విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి
దర్శకత్వం : విజయ్ కనకమేడల
నిర్మాతలు : సతీష్ వేగేస్న
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : సిద్
ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్
ఒక సరైన గుర్తింపు అలాగే విజయం కోసం ఎదురు చూస్తున్న మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ‘అల్లరి’ నరేష్ ఈ ఏడాది జస్ట్ గ్యాప్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఇంటెన్స్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “నాంది”తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నరేష్ బ్రేక్ ఇచ్చిందా లేదా అన్నది సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే సూర్య(అల్లరి నరేష్) ఓ సాధారణ మధ్య తరగతి యువకుడు కానీ అనుకోకుండా ఊహించని పరిణామాలతో ఓ కేసు విషయంలో పోలీసుల చేత తాను చెయ్యని నేరానికి అరెస్ట్ చేయబడతాడు దారుణంగా శిక్షించబడతాడు. కానీ అసలు ఎందుకు తాను అరెస్ట్ అయ్యాడో కూడా తెలియని నేపథ్యంలో లాయర్ (వరలక్ష్మి శరత్ కుమార్) ఈ కేసు ను టేకప్ చేస్తుంది. ఇక ఇక్కడ నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? నరేష్ కు చివరికి ఏమయ్యింది? అసలు నరేష్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ చిత్రం ద్వారా మేకర్స్ చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ కూడా నరేష్ తో పాటు మొత్తం చిత్ర యూనిట్ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మరి వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేసే విధంగా ఉందని ఈ సినిమా చూసాక అనిపిస్తుంది. ముఖ్యంగా అల్లరి నరేష్ చేసిన రోల్ అమేజింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కామెడీ రోల్స్ తో పాటుగా కొన్ని సీరియస్ నోట్ పాత్రలను కూడా నరేష్ చేశారు. మరి ఆ అన్నిటిలో కూడా ఈ సినిమాలో నరేష్ చేసిన పాత్ర ది బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ రోల్ లోని బాధని, ఎమోషన్స్ ని చూపించి తనలోని కొత్త నటుడిని నాంది పరిచయం చేసింది. అలాగే మరో వెర్సిటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన రోల్ ను ఇందులో చేసి రక్తి కట్టించారు. కొన్ని కోర్ట్ సీన్స్ లో పోటాపోటీ నటన లాయర్ గా వరలక్ష్మి సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారు. అలాగే లాస్ట్ లో వచ్చినా శ్రీకాంత్ అయ్యంగర్ సాలిడ్ పెర్ఫామెన్స్ చూపించారు. మరి అలాగే ప్రియదర్శి,ప్రవీణ్ సహా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
మరి ఇంకా అలాగే బలమైన ఎమోషన్స్ చాలా బాగున్నాయి లోతుగా అనిపిస్తాయి. అంతే కాకుండా ఒకానొక దశలో సమస్య సాల్వ్ అయ్యింది అనుకుంటే అక్కడ నుంచి మలుపు తీసుకొని వెళ్లిన విధానం కూడా కన్వీనెన్స్ గా అనిపిస్తుంది. అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు డీసెంట్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో ఎమోషన్స్ ముగింపు కూడా చాలా బాగుంటాయి. ఇంకా విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మరింత ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఇక ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ కు వస్తే ఈ చిత్రం మొదటి నుంచీ కూడా ఒక డార్క్ థీమ్ లో కనిపిస్తుంది. అది బాగానే ఉన్నా ఓవరాల్ గా ఎక్కువ సీరియస్ నెస్ అయ్యిపోయినట్టు అనిపిస్తుంది. దీని మూలాన జెనరల్ ఆడియెన్స్ కు కాస్త ఎబ్బెట్టుగా అనిపించొచ్చు.
ఇక అలాగే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే శ్రీకాంత్ అయ్యంగర్ ఎంట్రీ నుంచి వచ్చే పొలిటికల్ డ్రామా దాని తాలూకా ఎపిసోడ్స్ కూడా కాస్త రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే దర్శకుడు తాను చెప్పాలనుకున్న సెక్షన్ 211 కోసం ఇంకా డిటైల్డ్ గా చూపించి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ముఖ్యంగా సిద్ అందించిన కెమెరా వర్క్ అలాగే శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లకు స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఈ చిత్రానికి వీరిద్దరూ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. విజువల్స్ కానీ సంగీతం కానీ ఇంటెన్స్ గా అనిపిస్తాయి. డైలాగ్స్ బాగున్నాయి. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.
ఇక అలాగే దర్శకుడు విజయ్ కనకమేడల విషయానికి వస్తే ఈ సినిమాకు తాను పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయ్ అని చెప్పాలి. తనకిది మొదటి సినిమానే అయినా చాలా వరకు మంచి అవుట్ ఫుట్ ను ఇచ్చే ప్రయత్నమే చేశారు. ఇది హర్షణీయం. అలాగే తాను ఎంచుకున్న పాయింట్ ను ఎక్కడా డీవియేట్ కాకుండా బలమైన ఎమోషన్స్ ను చూపించారు. అలాగే తన స్క్రీన్ ప్లే బాగుంది కానీ సినిమాలో రాసుకున్న కీలక ఎపిసోడ్స్ ను ఇంకా ఎఫెక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “నాంది” నరేష్ కు నటుడిగాను తన కేరీర్ కు కూడా మంచి నాంధి అని చెప్పొచ్చు. అతడి బ్రిలియెంట్ నటన ఖచ్చితంగా ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు, అలాగే సినిమాలోని డార్క్ థీమ్, కంటెంట్ డీసెంట్ గా అనిపిస్తాయి. కానీ సెకండాఫ్ లో మిస్సైన గ్రిప్పింగ్ నరేషన్ రొటీన్ అనిపించే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాస్త దెబ్బ తీస్తాయి. కానీ దర్శకుడు చెప్పాలనుకున్న కొత్త పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం మంచి ఇంటెన్స్ సీరియస్ డ్రామా సినిమాలను కోరుకునే వారికి ఈ చిత్రం తప్పక ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team