విడుదల తేదీ : నవంబర్ 11, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, మధునందన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుమన్
దర్శకుడు : గురు పవన్
నిర్మాత: అట్లూరి నారాయణరావు
సంగీత దర్శకులు: గిఫ్టన్ ఎలియాస్
సినిమాటోగ్రఫీ: సిద్దం మనోహర్
ఎడిటర్: సాగర్ ఉడగండ్ల
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న చిత్రం నార్మల్ బజ్ తో రిలీజ్ అయ్యిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథ లోకి వస్తే.. వైజాగ్ లో ఉండే యువకుడు రాజారామ్(ఉదయ్ శంకర్) తన లైఫ్ లో బి కామ్ కంప్లీట్ చేసి లైఫ్ లో గొప్పగా మారాలి అనుకుంటాడు. అయితే ఓ రోజు తన ఫ్రెండ్ చెర్రీ(మధునందన్) ఓ అర్జెంట్ పని మీద అతన్ని ఓ చోట డ్రాప్ చెయ్యమని అడగ్గా వస్తా అని రాజారామ్ బయలుదేరుతాడు. మరి ఈ సమయంలో రాజారామ్, సాండీ(జెన్నిఫర్ ఇమ్మానుయేల్) ని చూసి లవ్ లో పడి తన ఫ్రెండ్ కోసం మర్చిపోతాడు. ఇక ఇలా అంతా బాగానే నడుస్తుంది అనే సమయంలో ఓ షాకింగ్ అంశం చోటు చేసుకుంటుంది. మరి అదేంటి? తన ఫ్రెండ్ ఏమయ్యాడు? చివరికి ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కాస్త ఆసక్తిగా ఆడియెన్స్ కి కొత్తగా అనిపించే అంశం దర్శకుడు ఎంచుకున్న స్టాక్ మార్కెట్ అంశం అని చెప్పొచ్చు. దీనితో దీని కోసం తెలియని చాలా మందికి తెలీని అంశాలు తెలిపేలా చేసారు. అందులోని లొసుగులు మధ్యతరగతి ఫ్యామిలీ లు ఎదుర్కొనే సమస్యలను డీసెంట్ గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
ఇక నటీ నటుల్లో అయితే నటుడు ఉదయ్ శంకర్ డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. తన కామెడీ టైమింగ్ అలాగే నటుడు మధుతో సన్నివేశాల్లో నటన బాగుంది. అలాగే హీరోయిన్ జెన్నీ నటన తన లుక్స్ లతో ఆకట్టుకుంటుంది. ఇక మరో సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ తనకిచ్చిన రోల్ మళ్ళీ సూపర్బ్ నటన అయితే కనబర్చారు. అలాగే కమెడియన్ పృథ్వీ తదితర నటులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే ఈ సినిమా లాస్ట్ వరకు ఎక్కడా అంత మెప్పించే రేంజ్ లో ఎంగేజింగ్ గా లేదు. చాలా సీన్స్ విసుగు తెప్పించేలా సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే అక్కడక్కడా ఓకే కానీ ఓవరాల్ గా అయితే ఆడియెన్స్ కి అంత ఆకట్టుకునే రేంజ్ లో ఈ సినిమా ఎక్కడా అనిపించదు. అలాగే సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఏమంత మెస్మరైజ్ చేసేలా కూడా ఉండదు.
పైగా ఆ ట్రాక్ లో సన్నివేశాలు కూడా పరమ బోరింగ్ గా అనిపిస్తాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఇంప్రెస్ చేసే రేంజ్ లో లేదు. అలాగే కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించే వాటిని ఇంకా బెటర్ గా తీయడానికి ఆస్కారం ఉన్నా మేకర్స్ ఎందుకో దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. వీటితో అయితే సినిమా చాలా డల్ గా ఆడియెన్స్ కి ఏ పట్టాన ఎక్కనట్టే అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. అలాగే టెక్నీకల్ టీం లో అయితే సంగీతం ఇచ్చిన గిఫ్టన్ వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. అలాగే ఎడిటింగ్ మాత్రం బాగా చేయించాల్సింది.
ఇక దర్శకుడు గురు పవన్ విషయానికి వస్తే తాను సినిమాలో తీసుకున్న సోషల్ ఎలిమెంట్ బాగుంది. దానిపై కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ ఒక పూర్తి స్థాయి సినిమాలా మెప్పించే విధానంలో తాను సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పక తప్పదు. ఇంకా బెటర్ వర్క్ తాను చెయ్యాల్సి ఉంది. లవ్, ఇతర ఎంగేజింగ్ ట్రాక్స్ ని తాం బాగా హ్యాండిల్ చేసి ఉన్నట్టయితే సినిమాకి మంచి ఫలితం దక్కి ఉంటుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” లో మంచి లైన్ అలాగే నటీ నటుల పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి కానీ పూర్తి స్థాయి సినిమాగా అయితే ఈ చిత్రం మెప్పించదు. ఇంకా బెటర్ గా కథనం ని నడిపి ఉంటే ఈ చిత్రానికి బెటర్ రిజల్ట్ వచ్చేది. సరైన వివరణ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లేకపోవడంతో ఈ చిత్రం బిలో యావరేజ్ గా నిలిచిపోతుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team