విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2020
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సంజయ్ వర్మ, నవీన్ నేని, పునర్నవి భూపాలం, గరిమ సింగ్ తదితరులు.
దర్శకత్వం : సందీప్ చేగురి
నిర్మాతలు : సందీప్ చేగురి
సంగీతం : భరత్ మాచిరాజు
సినిమాటోగ్రఫర్ : రోహిత్ బెచు
ఎడిటర్ :
సంజయ్ వర్మ, గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రలుగా సందీప్ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక చిన్న విరామం’. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
సంజయ్ వర్మ (దీపక్) గరీమ సింగ్ (శ్యాం) ఇద్దరూ బెస్ట్ లైఫ్ పార్టనర్స్ తో పాటు బిజినెస్ పార్టనర్స్ కూడా. అయితే వారి మిల్క్ బిజినెస్ లో అనుకున్నంతగా రిటర్న్స్ రావు. దాంతో బిజినెస్ డెవలప్ చేసుకోవటానికి వాళ్లకు ఒక డీల్ వస్తోంది. తమ కస్టమర్స్ మళ్లీ మళ్లీ రావటానికి వాళ్ళు తీసుకువెళ్లే ఐటమ్స్ లో డ్రగ్ లాంటి కలుపి బిజినెస్ ను డెవలప్ చేసుకోమని ఆ డీల్ వస్తోంది. అయితే ఆ డీల్ కి శ్యాం ఒప్పుకోదు. మరి డబ్బు మీద ప్రేమ చూపించే దీపక్ ఆ డీల్ ను ఒప్పుకుంటాడా ? ఒకవేళ ఒప్పుకుంటే ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? ఆ సమస్యలను తన భర్తను శ్యాం ఎలా కాపాడుకుంది ? చివరికీ డీల్ వెనుక ఉన్న వ్యక్తులు దొరికారా లేదా ? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
వినూత్నమైన థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మంచి సందేశంతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ విజువల్స్ బాగున్నాయి. అలాగే కథాంశాన్ని మరియు నైట్ ఎఫెక్ట్ సెటప్ ను కూడా దర్శకుడు సందీప్ చేగురి కాస్త కొత్తగా రాసుకున్నాడు. ఇక హీరోగా నటించిన సంజయ్ వర్మ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ అలాగే కొన్ని కన్ ఫ్యూజ్డ్ అండ్ సీరియస్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు.
ఇక సంజయ్ వర్మ సరసన హీరోయిన్ గా నటించిన గరీమ సింగ్ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన నటుడు కూడా ఉన్న ఒకటి రెండు సీన్స్ లో బాగానే మెప్పించాడు. అలాగే కమెడియన్ నవీన్ నేని తన కామెడీ టైమింగ్ తో సినిమాకే హైలైట్ గా నిలిచాడు. మరో కీలక పాత్రలో కనిపించిన పునర్నవి భూపాళం కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడికి మంచి విజువల్ సెన్స్ అలాగే కామెడీ సెన్స్ కూడా ఉందని కొన్ని సీన్స్ లో నిరూపించుకున్నాడు.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ బోర్ కొడుతోంది.
సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో చాల సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. మొత్తంగా సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ వీక్ గా ఉండటం కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే సినిమాలో దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నా.. కథాకథనాలు ఆసక్తికరంగా సాగవు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు భరత్ మాచిరాజు అందించిన సంగీతం జస్ట్ పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ట్రీమ్ చేసి చేయాల్సింది. రోహిత్ బెచు సినిమాటోగ్రఫీ చాల బాగుంది. సినిమాకే రోహిత్ బెచు వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజువల్స్ ను ఆయన చాలా అందంగా చూపించారు. దర్శకుడు సందీప్ చేగురి సరైన స్క్రిప్ట్ ను రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన దర్శకత్వం పర్వాలేదు. ఇక నిర్మాతగా కూడా సందీప్ చేగురి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.
తీర్పు :
‘ఒక చిన్న విరామం’ అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు లాజిక్ లేని సన్నివేశాలతో ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే, కొన్ని కామెడీ సీన్స్ తో అక్కడక్కడా నవ్వించడం, అలాగే దర్శకుడు తీసుకున్న కథాంశం వంటి అంశాలు బాగున్నాయి. కానీ, సినిమాలో నాటకీయత పరిధులు దాటేయడం, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team