సమీక్ష : న్యూసెన్స్ సీజన్ 1 – ఆహా లో తెలుగు వెబ్ సిరీస్

 Newsense S1 Movie Review in Telugu

విడుదల తేదీ : మే 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నవదీప్, బిందు మాధవి, నంద గోపాల్, రమేష్ కోనంభొట్ల, పూర్ణ చంద్ర, కట్టా ఆంటోని, నల్ల శ్రీధర్ రెడ్డి, గణేష్ తిప్పరాజు, వెంకట రమణ అయ్యగారి, తదితరులు

దర్శకులు : శ్రీ ప్రవీణ్ కుమార్

నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల

సంగీత దర్శకులు: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: అనంతనాగ్ కావూరి, వేదరామన్, ప్రసన్న

ఎడిటర్: శ్రీనివాస్ బైనబోయిన

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో పలు సిరీస్ లు అలానే సినిమాలు ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి. ఇక తాజాగా నవదీప్, బిందు మాధవి జంటగా యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ఆహా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి దీని సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

ఈ మూవీ 2000 సంవత్సరంలో మదనపల్లె ప్రెస్ క్లబ్ లో కొందరు ఫ్రీ లాన్స్ జర్నలిస్టుల తో ప్రారంభం అవుతుంది. అక్కడి స్థానిక రాజకీయ నాయకుల నుండి ముడుపులు తీసుకుని వాస్తవాలని దాచిపెట్టి వారు అవాస్తవాలు రాస్తుంటారు. వారిలో శివ (నవదీప్) ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. అవతలి వారు ఎంత ఇబ్బందిపడిన డబ్బులకోసం అతడు తప్పుడు వార్తలు మాత్రమే రాస్తూనే ఉంటాడు. అయితే అతను స్థానిక న్యూస్ ఛానల్ రిపోర్టర్ నీల (బిందు మాధవి)కి మాత్రం తలవంచుతాడు. అంతా సజావుగానే సాగుతుంది అనుకున్న సమయంలో మధనపల్లె కి చెందిన ఎస్సై ఎడ్విన్ (నంద గోపాల్) ఆ ఫ్రీ లాన్స్ జర్నలిస్టుల వలన తలనొప్పులు ఎదుర్కొంటూ ఉంటాడు. మరి ఆ తరువాత ఏమి జరిగింది, వారిని అతడు పట్టుకున్నాడా లేదా అనేది మొత్తం న్యూసెన్స్ సీజన్ 1 లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ స్టోరీ కోసం తీసుకున్న బేసిక్ అయితే ఎంతో బాగుంది. అటువంటి సెన్సిటివ్ టాపిక్ ని తీసుకుని కథని రాసుకోవడం నిజంగా గ్రేట్. ఈ సిరీస్ లో కొన్ని కీలక సన్నివేశాలు జర్నలిజం మీడియాలోని కొన్ని చీకటి కోణాల్ని బాగా చూపిస్తుంది. ఇక మరికొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని షాక్ కి గురి చేస్తాయి. ఏ విధంగా కొందరు రాజకీయ నాయకులు జర్నలిస్టులని మీడియాని తమ స్వార్ధం కోసం వాడుకుంటున్నారు అనేది చూడవచ్చు. నవదీప్ తన పాత్రలో ఎంతో పవర్ఫుల్ గా నటించడంతో పాటు సహజ నటన కనబరిచాడు. నిజానికి అటువంటి పాత్ర చేయడం అంత సులువు కాదు. కానీ అతడు కొన్ని సీన్స్ లో మరింతగా ఆకట్టుకున్నాడు. నటి బిందు మాధవికి తక్కువగా స్క్రీన్ టైం ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో తను బాగా పెర్ఫార్మ్ చేసింది. ఎస్సై నందగోపాల్ గా ఎంట్రీ ఇచ్చిన ఎడ్విన్ పాత్ర కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సీజన్ లో అతడిని స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ వ్యంగ్యంతో కూడిన తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఇతర పాత్రధారులు కూడా అలరించారు.

 

మైనస్ పాయింట్స్ :

మంచి కథ ఉన్నప్పటికి దానిని ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలా కథనం రాసుకోవడంలో ఈ సిరీస్ యొక్క దర్శకుడు కొంత విఫలం అయ్యారు అనే చెప్పాలి. మరింత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. చాలా సీన్స్ ల్యాగ్ గా అనిపిస్తాయి. అలానే కథనం చాలా చోట్ల నెమ్మదిస్తుంది. ఈ న్యూసెన్స్ సిరీస్ పేపర్ లో రాసుకున్న పరంగా బాగున్నా, దానిని స్క్రీన్ పై ఆడియన్స్ కి ఆకట్టుకునేలా మాత్రం లేదు. కథ యొక్క ప్రారంభంలోనే ఫ్రీ లాన్స్ జర్నలిస్టులు డబ్బుల కోసం ఎథిక్స్ లేకుండా ఎంత దారుణంగా వర్క్ చేస్తారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ చూపించేసారు. ఆ తరువాత చాలా సన్నివేశాలు ఆకట్టుకోవు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మొత్తంగా దీనిని రెండు సీజన్స్ గా రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్, ఫస్ట్ సీజన్ తో మాత్రం డిజప్పాయింట్ చేసారు. దానితో సెకండ్ సీజన్ పై పెద్దగా ఆసక్తి ఏర్పడదు. ఇక కథ ఉన్నంత బలంగా కథనం బలంగా లేకపోవడం పెద్ద మైనస్.

 

సాంకేతిక వర్గం :

సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అనంతనాగ్ కావూరి, వేదరామన్, ప్రసన్న సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. కిరణ్ మామిడి యొక్క ఆర్ట్ వర్క్ 2000 ల కాలాన్ని చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అనవసరమైన ల్యాగ్ ని తొలగించడానికి ఎడిటింగ్ టీమ్ మరింత కృషి చేసి ఉండాల్సింది. ఇక దర్శకుడు శ్రీ ప్రవీణ్ విషయానికి వస్తే అతడు కేవలం పర్వాలేదనిపంచే అవుట్ పుట్ మాత్రమే ఆడించగలిగారు. ప్రియదర్శి రామ్ కథలో స్పార్క్ ఉంది, కానీ అతని స్క్రీన్ ప్లేలో పంచ్ లేదు. దర్శకుడు మరియు స్క్రీన్‌ప్లే రచయిత కథనంపై మరింత పని చేసి ఉంటే బాగుండేది ఉండేది. ఇక డైలాగ్స్ నీట్ గా రాసారు, కొన్ని అయితే ఆలోచింపజేసేలా ఉన్నాయి.

 

తీర్పు :

మొత్తంగా అయితే న్యూసెన్స్ సీజన్ 1 పాక్షికంగా మాత్రమే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. నటుడు నవదీప్ పెర్ఫార్మన్స్, కొన్ని కీలక సీన్స్ మాత్రమే బాగుంటాయి. కథనం ఆకట్టుకోకపోవడంతో చాలా వరకు సిరీస్ బోరింగ్ గా అనిపిస్థాయి. ఇక ఎండింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. మేకర్స్ బాగానే ప్రయత్నించినప్పటికీ కూడా ఓవరాల్ గా మాత్రం న్యూసెన్స్ వెబ్ సిరీస్ సీజన్ 1 కేవలం పర్వాలేదు అని మాత్రమే అనిపిస్తుంది మనకి.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version