సమీక్ష : ‘మడ్డి’ – స్లోగా సాగే మడ్ రేసింగ్ డ్రామా !

సమీక్ష : ‘మడ్డి’ – స్లోగా సాగే మడ్ రేసింగ్ డ్రామా !

Published on Dec 11, 2021 3:05 AM IST
Muddy Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: యువన్, రిధాన్‌ కృష్ణ, అనుషా సురేష్, అమిత్‌ శివదాస్‌ నాయర్‌ తదితరాలు.

దర్శకత్వం : డాక్టర్‌ ప్రగభల్‌

నిర్మాతలు: ప్రేమ కృష్ణదాస్‌

సంగీత దర్శకుడు: రవి బస్రూర్‌

సినిమాటోగ్రఫీ: కేజీ రతీష్‌

ఎడిటింగ్: శాన్‌ లోకేష్‌

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రంగా వచ్చిన సినిమా `మడ్డి`. ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

ముత్తు (యువన్), కార్తీక్ (రిధాన్‌ కృష్ణ) బ్రదర్స్. అయితే, ఇద్దరికీ పడదు. ఇద్దరి మధ్య వైర్యం ఉంటుంది. ఇక కార్తీక్ మడ్ రేసర్. ఓ రేసులో టోనీ అనే అతన్ని ఓడించి, అతని కాళ్ళ పై వెహికల్ పోనిస్తాడు. టోనీ కాలు విరిగిపోతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య టోనీ, కార్తీక్ పై పగ తీర్చుకోవడానికి వస్తాడు. ఈ క్రమంలో కార్తీక్ పై అటాక్ చేస్తాడు. అప్పుడు ‘ముత్తు’ ఎలా రియాక్ట్ అయ్యాడు ? తన బ్రదర్ ను ఎలా సేవ్ చేశాడు ? చివరకు వీరిద్దరూ ఒకటి అయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

మడ్ రేస్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ ప్రగభల్ ఈ సినిమాని బాగానే తెరకెక్కించాడు. నటీనటుల పెరఫామెన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ అండ్ రేసింగ్ మీద సాగింది. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అలాగే బ్రదర్స్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాలో యువన్, రిధాన్‌ కృష్ణ తమ లుక్స్ లో అండ్ తన యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించారు. మడ్ రేసర్ గా రిధాన్‌ కృష్ణ నటన కూడా బాగుంది. అలాగే యువన్ – అనుషా సురేష్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, సినిమాలో రివీల్ చేసిన రేసింగ్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

మడ్ రేసింగ్ కి సంబంధించిన సన్నివేశాలు బాగానే ఇంట్రెస్టింగ్ గా ఉన్నా… ఫస్ట్ హాఫ్ అంతా బాగా స్లోగా ఉంది. ఇంటర్వెల్ ముందు కథ కొంచెం వేగంగా సాగుతూ సెకండాఫ్ మీద కొంత ఇంట్రెస్ట్ పెంచినా.. సెకండ్ హాఫ్ బాగా స్లోగా సాగుతూ.. సిల్లీ ఎమోషన్స్ మీద నడిచే సీరియస్ డ్రామాగా ఈ సినిమా తేలిపోయింది.

ఇక కథనం కూడా రెగ్యులర్ యాక్షన్ అండ్ రేసింగ్ సన్నివేశాలతోనే వెరీ రొటీన్ గా సాగుతుంది. పైగా సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ విసుగు తెప్పిస్తాయి. అలాగే సినిమాలో ప్రధానమైన పాత్రలను దర్శకుడు పూర్తి పాసివ్ గా నడిపాడు. అలాగే తెలుగు నేటివిటీ పరంగా కూడా సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు రేసింగ్ అంశాలను కలిపి ఈ స్క్రిప్ట్ ను బాగానే రాసుకున్నాడు. అయినప్పటికీ చివరకి రెగ్యుల‌ర్ యాక్షన్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. ఇక నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ కేజీ రతీష్‌ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువ‌లు పర్వాలేదు.

 

తీర్పు :

‘మడ్డి’ అంటూ వచ్చిన ఈ మడ్ రేసింగ్ డ్రామాలో కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. కాకపోతే సినిమా రొటీన్ యాక్షన్ డ్రామాగానే సాగడం, అదేవిధంగా సినిమాలో మెయిన్ ఎమోషన్స్ బలంగా ఎలివేట్ కాకపోవడంతో సినిమా ఫలితం దెబ్బ తింది. అయితే, ఈ చిత్రంలో కొన్ని రేసింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు