విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: అభినవ్ గోమఠం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల
దర్శకుడు: బి.ఎస్. సర్వజ్ఞ కుమార్
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజాల
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్
ఎడిటింగ్: సాయి మురళి
సంబంధిత లింక్స్: ట్రైలర్
తాజాగా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మన తెలుగు చిత్రం అందులోని తెలుగు ప్లాట్ ఫామ్ ఆహా లో అందుబాటులోకి వచ్చిన చిత్రం ” మై డియర్ దొంగ”. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు అభినవ్ గోమఠం నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథ లోకి వస్తే.. ఒక డేటింగ్ యాప్ లో పని చేసే సుజాత(షాలిని కొండెపూడి) తన బాయ్ ఫ్రెండ్ వరుణ్(నిఖిల్ గాజుల) తో రిలేషన్ షిప్ లో ఉంటుంది కానీ అది అంతంత మాత్రమే పాజిటివ్ గా ఉంటుంది. ఇంకోపక్క ఆమె ఫ్రెండ్స్ కూడా దూరం అవుతూ ఉంటారు. ఈ సమయంలో ఓ దొంగ అయినటువంటి సురేష్(అభినవ్ గోమఠం) తన లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు. మరి అతడు వచ్చాక ఆమె లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి? ఇద్దరూ ఒకటవుతారా? అతను దొంగ అని ఆమెకి తెలుసా లేదా లాంటివి తెలియాలి అంటే ఈ సినిమాని ఆహా లో స్ట్రీమ్ చేయాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కనిపించిన షాలిని సినిమాలోనే రైటర్ మాత్రమే కాకుండా ఈ సినిమాకి కూడా తన రచన అందించింది. మరి రచనతో పాటుగా ఈ సినిమాలో ఆమె నటిగా కూడా చాలా బాగా చేసింది అని చెప్పవచ్చు. ఆమె కామెడీ టైమింగ్ కానీ లుక్స్ పరంగా కానీ చాలా బాగుంది. అలాగే అభినవ్ తో కొన్ని సీన్స్ చాలా బావున్నాయి.
ఇక అభినవ్ గోమఠం మరోసారి షైన్ అయ్యాడు అని చెప్పవచ్చు. తనకి తగ్గట్టుగా డీసెంట్ పాత్రలని భిన్నమైన షేడ్స్ లో ప్రెజెంట్ చేస్తూ ట్రీట్ ఇస్తున్నాడు. అలానే ఈ సినిమాలో ఓ దొంగగా, బాయ్ ఫ్రెండ్ గా మెప్పిస్తాడు, నవ్విస్తాడు. అలాగే మరో నటుడు నిఖిల్ కూడా మంచి నటన కనబరిచాడు. షాలిని, అభినవ్ మధ్య సీన్స్ కి తన ఎమోషన్స్ బావున్నాయి. అలాగే దివ్య శ్రీపాద తదితరులు తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ పాయింట్ యూత్ కి కనెక్ట్ అయ్యేవిధంగా బాగానే ఉంటుంది కానీ అది డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఎమోషనల్ డెప్త్ ని మేకర్స్ చూపించలేదు. ఇది ప్రధానమైన మైనస్ కాగా సినిమాలో కొన్ని మూమెంట్స్ చాలా సింపుల్ గా అనిపిస్తాయి. దీనితో చూస్తున్నంత సేపు మరీ అంత ఉత్సుకత ఆడియెన్స్ లో కలగకపోవచ్చు.
ఇక ఏ సినిమాకి అయితే సరైన ముగింపు కూడా అవసరం కానీ ఈ సినిమాలో లాస్ట్ 20 నిమిషాల నరేషన్ చాలా సాదా సీదాగా కొనసాగుతుంది. అలాగే కొన్ని కామెడీ సీన్స్ అంతగా ఆకట్టుకోవు కూడా.. ఇక వీటితో పాటుగా ఎందుకో కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అంశాలు మాత్రం ఈ సినిమాలో అనవసరం చిరాకుగా అనిపిస్తాయి. ఇంకా మొదట్లో షాలిని పాత్ర ఓ అంశాన్ని రైజ్ చేస్తుంది కానీ అది తర్వాత కాస్తా పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నీకల్ టీం లో అజయ్ అర్సడా సంగీతం బాగుంది. అలాగే ఎస్ ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక బి ఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం విషయానికి వస్తే… లైన్ బాగుంది కానీ దానికి మంచి ఎమోషనల్ డెప్త్ ని యాడ్ చేయాల్సింది. కానీ తన నరేషన్ బాగానే ఉంది కొన్ని కామెడీ సీన్స్ ని తెరకెక్కించిన విధానం బాగుంది. ఓవరాల్ తన వర్క్ ఈ సినిమాకి పర్వాలేదు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మై డియర్ దొంగ” లో యూత్ కి కనెక్ట్ అయ్యే లైన్ డీసెంట్ గానే అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. ఇంకా కామెడీ కూడా బాగానే ఉంది కానీ సీరియస్ నెస్ పెద్దగా ఈ సినిమాలో కనిపించదు. అలాగే డల్ మూమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటితో ఓ మాదిరిగా ఓటిటిలో ఈ దొంగ ఓకే అనిపిస్తాడు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team