సమీక్ష : ‘నాట్యం’ – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఫ్యూర్ నాట్య కథ !

సమీక్ష : ‘నాట్యం’ – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఫ్యూర్ నాట్య కథ !

Published on Oct 23, 2021 3:05 AM IST
Natyam Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 22, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు

దర్శకుడు: రేవంత్ కోరుకొండ‌

నిర్మాతలు: నిశ్రింక‌ళ ఫిల్మ్‌

సంగీత దర్శకుడు: శ్రవణ్ భ‌రద్వాజ్‌

ఎడిటర్: రేవంత్ కోరుకొండ‌

ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

 

సితార (సంధ్యారాజు) చిన్నతనంలోనే అద్భుత నర్తకి కాదంబరి కథ గురించి వింటుంది. ఆ కథ పై ఆసక్తితో నాట్యం నేర్చుకుంటుంది. తన నాట్య రంగ ప్రవేశంలో కాదంబరి కథను తన నాట్యం ద్వారా ప్రజలకు తెలియజేయాలని కల కంటుంది. ఈ మధ్యలో రోహిత్ (రోహిత్ బెహ‌ల్‌) తన డ్యాన్స్ కాంపిటీషన్ లో భాగంగా మంచి కాన్సెప్ట్ కోసం సితార ఉండే ‘నాట్యం’ గ్రామానికి వస్తాడు. అక్కడ వారి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ? సితార పై ఆ గ్రామ ప్రజలు ఎందుకు సీరియస్ అయ్యారు ? అసలు సితార జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఏమిటి ? చివరకు ఆమె కథ ఎలా ముగిసింది ? ఈ మధ్యలో హరి (క‌మ‌ల్ కామ‌రాజు) పాత్ర ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

‘నాట్యం’ అంటూ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాతో వచ్చిన దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ తో అలాగే ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ తో కొత్తగానే ప్రయత్నం చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ నర్తకి సంధ్యారాజు తన క్లాసికల్ డ్యాన్స్ తో పాటు యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది. ఈ సినిమాలో సితార పాత్రకు న్యాయం చేయడానికి ఆమె పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి.

అలాగే హీరో పాత్రలో నటించిన రోహిత్ బెహ‌ల్‌ తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అతను చాలా ఫ్రెష్ గా అనిపించాడు. క‌మ‌ల్ కామ‌రాజు కూడా హరి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. మరో కీలక పాత్రలో నటించిన ఆదిత్య మీన‌న్‌ నటన కూడా బాగుంది. మదర్ క్యారెక్టర్ పోషించిన భానుప్రియ‌ కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. అలాగే శుభ‌లేఖ సుధాక‌ర్‌ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

ఇక ఈ సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మరియు ప్లాష్ బ్యాక్ ఆకట్టుకున్నాయి. సినిమాలో శ్రవణ్ భ‌రద్వాజ్‌ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్:

 

దర్శకుడు రేవంత్ కోరుకొండ నాట్యంతో కథ చెప్పడం అనే కాన్సెప్ట్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. సంధ్యారాజు – రోహిత్ మధ్య సాగే సీన్స్ స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ కూడా లేవు. ఇక కథలోని సంఘర్షణ కూడా సినిమాటిక్ గా సాగుతుంది.

అయితే, క్లాసికల్ డ్యాన్స్ ట్రాక్ బాగున్నా.. ఆ ట్రాక్ లో కూడా అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా సినిమా స్లో నేరేషన్ తో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలకమైన డ్యాన్స్ బేస్ తో సాగే సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ అన్ని ఆకట్టుకునే విధంగా లేవు.

ఇక సెకెండాఫ్ ను ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, అయితే అది వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ముఖ్యంగా కాదంబరి ప్లాష్ బ్యాక్ లో ఎమోషన్ అండ్ ఆ ఫీల్ బాగానే వర్కౌట్ అయినా.. మిగిలిన సెకెండ్ హాఫ్ అంతా అవసరం లేని సీన్స్ తో ఆసక్తికరంగా సాగని ట్రీట్మెంట్ తో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

 

సాంకేతిక విభాగం:

 

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు శ్రవణ్ భ‌రద్వాజ్‌ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు తన దర్శకత్వంతో ఆకట్టుకున్నా.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక నిశ్రింక‌ళ ఫిల్మ్‌ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు:

 

‘నాట్యం అంటే కాళ్లు చేతులు మాత్రమే కదపడం కాదు. ఓ కథను చెప్పొచ్చు’ అనే కోణంలో సాగిన ఈ ‘నాట్యం’లో ప్లాష్ బ్యాక్ సీన్స్, అలాగే ఎమోషనల్ గా సాగే కొన్ని సీన్స్ మరియు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కాకపోతే, వెరీ స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, ఇంట్రెస్ట్ గా సాగని ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, ‘నాట్యం’ పై ఆసక్తి ఉన్నవారితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా పూర్తిస్థాయిలో కనెక్ట్ కాదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు