కడా కనిపించవు. చాలా పేలవమైన లైన్ దానికి మించి పేలవమైన స్క్రీన్ ప్లే మరియు నరేషన్ ని ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.

పైగా ఈ చిత్రం లో చాలా అసందర్భ సన్నివేశాలు బాగా ఉన్నాయి. ఎందుకో చాలా అనవసర సన్నివేశాలు సినిమా నిడివి ఏది సినిమాలో ఎంగేజింగ్ గా ఉండదు. దీనితో ఆడియెన్స్ చాలా బోర్ కొడుతుందని చెప్పాలి. అలాగే సినిమాలో సునీల్ లాంటి నటుణ్ని సరిగ్గా వాడుకోలేదు పైగా మురళీ శర్మ రోల్ కి తన సొంత డబ్బింగ్ కూడా లేదు.

దీనితో ఈ డ్రామా అంత అంత సహజంగా ఎక్కడా అనిపించదు. అలాగే సినిమాలో చాలా చోట్ల ఎక్కడా పొంతన కనిపించదు. అలాగే సినిమాలో పాటలు కూడా ఏమంత ఆకట్టుకునేలా ఉండవు. ఓవరాల్ గా అయితే పరమ బోరింగ్ గా ఈ సినిమా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. టెక్నీకల్ టీం లో అయితే మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే తన్వీర్ అంజుమ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శశిధర్ చావలి ఎడిటింగ్ బాగాలేదు. ఇక తానే ఈ సినిమాకి కథ దర్శకత్వం వహించుకోగా ఈ విషయంలో కూడా తాను ఫెయిల్ అయ్యారని చెప్పక తప్పదు. ఏ అంశంలో కూడా తాను సరైన అవుట్ పుట్ ని అందించలేదు. చాలా రొటీన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమాని నడిపి ఆడియెన్స్ కి చికాకు తెప్పిస్తాడు. సరైన స్క్రీన్ ప్లే లేదు, ఆకట్టుకునే సీన్స్ లేవు, ఓవరాల్ గా మాత్రం తన వర్క్ ఏమీ బాగాలేదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూస్తే ఈ “మిస్టర్ కింగ్” లో కొత్త నటుడు శరన్ కుమార్ పర్వాలేదు అనిపిస్తాడు. మిగతా నటీనటులు పర్వాలేదనిపిస్తారు. కానీ అసలు సినిమాలో ఎలాంటి ఆకట్టుకునే అంశం లేదు. చాలా బోరింగ్ స్క్రీన్ ప్లే, కథ కథనాలు ఏవి ఆకట్టుకోవు. ఈ వారాంతానికి అయితే ఈ సినిమా స్కిప్ చేసేయడమే మంచిది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version