సమీక్ష : “నల్లమల” – స్లోగా సాగే సందేశాత్మక డ్రామా

సమీక్ష : “నల్లమల” – స్లోగా సాగే సందేశాత్మక డ్రామా

Published on Mar 19, 2022 11:52 AM IST
Nallamala Movie Review

విడుదల తేదీ : మార్చ్ 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, ముక్కు అవినాష్ తదితరులు

దర్శకత్వం : రవి చరణ్

నిర్మాతలు: ఆర్‌.ఎమ్‌

సంగీత దర్శకుడు: పీ.ఆర్

సినిమాటోగ్రఫీ: వేణు మురళి

ఎడిటర్ : శివ సర్వాణి

టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన అమిత్‌ తివారి ఇప్పుడు ‘నల్లమల’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌ భానుశ్రీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఎమున్నావే.. పిల్లా” సాంగ్ సూపర్ హిట్ సక్సెస్‌ని అందుకున్న సంగతి తెలిసిందే. మార్చి 18న ప్రేక్షకుల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

నల్లమల(అమిత్ తివారీ) నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ చిన్న గూడెంలో నివసిస్తుంటాడు. ప్రకృతిని, సాధు జంతువులను ప్రేమిస్తూ మొరటోడులా కనిపించే నల్లమల (అమిత్ తివారీ)కు ఆవులంటే ఎంతో ఇష్టం. ఒక ఆవును తన సొంత అన్నలా చూసుకుంటుంటాడు. అనుకోకుండా ఓ రోజు అతడి ఆవు చనిపోతుంది. అయితే అసలు అతడి ఆవు చనిపోవడానికి గల కారణం ఏమిటీ? అడవిలో జరుగుతున్న అక్రమ రవాణాకి దానికి సంబంధమేమిటీ? ఆ అక్రమ రవాణాని నల్లమల (అమిత్ తివారీ) ఎలా ఎదురించాడు? అనేది తెలియాలంటే పూర్తి సినిమా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

టాలీవుడ్‌లో విలన్‌గా పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమిత్‌ తివారి తొలి సారి హీరోగా మారి “నల్లమల” సినిమా చేసిన ప్రయత్నం బాగుంది. ఇందులో అమిత్ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భాను శ్రీ నటన, గ్లామర్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇక నాజర్‌, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, చత్రపతి శేఖర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇక దర్శకుడు రవి చరణ్‌ తన తొలి సినిమాకి మంచి సందేశాత్మకమైన కథని ఎంచుకున్నాడు. ఆవు అమ్మ లాంటిదని, ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. పీ.ఆర్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి ‘ఏమున్నావే.. పిల్లా’సాంగ్‌ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌ అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

 

డెబ్యూ డెరెక్టర్‌గా కాకుండా ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా రవి చరణ్‌ నల్లమల సినిమాను తెరకెక్కించాడు కానీ ఫస్టాప్‌ కథ కాస్త నెమ్మదిగా సాగడం.. కథపై సెకండాఫ్ చివరి వరకు కూడా క్లారిటీ రాకపోవడం సినిమాకు కాస్త మైనస్‌ అయ్యాయి. ఇక క్లైమాక్స్ ని కూడా మరింత బాగా డిజైన్‌ చేసుకుంటే బాగుండేది.

ఒక భావోద్వేగమైన పాయింట్‌ లో ఎమోషన్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా రాసుకోవాల్సింది. దర్శకుడికి మొదటి సినిమా కావడంతో ఆ అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది.

 

సాంకేతిక విభాగం:

 

ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫి స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ సీన్లు, అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ అద్భుతంగా చూపించారు. ఇక సిద్ శ్రీరామ్ పాడిన “ఏమున్నావే పిల్ల” పాట సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఆవు, అడవి చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌తో తెరకెక్కిన ఓ మంచి సందేశాత్మక కథ “నల్లమల”. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, సెకండాఫ్ చివరి వరకు అసలు కథపై క్లారిటీ రాకపోవడం వంటి అంశాలను పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ సినిమాని పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఓ సారి చూసేయొచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు