ఓటిటి రివ్యూ : “నక్సల్బరీ” – హిందీ సిరీస్ జీ 5లో ప్రసారం

ఓటిటి రివ్యూ : “నక్సల్బరీ” – హిందీ సిరీస్ జీ 5లో ప్రసారం

Published on Dec 16, 2020 4:26 PM IST

నటీనటులు : రాజీవ్ ఖండేల్వాల్, టీనా దత్తా, శ్రీజిత దే, సత్యదీప్ మిశ్రా

దర్శకత్వం : పార్థో మిత్రా

నిర్మాతలు : అర్జున్ సింగ్ బరన్, కార్తీక్ నిశాందర్

సినిమాటోగ్రఫీ : మోధుర పాలిత్, హరి నాయర్

 

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము లేటెస్ట్ గా ఎంచుకొన్న వెబ్ సిరీస్ “నక్సల్బరీ”.జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ హిందీ సిరీస్ ఎలా ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఈ సిరీస్ మహారాష్ట్రలోని గడ్చిరోలి అనే ప్రాంతంలో జరిగే నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబడింది. ఈ ప్రాంతంలోనే రాఘవ్ జోషి(రాజీవ్ ఖండేల్వాల్) అనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారిగా అక్కడ నక్సలిజాన్ని అరికట్టి ప్రశాంతమైన ప్రాంతంగా మార్చాలని నియమిస్తారు. ఇక ఇదే సమయంలో అంబర్ కేశ్వని(అమిర్ అలీ) అనే వ్యక్తి సరిగ్గా అదే ప్రదేశంలో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చెయ్యాలని అలాగే తనకు కూడా నక్సల్స్ ను అంతం చేసి తన సామ్రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటాడు. మరి సరిగ్గా ఇదే సమయంలో ఓ ఊహించని ట్విస్ట్ తో పరిస్థితులు అన్ని మారి కొత్తగా మారిపోతాయి. పొలిటికల్ కోణం యాడ్ అవ్వడంతో అక్కడ నుంచి ఈ డ్రామా ఎటు వెళ్ళింది? దానికి నక్సల్స్ కు ఉన్న కనెక్షన్ ఏమిటి అన్నదే ఈ సిరీస్ ఇతివృత్తం.

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ లోని స్పెషల్ కాప్ గా కనిపించిన రాజీవ్ ఖండేల్వాల్ అద్భుతమైన నటనను కనబర్చారని చెప్పాలి. చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన ఈ నటుడు ఎంచుకున్న ఈ రోల్ సాలిడ్ గా ఉంటుంది. ఇక అలాగే పలు ఎమోషన్స్ మరియు ఆసక్తిగొల్పే సన్నివేశాల్లో రాజీవ్ బాగా కనిపించారు. ఇక అలాగే మరో నటుడు ఆమిర్ అలీ కూడా అద్భుతమైన అవుట్ ఫుట్ ను తన సైడ్ నుంచి కూడా ఇచ్చాడు.

మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సిరీస్ కు మంచి ప్లస్సయ్యారని చెప్పొచ్చు. ఇక అలాగే ఈ సిరీస్ లోని యితర పత్రాలు వాటిని డిజైన్ చేసిన విధానం బాగున్నాయి. అలాగే డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మంచి నిర్మాణ విలువలు కూడా ఈ సిరీస్ లో కనిపిస్తాయి. వీటితో పాటుగా పలు పరిశ్రమలు ఎలా దోచేస్తాయో అలాంటి అంశాలను చాలా రియలిస్టిక్ గా చూపించారు.

 

ఏమి బాగోలేదు?

ఇక ఈ సిరీస్ లోని కొన్ని పేలవమైన విషయాలకు వస్తే ఈ సిరీస్ లో అంత కొత్తదైన కథ ఏమీ కనిపించదు. అలాగే సిరీస్ చూస్తున్నంతసేపు జస్ట్ అలా డీసెంట్ గా కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది అంతే తప్పిదే మరీ హై ఎనర్జీ ఇచ్చే సీన్స్ పెద్దగా లేకపోవడం నిరాశ కలిగించే అంశం.

అలాగే కొన్ని ఎపిసోడ్స్ లో చాలా వరకు డిటైలింగ్ మిస్సయ్యినట్టు కూడా అనిపిస్తుంది. మరి ఇంకా ముందు చెప్పినట్టుగానే సిరీస్ ను అలా డీసెంట్ గా హ్యాండిల్ చేయడంతో చాలా వరకు తర్వాత చోటు చేసుకొనే అంశాలను ముందే పసిగట్టేయవచ్చు. అలాగే చెప్పుకోదగ్గ ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా ఈ సిరీస్ లో మిస్సయ్యాయి.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే రియలిస్టిక్ గా ప్లాన్ చేసిన ఈ “నక్సల్బరీ” సిరీస్ జస్ట్ సింపుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. డీసెంట్ నరేషన్ నటీనటుల మంచి పెర్ఫామెన్స్ లు కొన్ని పొలిటికల్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా అంత కొత్తగా అనిపించని కథ ఊహించగలిగే నరేషన్ లు కాస్త నిరాశ పరుస్తాయి. ఓవరాల్ గా అయితే ఇది ఓ సారికి డీసెంట్ వాచబుల్ సిరీస్ అని చెప్పొచ్చు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు